దుబ్బాక అభివృద్ధికి సహకరించాలి
దుబ్బాక నియోజకవర్గ అభివృద్ధితో పాటు ప్రజా సంక్షేమమే లక్ష్యంగా పనిచేస్తున్నానని స్థానిక ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్‌రెడ్డి అన్నారు. అధికారంలో ఉన్నా...ప్రతిపక్షంలో ఉన్నా ప్రజాసేవకే జీవితం అంకితమని ఆయన పేర్కొన్నారు. దుబ్బాక అభివృద్ధిపై బుధవారం దుబ్బాక ఐవోసీ కార్యాలయంలో కలెక్టర్ మను చౌదరితో కలిసి ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్‌రెడ్డి సమీక్షా సమావేశం నిర్వహించారు.
- రాజకీయాలకు అతీతంగా అభివృద్ధి చేసుకుందాం
- ప్రజా సంక్షేమానికి ప్రజాప్రతినిధులు, అధికారులు పాటుపడాలి
- దుబ్బాక ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్‌రెడ్డి
- కలెక్టర్‌తో కలిసి సమీక్ష
దుబ్బాక, జూన్ 26 : దుబ్బాక నియోజకవర్గ అభివృద్ధితో పాటు ప్రజా సంక్షేమమే లక్ష్యంగా పనిచేస్తున్నానని స్థానిక ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్‌రెడ్డి అన్నారు. అధికారంలో ఉన్నా…ప్రతిపక్షంలో ఉన్నా ప్రజాసేవకే జీవితం అంకితమని ఆయన పేర్కొన్నారు. దుబ్బాక అభివృద్ధిపై బుధవారం దుబ్బాక ఐవోసీ కార్యాలయంలో కలెక్టర్ మను చౌదరితో కలిసి ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్‌రెడ్డి సమీక్షా సమావేశం నిర్వహించారు. అన్నిశాఖల అధికారులతో గంటల పాటు సమీక్షించారు. దుబ్బాకలో అన్ని వసతులు, వైద్యసిబ్బందితో వంద పడకల దవాఖాన ఉన్నప్పటికీ మెరుగైన వైద్య సేవలందించడంలో వైద్యాధికారులు విఫలమయ్యారని కలెక్టర్, ఎమ్మెల్యే అసంతృప్తి వ్యక్తం చేశారు. దవాఖానలో సిజేరియన్లు ఎక్కువగా చేస్తుండడంపై వైద్యాధికారి హేమరాజ్‌పై కలెక్టర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎమర్జెన్సీ కేసులు సిద్దిపేట దవాఖానకు పంపించడంపై మండిపడ్డారు. వైద్యులు, సిబ్బంది అందుబాటులో ఉంటూ ప్రజలకు మెరుగైన వైద్య సేవలందించాలని సూచించారు. నియోజకవర్గంలో ‘మనఊరు-మనబడి’ పనుల బిల్లులు పెండింగ్‌లో ఉన్నాయని, వెంటనే మంజూరు చేయాలని కోరారు.
పాఠశాలల్లో మౌలిక వసతులు కల్పించి, విద్యార్థులకు ఇబ్బందులు లేకుండా విద్యాధికారులు పర్యవేక్షణ చేపట్టాలని సూచించారు. అంగన్వాడీ కేంద్రాల్లో చిన్నారులకు పౌష్టికాహారం సక్రమంగా అందించాలని, పక్కా భవనాలు లేనిచోట ప్రతిపాదనాలు పంపించాలని ఆదేశించారు. గ్రామ పంచాయతీ భవనాలు, కమ్యూనిటీ భవనాలు, అసంపూర్తిగా ఉన్న డబుల్ బెడ్రూమ్ ఇండ్ల నిర్మాణం పూర్తిచేయాలని సూచించారు. డబుల్ బెడ్రూమ్ ఇండ్ల లబ్ధిదారులను ఎంపిక చేసి అందించాలన్నారు. లబ్ధిదారులకు వీలైనంత త్వరగా సర్టిఫికెట్లు అందించాలన్నారు. ఎక్సైజ్ అధికారుల నిర్లక్ష్యంతో గ్రామాల్లో బెల్టు షాప్‌లు విచ్చలవిడిగా వెలిశాయని, చర్యలు తీసుకోవాలని ఎమ్మెల్యే ఆదేశించారు. దుబ్బాక మున్సిపల్లో మరో 20 మంది పారిశుధ్య కార్మికులను నియామకం చేపట్టాలన్నారు. గతంలో మాదిరిగా ఆర్టీసీ బస్‌లు నడిపించక పోవడంతో విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని, ఆర్టీసీ అధికారులు సమస్య పరిష్కరించాలన్నారు. కరెంట్ సమస్యలతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని, వ్యవసాయ శాఖ అధికారులు సైతం అందుబాటులో ఉండకపోవడంతో రైతులు సాగుపరమైన సమస్యలు ఎదుర్కొంటున్నారని ఎమ్మెల్యే మండిపడ్డారు. అందుబాటులో ఉంటూ ప్రజలకు మెరుగైన సేవలందించాలని సూ చించారు. వానకాలం ప్రణాళిక పక్కాగా అమలు చేయాలని యంత్రాంగానికి ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్‌రెడ్డి ఆదేశించారు.
నిర్లక్ష్యం వహిస్తే చర్యలు : కలెక్టర్
దుబ్బాక నియోజకవర్గంలో అధికార యం త్రాంగం సమర్థవంతంగా పనిచేసి పథకాలు, కార్యక్రమాలు సజావుగా అమలు చేయాలని కలెక్టర్ మను చౌదరి ఆదేశించారు. ఈ సమీక్షా సమావేశంలో చర్చించిన సమస్యలను వెంటనే పరిష్కరించేందుకు సంబంధిత అధికారులు చొరవ చూపాలన్నారు. విధుల్లో నిర్లక్ష్యంగా ఉంటే చర్యలు తప్పవని హెచ్చరించారు. సమావేశంలో జడ్పీ చైర్పర్సన్ వేలేటి రోజాశర్మ, దుబ్బాక మున్సిపల్ చైర్పర్సన్ గన్నే వనితాభూంరెడ్డి, జడ్పీటీసీలు రవీందర్‌రెడ్డి, జ్యోతి, ఎంపీపీ పుష్పలతాకిషన్రెడ్డి, పీఆర్ డీఈ విజయ్, డిప్యూటీ డీఎంహెచ్‌వో శ్రీనివాస్, మిషన్ భగీరథ డీఈ విక్రమ్ , సీడీఎస్ సీడీపీవో చంద్రకళ, వ్యవసాయ శాఖ ఏడీఏ శ్యామ్‌సుందర్, మున్సిపల్ కమిషనర్ రమే శ్, తహసీల్దార్ వెంకట్‌రెడ్డి, మున్సిపల్ కౌన్సిలర్లు, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.
Read Today's Latest Medak News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం
Watch: చర్చిలో మరణం గురించి మాట్లాడిన ఫాదర్.. ఆయన తలపై సిలువ పడటంతో మృతి
Samsung Galaxy F70 5G | రూ.17,999కే శాంసంగ్ 5జీ ఫోన్.. 50MP కెమెరా, 5000mAh బ్యాటరీతో వచ్చేసింది!
Black Deer | కుర్సియాంగ్ అడవుల్లో మరో నల్లజింక ప్రత్యక్షం.. పరవశించిన పర్యాటకులు..!
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!

