బర్దిపూర్, ఏప్రిల్ 27 : సంగారెడ్డి జిల్లా ఝరాసంగం మండలంలోని బర్దిపూర్ గ్రామంలో బీఆర్ఎస్ పార్టీ ఆవిర్భావ దినోత్సవాన్ని పార్టీ శ్రేణులు ఘనంగా నిర్వహించారు. బీఆర్ఎస్ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పిలుపు మేరకు, సిద్దిపేట ఎమ్మెల్యే తన్నీరు హరీష్‌రావు, జహీరాబాద్ ఎమ్మెల్యే కొనింటి మాణిక్‌రావు ఆదేశాల మేరకు బర్దిపూర్ ప్రధాన కూడలి వద్ద పార్టీ జెండాను ఆవిష్కరించి సంబరాలు జరిపారు.
బీఆర్ఎస్ పార్టీ వేడుకల్లో గ్రామ సర్పంచ్ రాజు, ఉపసర్పంచ్ తుకారాం, గ్రామ బీఆర్ఎస్ నాయకులు రమేష్ పాటిల్, నాగన్న పాటిల్, ఎం. రాజు, గుంజేటి ప్రవీణ్, సి.హెచ్. రాజేందర్, అలిగే ప్రేమ్‌కుమార్, ఎర్రోళ్ల గాయ్యప్ప, ఎర్రోళ్ల సుధాకర్, రియాజ్, గోపాల్, ఖదీర్, వడ్ల సిద్ధన్న, ఎంగిలి సంగ్రామ్, మాణిక్తో పాటు పార్టీ శ్రేణులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.