Zaheerabad AO | 14 ఏళ్ల కృషికి జాతీయ గుర్తింపు.. జాతీయ ఉత్తమ అధికారిగా లావణ్య
Zaheerabad AO | గురువారం న్యూఢిల్లీలో కేంద్ర వ్యవసాయ శాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన మహిళా కిసాన్ దివస్- మహిళా కృషి సమృద్ధి జాతీయ వేడుకల్లో తెలంగాణ రాష్ట్రం నుంచి ఉత్తమ మహిళా వ్యవసాయ విస్తరణ అధికారిగా లావణ్య ఎంపికయ్యారు.
Zaheerabad AO | జహీరాబాద్, అక్టోబర్ 15 : కష్టాన్ని నమ్ముకుని, రైతులకు అండగా నిలిచిన 14 ఏళ్ల ప్రయాణానికి ఎట్టకేలకు జాతీయ గుర్తింపు లభించింది. జహీరాబాద్ మండల వ్యవసాయ అధికారిగా విధులు నిర్వహిస్తున్న లావణ్యకు కేంద్ర ప్రభుత్వం అత్యున్నత పురస్కారాన్ని అందజేసింది.
గురువారం న్యూఢిల్లీలో కేంద్ర వ్యవసాయ శాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన మహిళా కిసాన్ దివస్- మహిళా కృషి సమృద్ధి జాతీయ వేడుకల్లో తెలంగాణ రాష్ట్రం నుంచి ఉత్తమ మహిళా వ్యవసాయ విస్తరణ అధికారిగా లావణ్య ఎంపికయ్యారు. ఈ అవార్డును కేంద్ర వ్యవసాయ శాఖ కార్యదర్శి అతీష్ చంద్ర, అదనపు కార్యదర్శి డా. మణిందర్ కౌర్ ద్వివేది చేతుల మీదుగా ఆమె అందుకున్నారు.
క్షేత్రస్థాయిలోనే ఉంటూ..వ్యవసాయ అధికారి అంటే ఆఫీసుకే పరిమితం అనుకునే రోజుల్లో.. లావణ్య మాత్రం పొలం గట్ల వెంటే కనిపిస్తారు. జహీరాబాద్ మండలంలో ఏ రైతుకు ఏ సమస్య వచ్చినా నేరుగా పొలానికి వెళ్లి సలహాలు ఇవ్వడం ఆమె ప్రత్యేకత. ముఖ్యంగా మహిళా రైతులను వ్యవసాయంలోకి తీసుకురావడంలో, వారికి సబ్సిడీ పథకాలు అందించడంలో, సేంద్రీయ వ్యవసాయం, విత్తన మార్పిడిపై అవగాహన కల్పించడంలో ఆమె చేసిన కృషిని కేంద్ర బృందం గుర్తించింది.
భావోద్వేగంగా లావణ్య..
అవార్డు అందుకున్న అనంతరం లావణ్య మాట్లాడుతూ.. ‘ఇది నా ఒక్కదాని విజయం కాదు. నన్ను నమ్మిన జహీరాబాద్ రైతుల విజయం. 14 ఏళ్ల నా సర్వీసులో ఎన్నో ఒడిదుడుకులు ఎదుర్కొన్నా.. రైతుల నమ్మకమే నన్ను ముందుకు నడిపింది. ఈ అవార్డు ఆ నమ్మకానికి దక్కిన గౌరవం” అని భావోద్వేగంగా తెలిపారు.
తెలంగాణ నుంచి ఈ విభాగంలో జాతీయ అవార్డు రావడం ఇదే తొలిసారి కావడం విశేషం. జాతీయ వేదికపై జహీరాబాద్ పేరు వినిపించడంతో జిల్లా వ్యవసాయ శాఖలో సంతోషం వ్యక్తమవుతోంది.
Read Also :
Vijay Deverakonda | ‘రణబాలి’ విడుదల వేళ పుట్టపర్తిలో విజయ్ దేవరకొండ, రష్మిక మందన్న!
President Murmu | మహిళలకు మరింత సాధికారత కల్పించేందుకు కృషి చేయాలి : రాష్ట్రపతి ముర్ము
unknown callers | గుర్తు తెలియని కాలర్స్పై ప్రభుత్వం కీలక నిర్ణయం.. ఇకపై కాలర్ పేరు తప్పనిసరి
Read Today's Latest Medak Medak News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Zaheerabad AO | 14 ఏళ్ల కృషికి జాతీయ గుర్తింపు.. జాతీయ ఉత్తమ అధికారిగా లావణ్య
Stock Market | దూసుకెళ్లిన స్టాక్ మార్కెట్.. 1534 పాయింట్లు లాభపడ్డ సెన్సెక్స్.. ఒక్కరోజే 2 శాతంపైగా లాభం
Power Supply | విద్యుత్ సరఫరా అందించడంలో కాంగ్రెస్ ప్రభుత్వం విఫలం
Randhir Jaiswal: అమెరికా టెంపుల్ ఘటనపై భారత్ ఆందోళన
Shai Hope | వరసగా ‘ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్’ అవార్డులు.. ‘అమ్మో.. ఇన్ని ఎలా?’ అని తలపట్టుకున్న విండీస్ కెప్టెన్..!
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్పై ప్రభావం ఉంటుందా..?

