Begumpet students | రాష్ట్రపతి భవవన్కు బేగంపేట విద్యార్థులు
మారుమూల గ్రామంలోని ప్రభుత్వ పాఠశాలలో చదువుతూ జాతీయ స్థాయిలో సైన్స్ ప్రదర్శనల్లో ప్రతిభ చాటిన సిద్దిపేట జిల్లా రాయపోల్ బేగంపేట విద్యార్థులకు అరుదైన అవకాశం లభించింది.
రాయపోల్ : నవంబర్ 24 : మారుమూల గ్రామంలోని ప్రభుత్వ పాఠశాలలో చదువుతూ జాతీయ స్థాయిలో సైన్స్ ప్రదర్శనల్లో ప్రతిభ చాటిన సిద్దిపేట జిల్లా రాయపోల్ బేగంపేట విద్యార్థులకు అరుదైన అవకాశం లభించింది. ఈ నెల 14న న్యూఢిల్లీలోని రాష్ట్రపతి భవన్లో నిర్వహించే బాలల దినోత్సవ వేడుకల్లో పాల్గొనేందుకు సిద్దిపేట జిల్లా రాయపోల్ మండలం బేగంపేట ఉన్నత పాఠశాల విద్యార్థులు, ఉపాధ్యాయులకు ఆహ్వానం అందింది.
జాతీయ స్థాయి సైన్స్ ఎగ్జిబిషన్లు, విజ్ఞాన ప్రదర్శనల్లో విద్యార్థులు ప్రదర్శించిన సృజనాత్మకత, శాస్త్రీయ ఆలోచనలు, నూతన ఆవిష్కరణల ఫలితంగా ఈ అవకాశం దక్కిందని ప్రధానోపాధ్యాయురాలు ప్రమీల తెలిపారు. రాష్ట్రపతిని కలుసుకుని రాష్ట్రపతి భవన్లో జరిగే వేడుకల్లో పాల్గొనడం జీవితంలో మరిచిపోలేని అనుభూతి అని పేర్కొన్నారు.
ఎంతో ఆనందంగా, గర్వంగా ఉంది
రాష్ట్రపతి భవన్‌ను సందర్శించే అవకాశం రావడం ఎంతో ఆనందంగా, గర్వంగా ఉంది. ఉపాధ్యాయుల ప్రోత్సాహంతో ఆత్మవిశ్వాసం, సృజనాత్మకత పెరిగాయని, భవిష్యత్తులో ఉన్నత లక్ష్యాలు సాధించి దేశానికి మంచి పేరు తేవాలన్నదే నా లక్ష్యం.
-దరిపల్లి పావని, 9వ తరగతి
ఈ అవకాశం ఎంతో అదృష్టం
రాష్ట్రపతి భవన్‌ను సందర్శించే అవకాశం రావడం అదృష్టంగా భావిస్తున్నాను. పాఠశాలలో నిర్వహించే సైన్స్ ప్రయోగాలు, తి ప్రాజెక్టులు కొత్త విషయాలు తెలుసుకోవాలనే ఆసక్తిని పెంచాయి. భవిష్యత్తులో శాస్త్రవేత్తగా ఎదిగి దేశ అభివృద్ధికి కృషి చేయాలనేది నా కల.
– మంద హర్షవర్ధన్, 10వ తరగతి

Read Today's Latest Medak Medak News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Rahul Gandhi: నా ఫోన్ ట్యాప్ చేశారు.. మోదీ చర్చకు రావాలి: రాహుల్ గాంధీ
Jangaa | త్రిగుణ్ ‘జంగా’ గ్లింప్స్ విడుదల.. రా అండ్ రస్టిక్ లుక్‌లో అదరగొట్టిన హీరో!
Gadari Kishore | బీర్ల ఐలయ్య బ్రోకర్ లెక్క మాట్లాడుతున్నడు : మాజీ ఎమ్మెల్యే గాదరి కిషోర్
minister’s home attcked | మంత్రి ఇంటిపై దాడి.. ‘మేము చనిపోయాక వస్తారా?’ అంటూ పోలీసులపై ఆగ్రహం
Show cause notices | విధులకు గైర్హాజరైన హెచ్ఎం, ఆరుగురు ఉపాధ్యాయులకు షోకాజ్ నోటీసులు జారీ
ట్రెండింగ్ వార్తలు
పెళ్లికొడుకు, పెళ్లికూతురు ఇద్దరూ పురుషులే.. హిమాచల్ ప్రదేశ్‌లో వింత పండుగ!
Watch: బైకర్పై ఏనుగు దాడి.. అతడ్ని పలుమార్లు తొక్కిన వీడియో వైరల్
Watch: దంపతులు టీవీ చూస్తుండగా ఇంట్లోకి ప్రవేశించిన చిరుత.. తర్వాత ఏం జరిగిందంటే?
Viral News | ఎన్‌క్లోజర్ నుంచి సొరంగం తవ్వి తప్పించుకున్న పెద్దపులి.. తర్వాత ఏమైందంటే..!
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!

