సి-విజిల్ యాప్ ద్వారా ఫిర్యాదు చేయాలి
ఎన్నికల కోడ్ ఉల్లంఘనలపై సి-విజిల్ యాప్ ద్వారా ప్రజలు ఫిర్యాదు చేయాలని సంగారెడ్డి జిల్లా కలెక్టర్ వల్లూరి క్రాంతి, మెదక్ పార్లమెంట్ రిటర్నింగ్ అధికారి రాహుల్‌రాజ్ ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు.
- ఎన్నికల కోడ్ ఉల్లంఘనలపై స్పందించాలి
సంగారెడ్డి/మెదక్, మార్చి 31 (నమస్తే తెలంగాణ) : ఎన్నికల కోడ్ ఉల్లంఘనలపై సి-విజిల్ యాప్ ద్వారా ప్రజలు ఫిర్యాదు చేయాలని సంగారెడ్డి జిల్లా కలెక్టర్ వల్లూరి క్రాంతి, మెదక్ పార్లమెంట్ రిటర్నింగ్ అధికారి రాహుల్‌రాజ్ ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు. అక్రమంగా నగదు, మద్యం, ఇతర వస్తువులు పంపిణీ చేయ డం, ఎన్నికల కోడ్ ఉల్లంఘనలకు పాల్పడే వాటిని లైవ్ఫొటోలు, లైవ్ వీడియోలను సి-విజిల్ యాప్ ద్వారా తీసి పంపాలని సూచించారు.
అందిన ఫిర్యాదులపై వంద నిమిషాల్లో సంబంధిత అధికారులు చర్యలు తీసుకుంటారని, లైవ్ఫొటోలు, వీడియోలను తీసేటప్పుడు, అప్లోడ్ చేసే సమయంలో జీపీఎస్ ఆన్‌లో ఉంచాలని, జియోగ్రాఫిక్ ఇన్ఫర్మేషన్ ద్వారా లొకేషన్ నమోదవుతుందని, సభలు, సమావేశాల్లో విద్వేషపూరిత కామెంట్స్ చేసినా, పార్టీ అభ్యర్థులు పంచే డబ్బులు, మద్యం, బహుమతులు లాంటి వివరాలను, అనుమతి లేకుండా ర్యాలీలు నిర్వహించినా, ఇతర ఎన్నికల ఉల్లంఘనలపై లైవ్ఫొటోలు, వీడియోలు సి-విజిల్ యాప్ ద్వారా పంపాలని సూ చించారు. సి-విజిల్ యాప్‌ను తమ ఫోన్లోని ప్లేస్టోర్ నుంచి డౌన్లోడ్ చేసుకోవచ్చని తెలిపారు. 1950 టోల్‌ఫ్రీ ద్వారా ఫిర్యాదులు చేయవచ్చని, సి-విజిల్ యాప్ ఫిర్యాదులపై మెదక్ కలెక్టరేట్లో 24గంటలు పర్యవేక్షిస్తారని తెలిపారు. ఫిర్యాదు చేసిన వారి పేర్లు, సెల్‌నంబర్లు గోప్యంగా ఉంచుతామని వెల్లడించారు.
Read Today's Latest Medak News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
firecracker factory explodes | బాణసంచా కర్మాగారంలో పేలుడు.. నలుగురు మృతి
Neha Bora | నేహాబోరాకు ఢిల్లీ హై కోర్టు షాక్.. పీస్ బాండ్‌కు వ్యతిరేకంగా దాఖలు చేసిన పిటిషన్ కొట్టివేత
‘ముదిరాజ్‌లను బీసీ-ఏలో చేర్చే హామీని వ్యతిరేకిస్తున్నాం’
BCCI | బీసీసీఐ నెట్‌వర్త్ తెలిస్తే షాకే.. టాప్ 10 రిచెస్ట్ క్రికెట్ బోర్డులివే
రోడ్డు ప్రమాదాల నివారణకు పటిష్ట చర్యలు : డీఆర్వో పద్మావతి
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

