మార్కెట్ కమిటీ చైర్మన్ పీఠం ఎవరి దక్కేనో..?
వ్యవసాయ మార్కెట్ కమిటీలకు కొత్త పాలక వర్గాలను నియమించేందుకు ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. వ్యవసాయ మార్కెట్లకు త్వరలోనే పాలక వర్గాలను ప్రకటిస్తామని ఇటీవల వ్యవసాయశాఖ మంత్రి తుమ్మల నాగేశ్వర్రావు వెల్లడించారు. ఈ నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం వ్యవసాయ మార్కెట్ కమిటీలకు రిజర్వేషన్లను ప్రకటించింది.
- మార్కెట్ కమిటీల ఏర్పాటుకు ప్రభుత్వం కసరత్తు
- ఖరారైన రిజర్వేషన్లు
- త్వరలో కొత్త పాలకవర్గాలు
- ప్రయత్నాలు చేస్తున్న అధికార పార్టీ నేతలు
మెదక్, మార్చి 12(నమస్తే తెలంగాణ): వ్యవసాయ మార్కెట్ కమిటీలకు కొత్త పాలక వర్గాలను నియమించేందుకు ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. వ్యవసాయ మార్కెట్లకు త్వరలోనే పాలక వర్గాలను ప్రకటిస్తామని ఇటీవల వ్యవసాయశాఖ మంత్రి తుమ్మల నాగేశ్వర్రావు వెల్లడించారు. ఈ నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం వ్యవసాయ మార్కెట్ కమిటీలకు రిజర్వేషన్లను ప్రకటించింది. మెదక్ జిల్లాలోని వ్యవసాయ మార్కెట్ కమిటీలకు త్వరలో చైర్మన్లు, వైస్ చైర్మన్లు, కమిటీ సభ్యులను ప్రభుత్వం నియమించనున్నది. మెదక్ మార్కెట్ చైర్మన్ పదవిని బీసీకి కేటాయించగా, చేగుంట ఓసీ, రామాయంపేట ఎస్టీ, పాపన్నపేట ఎస్సీ, నర్సాపూర్ బీసీలకు కేటాయించింది. తూప్రాన్ మార్కెట్ కమిటీ రిజర్వేషన్ ఇంకా ఖరారు కాలేదు. దీంతో పాలకవర్గాలకు సారథ్యం వహించే చైర్మన్ పదవుల కోసం అధికార పార్టీలో పోటీ నెలకొన్నది. జిల్లా ఇన్చార్జి మంత్రి కొండా సురేఖను స్థానిక కాంగ్రెస్ పార్టీ నేతలు ప్రసన్నం చేసుకుంటున్నారు.
ఎవరికీ వారే ప్రయత్నాలు
మార్కెట్ కమిటీ చైర్మన్ కోసం కాంగ్రెస్ నేతలు ముమ్మర ప్రయత్నాలు చేస్తున్నారు. ప్రభుత్వం రాష్ట్రంలోని మార్కెట్ కమిటీలకు ఒక్కొక్కటిగా పాలక వర్గాలను నియమిస్తుండడంతో ఆశావహులు ప్రయత్నాలు ప్రారంభించారు. ప్రస్తుతం మెదక్ జిల్లాలో మెదక్ ఎమ్మెల్యే కాంగ్రెస్ పార్టీ కాగా, నర్సాపూర్ ఎమ్మెల్యే బీఆర్ఎస్ నుంచి గెలుపొందారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత మెదక్ జిల్లాలో అన్ని మార్కెట్ కమిటీలు రెండుసార్లు చైర్మన్ పదవీకాలం పూర్తి చేశారు. ప్రస్తుతం మూడోసారి పదవీ కాలం ప్రారంభంకానున్నది. రెండు పర్యాయాలు బీఆర్ఎస్ చైర్మన్, వైస్ చైర్మన్లు మార్కెట్ కమిటీ పదవుల్లో కొనసాగారు. ఈసారి కాంగ్రెస్ ప్రభుత్వం పాలకవర్గాలకు ఎవరికీ ప్రాధాన్యత ఇవ్వనున్నదో వేచిచూద్దాం.
వీరే అర్హులు
మార్కెట్ కమిటీ పరిధిలోని సన్నకారు రైతులు, ఇతర వ్యవసాయ ఉత్పత్తిదారులు, పశుగణం, పశుగణ ఉత్పత్తిదారులు అర్హులు. వీరిలో కనీసం ఐదుగురు సభ్యులు ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ వర్గాలు, మహిళలై ఉండాలి. కమిటీలో లైసెన్స్ పొందిన వ్యాపారులు ఇద్దరు ఉండాలి. ఇక నలుగురు ఎక్స్అఫీషియో సభ్యులుగా మార్కెట్ పరిధిలోని పీఏసీఎస్, సహకార మార్కెటింగ్ సంఘాల నుంచి ఒక సభ్యుడు, జిల్లా మార్కెటింగ్ శాఖ అధికారి ఒకరు, జిల్లా వ్యవసాయ, ఉద్యాన, పశు సంవర్ధక, మత్స్యశాఖ అధికారుల్లో ఒక సభ్యుడు, మార్కెట్ కమిటీ పరిధిలోని మేయర్, మున్సిపల్ చైర్మన్ లేదా గ్రామ సర్పంచుల్లో ఒకరు ఉంటారు. మార్కెట్ కమిటీ చైర్మన్‌ను 12 మంది రైతుల నుంచి ఒకరిని నియమిస్తారు. వైస్ చైర్మన్‌ను లైసెన్స్ ట్రేడర్స్ సభ్యుల నుంచి లేదా రైతు సభ్యుల నుంచి నియమించవచ్చు.
Read Today's Latest Medak News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

