ఠారెత్తిస్తున్న టమాటా ఫ్లూ
కరోనా నీడలు వీడకముందే మరో కొత్త వైరస్ అలజడి సృష్టిస్తోంది. ప్రస్తుతం దానిని ‘టమాటా ఫ్లూ’ గా పిలుస్తున్నారు. ఇప్పటి వరకు తెలుగు రాష్ర్టాల్లో ఈ టమాట ఫ్లూ ఆనవాలు కనిపించకపోయినప్పటికీ ప్రజల్లో ఒక ఆందోళనకర చర్చ మొదలైంది. దీంతో రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ అప్రమత్తమైంది. ప్రస్తుతం 5 సంవత్సరాల్లోపు పిల్లల్లో మాత్రమే
కేరళలో నమోదవుతున్న కేసులు
అప్రమత్తమైన వైద్య ఆరోగ్యశాఖ
సిటీబ్యూరో, మే 15 (నమస్తే తెలంగాణ) : కరోనా నీడలు వీడకముందే మరో కొత్త వైరస్ అలజడి సృష్టిస్తోంది. ప్రస్తుతం దానిని ‘టమాటా ఫ్లూ’ గా పిలుస్తున్నారు. ఇప్పటి వరకు తెలుగు రాష్ర్టాల్లో ఈ టమాట ఫ్లూ ఆనవాలు కనిపించకపోయినప్పటికీ ప్రజల్లో ఒక ఆందోళనకర చర్చ మొదలైంది. దీంతో రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ అప్రమత్తమైంది. ప్రస్తుతం 5 సంవత్సరాల్లోపు పిల్లల్లో మాత్రమే కనిపిస్తున్న ఈ కొత్తరకం వైరస్‌పై పూర్తిస్థాయి సమాచారం అందుబాటులో లేదంటున్నారు వైద్యనిపుణులు.
కేరళను వణికిస్తున్న ఈ వైరస్‌తో దాని పొరుగు రాష్ర్టాలైన కర్ణాటక, తమిళనాడు రాష్ర్టాలు ఇప్పటికే అప్రమత్తమయ్యాయి. ఆ రాష్ర్టాల సరిహద్దుల వద్ద చెక్‌పోస్టులు ఏర్పాటు చేసి లక్షణాలున్నవారిని గుర్తించి, ప్రత్యేక చికిత్స అందించే ఏర్పాటు చేసినట్లు అక్కడి అధికారులు చెబుతున్నారు. ప్రస్తుతానికి కేరళను దాటి ఇతర ప్రాంతాల్లో ఎక్కడా కేసులు నమోదు కానప్పటికీ ఏపీ, తెలంగాణ తదితర రాష్ర్టాలు అప్రమత్తమైనట్లు తెలుస్తోంది. ప్రస్తుతం కేరళలోని కొల్లం జిల్లాలో సుమారు 80మందికి పైగా 5ఏండ్లలోపు చిన్నారులు టమాటా ఫ్లూగా పిలుస్తున్న గుర్తుతెలియని వైరస్‌తో బాధపడుతూ దవాఖానలో చేరినట్లు స్థానిక వైద్యాధికారులు వెల్లడించారు.
చికున్‌గున్యా, డెంగ్యూకు దగ్గరి సంబంధాలు
కొత్తగా వెలుగుచూసిన ఈ టమాటా ఫ్లూలో చికున్‌గున్యా, డెంగ్యూకు సంబంధించి దగ్గరి లక్షణాలు కనిపిస్తున్నట్లు వైద్యనిపుణులు చెబుతున్నారు. అయితే అది కచ్చితంగా ఏ రకమైన వైరస్ అనేది తేలాల్సి ఉందన్నారు. వైరస్ వల్ల ఇప్పటి వరకు ఎలాంటి మరణాలు జరగనందున ప్రజలు పెద్దగా ఆందోళన చెందాల్సి అవసరం లేదంటున్నారు.
వైరస్ లక్షణాలు
- చర్మంపై టమాట పరిమాణంలో ఎర్రటి దద్దులు రావడం
- తీవ్రమైన జ్వరం
- జలుబు, దగ్గు, కడుపునొప్పి
- వాంతులు, విరేచనాలు
- ఒంటి నొప్పులు, నీరసం
- డీ-హైడ్రేషన్
- మోకాళ్లు, పిరుదులపై రంగు మారడం
ఆందోళన అవసరం లేదు
సాధారణంగా వైరల్ ఇన్ఫెక్షన్స్ వల్ల పిల్లలకు రకరకాల వ్యాధులు వస్తుండటం సహజం. వేసవికాలంలో సహజంగానే పిల్లలకు ఎక్కువగా వైరల్ ఇన్ఫెక్షన్స్ సోకుతుంటాయి. అయితే టమాటా ఫ్లూ అనేది కొత్తగా వినిపిస్తున్న పేరు. ఇప్పటి వరకు ఈ వైరస్ ఎక్కడా కనిపించలేదు. కొన్ని రోజులుగా కేరళలో కేసులు నమోదవుతున్నట్లు తెలుస్తోంది. కొత్త వైరస్ కారణంగా దీనిపై పూర్తి స్థాయి స్పష్టత రావాల్సి ఉంది. మన తెలుగు రాష్ర్టాల్లో ఎక్కడ కూడా ఈ కొత్త రకమైన కేసులు నమోదు కాలేదు. అయినా ప్రజలు ఎలాంటి ఆందోళనకు గురికావల్సిన అవసరం లేదు.
– డాక్టర్ ఉషారాణి, ప్రొఫెసర్ అండ్ హెచ్‌వోడీ నీలోఫర్ హాస్పిటల్
Read Today's Latest Medak News in Telugu and Telugu News
- Tags
- medak
- scare
- symptoms
- Tomato flu
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

