మద్దూరు (ధూళిమిట్ట): సిద్దిపేట జిల్లా ధూళిమిట్ట మండలంలోని బైరాన్ పల్లి గ్రామంలో బతుకమ్మ పండుగ కోసం గ్రామ సర్పంచ్, సర్పంచుల పోరం జిల్లా కార్యదర్శి బర్మ రాజమల్లయ్య ఆధ్వర్యంలో ఏర్పాట్లు చేస్తున్నారు. ప్రధానంగా గ్రామంలో నలువైపులా వీధిలైట్ల ఏర్పాటు, బతుకమ్మ ఆడుకునే ప్రదేశాలను శుభ్రం చేస్తున్నారు. బతుకమ్మ నిమజ్జనం చేసేందుకు వీలుగా చెరువు వద్ద పలు ఏర్పాటు చేస్తున్నారు.
చెరువు వద్ద ఎలాంటి ప్రమాదాలు జరగకుండా ముందస్తు చర్యలు తీసుకుంటున్నారు. తెలంగాణ సంస్కృతి సాంప్రదాయానికి ప్రత్యేకగా నిలిచే బతుకమ్మ వేడుకలను గ్రామంలో అత్యంత వైభవంగా నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు చేస్తున్నట్లు గ్రామ సర్పంచ్ తెలిపారు.