ఆ ఊరి.. గణనాధునికి ‘బొర్ర పోతన’గా పేరు..! తెలంగాణలోనే ఎత్తైన రాతి విగ్రహంగా గుర్తింపు
సహజంగా గణనాధుని అష్టోత్తర శతనామావళితో (108 పేర్లతో) పూజిస్తాం. ఈ పేర్లకు తోడు ఆ గ్రామస్తులు గణనాథునికి మరో పేరును జోడించారు.
మద్దూరు (ధూళిమిట్ట) : సహజంగా గణనాధుని అష్టోత్తర శతనామావళితో (108 పేర్లతో) పూజిస్తాం. ఈ పేర్లకు తోడు ఆ గ్రామస్తులు గణనాథునికి మరో పేరును జోడించారు. సిద్దిపేట జిల్లాలోని వల్లంపట్లలో కాకతీయుల కాలం నాటి ఐదున్నర అడుగుల ఎత్తులో రాతి విగ్రహం భక్తులకు దర్శనమిస్తుంది. సుమారు 20 ఏండ్ల క్రితం దేవతల బావి దగ్గర పడి ఉన్న ఏకదంతుని రాతి విగ్రహంతో పాటు వివిధ దేవతల విగ్రహాలను స్థానికులు పాఠశాల ప్రాంగణంలోకి తరలించారు. అక్కడ నుండి ఏకదంతుని రాతి విగ్రహాన్ని స్థానిక ఆంజనేయ స్వామి ఆలయం కు తీసుకోవచ్చారు.
ఎత్తైన రాతి విగ్రహం ఎదుట పెద్ద రాతి కలశం ఉండేది. రెండు మూడేళ్ల క్రితం ఈ రాతి కలశంను గుర్తు తెలియని వ్యక్తులు ఎత్తుకెళ్లారు. ప్రస్తుతం ఏకదంతుని రాతి విగ్రహానికి ఎలాంటి ఆలయంను నిర్మించలేదు. దీంతో వినాయక విగ్రహంతో పాటు పలు దేవతల విగ్రహాలు ఆంజనేయ సమి ఆలయ ప్రాంగణంలో నిర్లక్ష్యంగా పడి ఉన్నాయి. తెలంగాణలోని ఎత్తైన రాతి విగ్రహంగా గుర్తింపు పొందిన బొర్ర పోతన వినాయ కునికి ఆలయం నిర్మించాలని భక్తులు కోరుతున్నారు.
Read Today's Latest Medak Medak News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Sand Dumps | రైల్వే పనుల ముసుగులో ఇసుక డంపులు..అక్రమ నిల్వలపై అనుమానాలు
Harish Rao | రైతు వేదికల దగ్గరకు రండి అని రైతులతో ఆటలాడుతున్నారు.. అధికారులపై హరీశ్ రావు ఫైర్
సింగరేణి మండలంలో 500 ఎకరాల్లో ఆయిల్‌పామ్ సాగు
మొక్కల వెంకటయ్యకు సత్కారం
Gayatri Devi | ఇంద్రకీలాద్రిపై గాయత్రీదేవి అలంకారంలో దర్శనమిచ్చిన దుర్గాదేవి
ట్రెండింగ్ వార్తలు
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?

