చేపలకు నగరాల్లో మంచి డిమాండ్..
పటాన్చెరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్‌రెడ్డి

పటాన్చెరు: చేపలకు నగరాల్లో మంచి డిమాండ్ ఉందని పటాన్చెరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్‌రెడ్డి అన్నారు. బుధవారం పటాన్చెరు మండలం లక్డారం, రుద్రారం గ్రామాల్లోని పెద్ద చెరువుల్లో రూ. 14లక్షల విలువైన ఏడు లక్షల చేపపిల్లలను నీటిలో వదిలారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. సీఎం కేసీఆర్ మత్స్యకారులకు చేయుతను ఇచ్చేందుకు ఉచితంగా చేపపిల్లలను అందజేస్తున్నారని, సబ్సిడీలపై అవసరం ఉన్న పనిముట్లను ఇస్తుందని వెల్లడించారు. చేపల పెంపకానికి ప్రోత్సాహంతో పాటు వాటిని మార్కెట్లో విక్రయించేందుకు ప్రభుత్వం ఆలోచిస్తుందని పేర్కొన్నారు.
నగరాల్లో చేపలకు పెరుగుతున్న డిమాండ్‌కు తగ్గట్టుగా సరఫరా చేస్తే మత్స్యకారులకు లాభాలు వస్తాయన్నారు. ప్రభుత్వం అందజేస్తున్న సంక్షేమ పథకాలను సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. కార్యక్రమంలో సర్పంచ్‌లు సుధీర్‌రెడ్డి, సువర్ణ, ఎంపీటీసీలు మన్నెరాజు, హరిప్రసాద్‌రెడ్డి, టీఆర్ఎస్ మండల అధ్యక్షుడు బీ పాండు, మత్స్య శాఖ అధికారి సతీశ్, ఎంపీడీవో బన్సిలాల్, రాజు, కుమార్ తదితరులు పాల్గొన్నారు.
Read Today's Latest Medak Medak News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
India vs Zimbabwe | షఫాలీ సునామీ.. స్మృతి మంధాన మెరుపు ఫినిషింగ్.. 8.5 ఓవర్లలోనే జింబాబ్వేపై టీమిండియా విధ్వంసం!
Bathukamma | రాష్ట్రంలో ఘనంగా బతుకమ్మ సంబరాలు.. Videos
Bathukamma | పండుగ పూట కరెంట్ కోతలు.. చీకట్లోనే బతుకమ్మ ఆడిన మహిళలు
Tiger Shroff | బాలీవుడ్ నటుడు టైగర్ ష్రాఫ్‌పై కాల్పులు.. సల్మాన్ ఖాన్‌తో పనిచేసే వారే టార్గెట్?
Lal Hit Janata Party | సీజేపీకి వ్యతిరేకంగా.. ‘లాల్ హిట్ జనతా పార్టీ’ ఏర్పాటు
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

