తండాల అభివృద్ధికి కృషి
హుస్నాబాద్ ప్రాంతంలోని గిరిజన తండాల సమగ్రాభివృద్ధికి కృషి చేస్తానని రవాణా, బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు. గురువారం పట్టణంలోని యేనెపై గల బంజారా భవన్లో గిరిజనుల ఆరాధ్య దైవం సంత్ సేవాలాల్ మహారాజ్ 285వ జయంతిని నిర్వహించారు.
- రవాణా, బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్
- హుస్నాబాద్‌లో ఘనంగా సంత్ సేవాలాల్ మహారాజ్ జయంతి
హుస్నాబాద్, ఫిబ్రవరి 15: హుస్నాబాద్ ప్రాంతంలోని గిరిజన తండాల సమగ్రాభివృద్ధికి కృషి చేస్తానని రవాణా, బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు. గురువారం పట్టణంలోని యేనెపై గల బంజారా భవన్లో గిరిజనుల ఆరాధ్య దైవం సంత్ సేవాలాల్ మహారాజ్ 285వ జయంతిని నిర్వహించారు. కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా హాజరైన మంత్రి సేవాలాల్, అమ్మవార్ల చిత్రపటాల వద్ద పూజలు చేశారు. భోగ్భాండార్లో భాగంగా జరిగిన హోమం, గోపూజ కార్యక్రమాల్లో పాల్గొని గిరిజనులతో కలిసి నృత్యాలు చేశారు. అనంతరం జరిగిన సమావేశంలో మంత్రి పొన్నం ప్రభాకర్ మాట్లాడుతూ బంజారాలు సామాజికంగా, ఆర్థికంగా ఎదగాల్సిన అవసరం ఉందన్నారు. నిర్మాణంలో ఉన్న బంజారా భవన్‌కు నిధులు కేటాయించి పూర్తి చేస్తామని హామీ ఇచ్చారు.గిరిజన తండాల పరిస్థితి, అక్కడ జరగాల్సిన అభివృద్ధి, కల్పించాల్సిన సౌకర్యాలపై ఇప్పటికే అధికారులతో సమీక్ష నిర్వహించామన్నారు. సమావేశంలో ఆర్డీవో బెన్ షాలోమ్, తహసీల్దార్ రవీందర్‌రెడ్డి, మున్సిపల్ చైర్పర్సన్ ఆకుల రజితావెంకట్, ఎంపీపీలు లకావత్ మానస, మాలోతు లక్ష్మి, కౌన్సిలర్లు, సింగిల్ విండో చైర్మన్ బొలిశెట్టి శివయ్య, గిరిజన సంఘాల నాయకులు, మహిళలు, వివిధ పార్టీల నాయకులు పాల్గొన్నారు.
హాఫ్ మారథాన్ పోస్టర్ ఆవిష్కరణ
హుస్నాబాద్ రన్నర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో మార్చి 10న నిర్వహించనున్న హాఫ్ మారథాన్ (21కి.మీ.ల పరుగు పందెం) పోస్టర్‌ను రవాణా, బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ ఆవిష్కరించారు. యువకు లు, ప్రజలు పాల్గొనాలని పిలుపునిచ్చారు.
Read Today's Latest Medak News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Asian Para Games | ఆసియా పారా క్రీడల్లో భారత్ సరికొత్త చరిత్ర.. 114 పతకాలతో రికార్డు!
India vs Zimbabwe ODI | షఫాలీ విధ్వంసం.. రావల్ శతకం.. జింబాబ్వేపై భారత్ ఘన విజయం!
firecracker factory explodes | బాణసంచా కర్మాగారంలో పేలుడు.. నలుగురు మృతి
Neha Bora | నేహాబోరాకు ఢిల్లీ హై కోర్టు షాక్.. పీస్ బాండ్‌కు వ్యతిరేకంగా దాఖలు చేసిన పిటిషన్ కొట్టివేత
‘ముదిరాజ్‌లను బీసీ-ఏలో చేర్చే హామీని వ్యతిరేకిస్తున్నాం’
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

