నా వ్యాఖ్యలను వక్రీకరించారు : కలెక్టర్ వెంకట్రామ్రెడ్డి
కలెక్టర్ వెంకట్రామ్రెడ్డి | ప్రత్యామ్నాయ పంటల సాగుపై సోమవారం సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయంలో నిర్వహించిన సమావేశం రైతుల శ్రేయస్సు కోసమే నిర్వహించాం. యాసంగి సీజన్లో రైతులకు నాణ్యమైన విత్తనాలు విక్రయించాలని విత్తన డీలర్లకు సూచించామని సిద్దిపేట కలెక్టర్ వెంకట్రామ్రెడ్డి పేర్కొన్నారు.

సిద్దిపేట, అక్టోబర్ 26( నమస్తే తెలంగాణ ప్రతినిధి) ప్రత్యామ్నాయ పంటల సాగుపై సోమవారం సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయంలో నిర్వహించిన సమావేశం రైతుల శ్రేయస్సు కోసమే నిర్వహించాం. యాసంగి సీజన్లో రైతులకు నాణ్యమైన విత్తనాలు విక్రయించాలని విత్తన డీలర్లకు సూచించామని సిద్దిపేట కలెక్టర్ వెంకట్రామ్రెడ్డి పేర్కొన్నారు.
దీనిని వక్రీకరించి సామాజిక మాధ్యమాల్లో అసత్యాలను, అర్థ సత్యాలను కొద్దిమంది ఉద్దేశ పూర్వకంగా ప్రచారం చేయడం సరికాదన్నారు. రైతులు నష్టపోయే విధంగా నకిలీ విత్తనాలు రైతులకు విక్రయిస్తే నకిలీ విత్తనాలు విక్రయించే డీలర్లపై కఠిన చర్యలు తీసుకుంటామని చెప్పానన్నారు. అందుకు డీలర్లు సహకరిస్తామన్నారని వివరించారు.
యాసంగిలో వరికి బదులుగా ప్రత్యామ్నాయ పంటలను సాగు చేస్తే రైతులకు ఎక్కువ లాభం జరుగుతుందని చెప్పామన్నారు. పంటల మార్పిడి వల్ల దిగుబడి ఎక్కువగా ఉండడంతో పాటు బహిరంగ మార్కెట్లో మంచి ధర లభిస్తుందన్న ఉద్దేశంతో వ్యవసాయ అధికారులు ప్రతి రైతును కలిసి రైతులను చైతన్యం చేయాలని దిశా నిర్దేశం చేశామన్నారు. తాను చెప్పిన అంశాలను వక్రీకరించి సామాజిక మాధ్యమాల్లో తప్పుడు ప్రచారం చేశారన్నారు.
Read Today's Latest Medak Medak News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Anchor Priyavadhana | కోలీవుడ్‌లో తీవ్ర విషాదం.. 24 ఏళ్ల న్యూస్ రీడర్, నటి ప్రియ వదన మృతి!
Kieron Pollard: ముంబై ఇండియన్స్ ప్రధాన కోచ్‌గా కీరన్ పోలార్డ్
Animal Abuse | కొంపల్లిలో కుక్కపై సెక్యూరిటీ గార్డు లైంగిక దాడి.. క్యాబిన్లోకి తీసుకెళ్లి మరీ అఘాయిత్యం
Fauzi | ‘ఫౌజీ’ గ్లింప్స్‌లో సుభాష్ చంద్రబోస్‌గా కనిపించింది ఎవరో తెలుసా?
Jurala Project | జూరాల ప్రాజెక్టు ఎస్ఈ కార్యాలయంలో పాత రికార్డులు దగ్ధం!
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

