ఏడుపాయల్లో భక్తుల సందడి
ఏడుపాయల వనదుర్గా భవానీ అమ్మవారి సన్నిధిలో ఆదివారం భక్తుల సందడి నెలకొన్నది. పలు ప్రాంతాల నుంచి వచ్చిన భక్తులు మంజీరా నదిలోని వివిధ పాయల్లో పుణ్యస్నానాలు ఆచరించి, అమ్మవారిని దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు.
పాపన్నపేట, ఫిబ్రవరి11: ఏడుపాయల వనదుర్గా భవానీ అమ్మవారి సన్నిధిలో ఆదివారం భక్తుల సందడి నెలకొన్నది. పలు ప్రాంతాల నుంచి వచ్చిన భక్తులు మంజీరా నదిలోని వివిధ పాయల్లో పుణ్యస్నానాలు ఆచరించి, అమ్మవారిని దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. పలువురు భక్తులు అమ్మవారికి ఒడి బియ్యం, కుంకుమార్చనలు, తలనీలాలు, బోనాలు సమర్పించారు. ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ఏడుపాయల చైర్మన్ సతెల్లి బాలాగౌడ్, ఆలయ ఈవో మోహన్‌రెడ్డి, సిబ్బంది సూర్య శ్రీనివాస్, మధుసూదన్‌రెడ్డి, రవివీర్ కుమార్, లక్ష్మీనారాయణ, ప్రతాప్‌రెడ్డి, తోట నరసింహులు, వరుణాచారి, రాజు, శ్రీకాంత్, సంతోష్, యాదగిరి ఏర్పాట్లు చేశారు. వేద పండితులు శంకర శర్మ, పార్థీవ శర్మ, మురళీధర్ ప్రత్యేక పూజలు నిర్వహించగా, పాపన్నపేట ఎస్సై నరేశ్ ఆధ్వర్యంలో బందోబస్తు చర్యలు చేపట్టారు.
అమ్మవారిని దర్శించుకున్న మాజీ ఎమ్మెల్యే
ఏడుపాయల వన దుర్గామాతను దుబ్బాక మాజీ ఎమ్మెల్యే రఘునందన్‌రావు దర్శించుకున్నారు. ఆయనకు పురోహితులు పూర్ణ కుంభంతో స్వాగతం పలికి, పూజల అనంతరం తీర్థ ప్రసాదాలు అందజేశారు. ఈ సందర్భంగా ఆలయ సిబ్బంది మాజీ ఎమ్మెల్యేను ఆలయ మర్యాదలతో సత్కరించారు.
Read Today's Latest Medak News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
కారేపల్లిలో పలు అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలు ప్రారంభం
Arrest | ఉస్మానియా యూనివర్సిటీ విద్యార్థుల ధర్నా, అరెస్ట్
Weight Loss Medicine | బరువు తగ్గించే మందులను వైద్య సలహా లేకుండా వాడితే ప్రమాదం.. ఎందుకంటే..?
Chandrayan | ‘చంద్రయాన్’ మూవీ రివ్యూ.. గ్రామీణ కుర్రాళ్ల అంతరిక్ష కల ఎలా ఉందంటే?
‘తెలంగాణ ఉద్యమస్ఫూర్తి ప్రతీక కాళోజీ’
ట్రెండింగ్ వార్తలు
పెళ్లికొడుకు, పెళ్లికూతురు ఇద్దరూ పురుషులే.. హిమాచల్ ప్రదేశ్‌లో వింత పండుగ!
Watch: బైకర్పై ఏనుగు దాడి.. అతడ్ని పలుమార్లు తొక్కిన వీడియో వైరల్
Watch: దంపతులు టీవీ చూస్తుండగా ఇంట్లోకి ప్రవేశించిన చిరుత.. తర్వాత ఏం జరిగిందంటే?
Viral News | ఎన్‌క్లోజర్ నుంచి సొరంగం తవ్వి తప్పించుకున్న పెద్దపులి.. తర్వాత ఏమైందంటే..!
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!

