Angad Bedi | అంతర్జాతీయ పోటీలో గోల్డ్ మెడల్.. దివంగత తండ్రికి అంకితమిచ్చిన బాలీవుడ్ హీరో
Angad Bedi : మోడల్‌గా, నటుడిగా పాపులర్ అయిన బాలీవుడ్ హీరో అంగద్ బేడీ(Angad Bedi) అంతర్జాతీయ క్రీడా వేదికపై చరిత్ర సృష్టించాడు. ఇంటర్నేషనల్ మాస్టర్స్ 2023 అథ్లెటిక్స్ చాంపియన్‌షిప్ (International Masters 2023 Athletics Championship)లో పోటీ పడిన తొలిసారే పసిడి పతకంతో రికార్డుల్లోకెక్కాడు. దుబాయ్ వేదికగా జరిగిన ఈ పోటీల్లో అంగద్ 400 మీటర్ల పరుగు పందెంలో స్వర్ణం కైవసం...
Angad Bedi : మోడల్‌గా, నటుడిగా పాపులర్ అయిన బాలీవుడ్ హీరో అంగద్ బేడీ(Angad Bedi) అంతర్జాతీయ క్రీడా వేదికపై చరిత్ర సృష్టించాడు. ఇంటర్నేషనల్ మాస్టర్స్ 2023 అథ్లెటిక్స్ చాంపియన్‌షిప్ (International Masters 2023 Athletics Championship)లో పోటీ పడిన తొలిసారే పసిడి పతకంతో రికార్డుల్లోకెక్కాడు. దుబాయ్ వేదికగా జరిగిన ఈ పోటీల్లో అంగద్ 400 మీటర్ల పరుగు పందెంలో స్వర్ణం కైవసం చేసుకున్నాడు. అమిద్ తాను గెలిచిన గోల్డ్ మెడల్‌ను ఈమధ్యే కన్నుమూసిన తండ్రి బిషన్‌సింగ్ బేడీ(Bishan Singh Bedi)కి అంకితమిచ్చాడు.
‘ఈ విజయం మానాన్నకు అంకితం. ఎల్లప్పుడూ తల దించుకొని ఉండు. నీవు చేసే పనులే నీ గురించి మాట్లాడుతాయి అని ఆయన ఎప్పుడూ నాతో చెప్తుండేవారు. ఆయన తెలివితేటలను చూసి స్ఫూర్తి పొందేవాడిని. మానాన్న కోసమే ఈ పోటీలో పాల్గొన్నా. ఆయనను ఈ విధంగా గౌరవించాలని అనుకున్నా’ అని బహుమతి ప్రదానం అనంతరం అంగద్ తెలిపాడు. ఈ ఏడాది ఆరంభంలో అంగద్ ముంబైలో జరిగిన పోటీల్లో రజతం పతకం కొల్లగొట్టాడు. అయితే.. అంతర్జాతీయంగా సత్తా చాటాలనే ఉద్దేశంతో అంగద్ ఏడాదికాలంగా కఠోర సాధన చేశాడు. దుబాయ్‌లో 400 మీటర్ల పోటీ మొదలవ్వగానే చిరుతలా పరుగెత్తి.. కేవలం 67 సెకన్లలోనే ఫినిషింగ్ లైన్ దాటి తండ్రికి తగ్గ తనయుడు అనిపించాడు.
భారత మాజీ క్రికెటర్ అయిన బిషన్‌సింగ్ బేడీ ఈమధ్యే కన్నుమూశారు. వృద్ద్యాప్య సమస్యలతో బాధపడుతున్న ఆయన 77 ఏండ్ల వయసులో కాలం చేశారు. లెఫ్ట్ ఆర్మ్ స్పిన్నర్ అయిన బేడీ అనతికాలంలోనే జట్టుపై చెరగని ముద్ర వేశారు. 1966-77 మధ్య టీమ్ఇండియాకు ప్రాతినిధ్యం వహించిన బేడీ .. 67 టెస్టుల్లో 266 వికెట్లు నేలకూల్చాడు.
ఇవి కూడా చదవండి
FairPlay App: ఐపీఎల్ బెట్టింగ్ యాప్ కేసులో ర్యాపర్ బాద్షాను ప్రశ్నిస్తున్న పోలీసులు
Ratan Tata: అది ఫేక్ న్యూస్.. రషీద్ ఖాన్ కు నజరానాపై రతన్ టాటా స్పందన
Read Today's Latest Movie-gossips News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Lulu jobmela | ఈ నెల 27న జాబ్ మేళా.. వివరాలివే
MP Damodar Rao | ఎంపీ దీవకొండ దామోదర్ రావుకు కేసీఆర్ పుట్టినరోజు శుభాకాంక్షలు
Punjab | టోల్ ఫీ తప్పించుకునే యత్నంలో కారు బీభత్సం..!
Potassium | వ్యాయామం చేస్తున్నారా.. పొటాషియం ఉండే వీటిని తింటే మేలు..
Anant Singh expelled | ఎమ్మెల్యే అనంత్ సింగ్‌ను.. పార్టీ నుంచి బహిష్కరించిన జేడీ(యూ)
ట్రెండింగ్ వార్తలు
Amur Falcons | ఏకంగా 23 దేశాలను చుట్టి మణిపూర్‌కు తిరిగొచ్చిన అమూర్ ఫాల్కన్స్..!
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం

