పారదర్శకంగా ఓటరు జాబితా
డూప్లికేట్ ఓటర్లు లేకుండా సూపర్ చెక్ చేస్తూ పారదర్శకంగా ఓటర్ల తుది జాబితా రూపొందించాలని ఎలక్టోరల్ రోల్ పరిశీలకులు నిర్మల అన్నారు.
- ప్రతి పౌరుడు ఓటరుగా నమోదు చేయించుకోవాలి: కలెక్టర్లు హరీశ్, శరత్
నర్సాపూర్, డిసెంబర్7: డూప్లికేట్ ఓటర్లు లేకుండా సూపర్ చెక్ చేస్తూ పారదర్శకంగా ఓటర్ల తుది జాబితా రూపొందించాలని ఎలక్టోరల్ రోల్ పరిశీలకులు నిర్మల అన్నారు. బుధవారం నర్సాపూర్ ఆర్డీవో కార్యాలయం లో కలెక్టర్ హరీశ్, అదనపు కలెక్టర్ రమేశ్, ఆర్డీవో సాయిరాం, స్వీప్ నోడల్ అధికారి రాజిరెడ్డితో కలిసి సమీక్షా సమావేశం నిర్వహించారు. జిల్లాలోని మెదక్, నర్సాపూర్ నియోజకవర్గంలో ప్రత్యేక ఓటరు నమోదుకు స్వీప్ ద్వారా చేపట్టిన కార్యక్రమాల ప్రగతిని పరిశీలించి సంతృప్తి వ్యక్తం చేశారు.
ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ఓటరు నమోదుకు సమర్పించిన దరఖాస్తులను బీఎల్వోలు గరుడ యాప్‌లో ఆన్లైన్ చేయాలని సూచించారు. మైగ్రేటెడ్ ఓటర్లను పరిశీలించాలని, ఇటుక బట్టీలు తదితర ప్రాంతాల్లో పనిచేస్తున్న వారిని ఓటరుగా నమోదు చేయాలని సూచించారు. పెండింగులో ఉన్న అభ్యంతరాలు, క్లెయిమ్‌లను వెంటనే పరిష్కరించాలని సూచించారు. వంద శాతం లక్ష్యాన్ని సాధించిన వారికి జనవరి 25న ఓటరు దినోత్సవం నాడు ప్రత్యేక బహుమతులు ఇచ్చి ప్రోత్సహించాలని సూచించారు.
అభ్యంతరాలు పరిశీలించి జాబితా తయారు..
సవరణలు, మార్పులు, చేర్పులు, డూప్లికేట్ ఓట్ల తొలగింపు, నియోజకవర్గం మార్పు లాంటి అభ్యంతరాలు పరిశీలించి పారదర్శకంగా ఓటరు జాబితా చేస్తున్నామని కలెక్టర్ హరీశ్ తెలిపారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాకు వచ్చిన 11 వేల ఫొటో ఎపిక్ ఓటరు కార్డులను సంబంధిత అభ్యర్థులకు అందజేస్తామన్నారు. కార్యక్రమంలో అదనపు కలెక్టర్ రమేశ్, ఆర్డీవో సాయిరాం, స్వీప్ నోడల్ అధికారి రాజిరెడ్డి, తహసీల్దార్లు, ఎలెక్షన్ సూపరింటెండెంట్ శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.
ప్రతి పౌరుడికి ఓటు వజ్రాయుధం: ఎన్నికల అబ్జర్వర్ నిర్మల
గుమ్మడిదల,డిసెంబర్7: ప్రతి పౌరుడికి ఓటు వజ్రాయుధం లాంటిదని ఎన్నికల అబ్జర్వర్ నిర్మల అన్నారు. బుధవారం మండలంలోని తహసీల్ కార్యాలయాన్ని ఆమె సందర్శించారు. తహసీల్దార్ సుజాతతో కలిసి ఓట్ల నమోదుపై వివరాలు తెలుసుకున్నారు. బూత్ లెవల్ పని తీరును క్షేత్రస్థాయిలో పరిశీలించారు.
ఈ నెల 8వరకు ఓటరు నమోదు
సంగారెడ్డి కలెక్టరేట్, డిసెంబర్ 7: జిల్లాలో 18 ఏండ్లు నిండిన ప్రతిఒక్కరూ ఓటరుగా నమోదు చేయించుకోవాలని సంగారెడ్డి కలెక్టర్ శరత్ పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ఈ నెల 8 వరకు ఓటరు నమోదు అవకాశమన్నారు. బూత్ లెవెల్ అధికారుల వద్ద, పోలింగ్ కేంద్రాల్లో ఓటరు జాబితాలో తమ పేరు ఉందో లేదో పరిశీలించుకోవాలన్నారు. ఓటరు కార్డు కలిగి ఉన్న వారు కూడా మరోసారి తమ పేరును జాబితాలో సరిచూసుకోవాలన్నారు. ఏమైనా మార్పులు, చేర్పులు ఉంటే వెంటనే ఫారం-8లో దరఖాస్తు చేసుకోవాలన్నారు.
Read Today's Latest Medak News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
IND vs NZ | తిలక్ వర్మ హాఫ్ సెంచరీ.. ఉత్కంఠ పోరులో గెలిచిన టీమిండియా
IndiGo flight | ఇండిగో విమానానికి బాంబు బెదిరింపు.. పార్కింగ్ బే వద్దకు ఫ్లైట్
Udta Teer Review | పాకిస్థాన్ ఏజెంట్ ఇండియా వస్తే.. ‘ఉడ్తా తీర్’ రివ్యూ.!
The Paradise | ఓటీటీలో నాని ‘ది ప్యారడైజ్’ సంచలనం.. 48 గంటల్లోనే రికార్డు స్థాయి వ్యూస్!
El Nino | ఎల్‌నినో ఎఫెక్ట్.. తొలిసారి 30 డిగ్రీలు దాటిన పసిఫిక్ మహాసముద్ర ఉష్ణోగ్రతలు..!
ట్రెండింగ్ వార్తలు
Amur Falcons | ఏకంగా 23 దేశాలను చుట్టి మణిపూర్‌కు తిరిగొచ్చిన అమూర్ ఫాల్కన్స్..!
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం

