రాయపోల్ సెప్టెంబర్ 22 : సిద్దిపేట జిల్లా రాయపోల్ మండల పరిషత్ అభివృద్ధి అధికారిగా (ఎంపీడీవో) నరేందర్ రెడ్డి మంగళవారం బాధ్యతలు చేపట్టారు. ఈ సందర్భంగా కార్యాలయ సిబ్బంది ఆయనకు స్వాగతం పలికారు. అనంతరం ఆయన మాట్లాడుతూ..మండలంలో చేపట్టాల్సిన అభివృద్ధి కార్యక్రమాలను సమర్థవంతంగా అమలు చేసేందుకు కృషి చేస్తానని నరేందర్ రెడ్డి తెలిపారు.
ప్రజాప్రతినిధులు, అధికారులు, సిబ్బంది, ప్రజల సహకారంతో మండలాన్ని అన్ని రంగాల్లో ముందుకు తీసుకెళ్లేందుకు చర్యలు తీసుకుంటానని పేర్కొన్నారు. ప్రభుత్వ సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలు అర్హులైన ప్రజలకు సక్రమంగా అందేలా సమన్వయంతో పనిచేస్తామని ఆయన వెల్లడించారు. ఈ కార్యక్రమంలో ఎంపీడీవో కార్యాలయ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.