కేసీఆర్ హయాంలోనే గ్రామాల అభివృద్ధి
కేసీఆర్ హయాంలో గ్రామాలు అభివృద్ధి చెందాయని, మారుమూల పల్లెలు సైతం ఆదర్శ గ్రామాలుగా నిలిచాయని మెదక్ జడ్పీ చైర్పర్సన్ ర్యాకల హేమలతాశేఖర్ గౌడ్, ఎమ్మెల్యే వాకిటి సునీతాలక్ష్మారెడ్డి అన్నారు.
- ఆరు గ్యారెంటీలను విస్మరించిన ప్రభుత్వం
- గౌతోజిగూడెం ఆదర్శ గ్రామంగా నిలువడం అభినందనీయం
- మెదక్ జడ్పీ చైర్పర్సన్ హేమలతాశేఖర్ గౌడ్, ఎమ్మెల్యే సునీతాలక్ష్మారెడ్డి
మనోహరాబాద్, జూలై 3: కేసీఆర్ హయాంలో గ్రామాలు అభివృద్ధి చెందాయని, మారుమూల పల్లెలు సైతం ఆదర్శ గ్రామాలుగా నిలిచాయని మెదక్ జడ్పీ చైర్పర్సన్ ర్యాకల హేమలతాశేఖర్ గౌడ్, ఎమ్మెల్యే వాకిటి సునీతాలక్ష్మారెడ్డి అన్నారు. మెదక్ జిల్లా మనోహరాబాద్ మండలం గౌతోజిగూడెంలో రూ.10 లక్షలతో నిర్మించనున్న అంతర్గత మురుగు కాల్వల నిర్మాణానికి బుధవారం భూమిపూజ చేశారు. ఈ సందర్భంగా వారు మా ట్లాడుతూ ఒక్కప్పుడు మధిర గ్రామాలకు నిధులు రావాలంటే కష్టతరంగా ఉండేదని, కేసీఆర్ కృషితో మధిర గ్రామాలు, తండాలు పంచాయతీలుగా ఏర్పడి ఎంతో అభివృద్ధి చెందాయన్నారు. మారుమూల గ్రామమైన గౌతోజిగూడెం జాతీయ, రాష్ట్ర, జిల్లాస్థాయిల్లో ఆదర్శ గ్రామంగా అవార్డులు తీసుకోవడం అభినందనీయమన్నారు. సమష్టి కృషితో ప్రజలు, ప్రజాప్రతినిధులు ఉన్నం దు వల్లే ఇది సాధ్యపడిందన్నారు. గ్రామంలో మిగిలిన అభివృద్ధి పనులకు తమవంతు సహకారం ఎల్లప్పుడూ ఉంటుందని తెలిపారు. అనంతరం మాజీ ఉప సర్పంచ్ రేణుకుమార్ అధ్యక్షతన గ్రామ ప్రజాప్రతినిధులను, పాత్రికేయులను శాలువాలతో సన్మానించి, జ్ఞాపికలను అందజేశారు.
ఆరు గ్యారెంటీలు ఎక్కడా: ఎమ్మెల్యే సునీతాలక్ష్మారెడ్డి
ఆరు గ్యారెంటీలను అమలు చేస్తామని అసెంబ్లీ ఎన్నికల్లో హామీ ఇచ్చి, ప్రజలను మభ్యపెట్టి అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం ఆ మాటను మరిచిపోయిందని ఎమ్మెల్యే సునీతాలక్ష్మారెడ్డి దుయ్యబట్టారు. వృద్ధులకు రూ.4 వేల పింఛన్, మహిళలకు రూ.2500, రూ.500లకే గ్యాస్ వంటి ఎన్నో హామీలు ఇచ్చి అమలు చేయడం లేదని ఆరోపించారు. వాటన్నింటిని అమలు చేయాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో శివ్వంపేట ఎం పీపీ కల్లూరి హరికృష్ణ, బీఆర్ఎస్ మండల అధ్యక్షుడు రమణ గౌడ్, డిప్యూటీ తహసీల్దార్ కౌశిక, మాజీ సర్పంచ్లు వెంకటేశ్వర్లు, పూల అర్జున్, మాధవరెడ్డి, ఉప సర్పంచ్ల ఫోరం మాజీ జిల్లా అధ్యక్షుడు పంచమి రేణుకుమార్, ఉప సర్పంచ్ మహేందర్ గౌడ్, నాయకులు భిక్షపతి, ఆనంద్, మాజీ వార్డు సభ్యులు, గ్రామస్తులు పాల్గొన్నారు.
Read Today's Latest Medak News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
NTR | నెల్సన్ దర్శకత్వంలో రాక్..? ఎన్టీఆర్ను కలిసి కథ చెప్పిన నెల్సన్ దిలీప్కుమార్
India Protests | భారత్లో విద్యార్థి నిరసనల అణచివేతపై ప్రశ్నించండి.. 13 కోట్ల మంది ఓటర్ల తొలగింపు ఆందోళనకరం
MK Stalin | ‘వెన్నుపోటు’ కాంగ్రెస్తో కలిసి పనిచేయం.. సీజేపీ నిరసనలకు స్టాలిన్ మద్దతు
Supreme Court | పనులు చేయకుంటే మేమే ధర్నాకు దిగుతాం.. కేంద్ర ప్రభుత్వంపై సుప్రీంకోర్టు ఆగ్రహం
Greater Noida | గ్రేటర్ నోయిడాలో ఘోర విషాదం.. ఐదుగురి ప్రాణం తీసిన నూడుల్స్, టీ!
ట్రెండింగ్ వార్తలు
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్తో సస్పెండ్

