Local body elections | నామినేషన్ల స్వీకరణ పకడ్బందీగా నిర్వహించాలి.. ఏర్పాట్ల పరిశీలనలో అదనపు కలెక్టర్ చంద్రశేఖర్
Local Body Elections | ఎన్నికల నిర్వహణలో నామినేషన్లు చాలా ముఖ్యమైన అంశమని, దీనిపైన చాలా కేసులు దాఖలు అయ్యే అవకాశం ఉన్నందున అధికారులు అప్రమత్తంగా ఉండాలని, ప్రతీఅంశం నిబంధనల ప్రకారం జరిగేలా చూడాలని సంగారెడ్డి జిల్లా అదనపు కలెక్టర్ చంద్రశేఖర్ తెలిపారు.
Local body elections | జహీరాబాద్ , నవంబర్ 29 : గ్రామ పంచాయతీ ఎన్నికలు పారదర్శకంగా నిర్వహించాలని సంగారెడ్డి జిల్లా అదనపు కలెక్టర్ చంద్రశేఖర్ సంబంధిత అధికారులను ఆదేశించారు. శనివారం జహీరాబాద్ మండలంలోని హోతి బీ, మొగుడంపల్లి మండలంలోని మల్లాపూర్ మొగుడంపల్లి గ్రామాల్లో ఏర్పాటు చేసిన క్లస్టర్ కేంద్రాల్లో నామినేషన్ స్వీకరణ ఏర్పాట్ల అనంతరం మండల కేంద్రమైన మొగుడంపల్లి గ్రామంలోని రైతు వేదికలో గ్రామపంచాయతీ ఎన్నికల సంబంధించి నామినేషన్ల స్వీకరణకు నియమించిన రిటర్నింగ్ అధికారి, అదనపు రిటర్నింగ్ అధికారులకు శిక్షణ కార్యక్రమం నిర్వహించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. పంచాయతీ ఎన్నికలు పకడ్బందీగా నిర్వహించాలంటే నిబంధనలపై పూర్తి అవగాహన కలిగి ఉండాలన్నారు. ఎన్నికల నిర్వహణలో నామినేషన్లు చాలా ముఖ్యమైన అంశమని, దీనిపైన చాలా కేసులు దాఖలు అయ్యే అవకాశం ఉన్నందున అధికారులు అప్రమత్తంగా ఉండాలని, ప్రతీఅంశం నిబంధనల ప్రకారం జరిగేలా చూడాలని తెలిపారు.
ఎన్నికల ప్రవర్తన నియమావళికి లోబడి..
అధికారిక ప్రకారం మాత్రమే రిజర్వేషన్ల అంశాలను పరిశీలించాలని అదనపు కలెక్టర్ చంద్రశేఖర్ సంబంధిత అధికారులను ఆదేశించారు. శనివారం జహీరాబాద్ మండలంలోని హోతి బీ, మొగుడంపల్లి మండలంలోని మల్లాపూర్ మొగుడంప అన్నారు. నామినేషన్ల స్వీకరణ, పరిశీలన, అప్పీళ్ల పరిష్కారం, గుర్తుల కేటాయింపు, పోటీ చేసే అభ్యర్థుల ప్రకటన పకడ్బందీగా జరిగేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ఎన్నికల్లో పోటీచేసే అభ్యర్థులకు సంబంధించిన కరపత్రాలు, గోడ పత్రాలు, ప్రచార వాహనాల అనుమతులను తీసుకోవాలంటే సంబంధిత మండల తహసీల్దార్లను సంప్రదించాలని తెలిపారు. గ్రామాల్లో ఎక్కడైనా సర్పంచ్ అభ్యర్థికి ఎనిమిది, వార్డు సభ్యులకు ఆరు కంటే ఎక్కువ నామినేషన దాఖలు అయితే తమకు తెలియజేయాలని అన్నారు. అభ్యర్థుల వివరాలు నామినేషన పత్రాల్లో పూర్తిగా నమోదు చేయాలని, లేకుంటే నామినేషనను తిరస్కరించాలని సూచించారు.
ప్రతీ చిన్న అంశాన్ని, అనుమానాలను శిక్షణలో నివృత్తి చేసుకోవాలని సూచించారు. ఎన్నికల ప్రవర్తన నియమావళికి లోబడి గ్రామపంచాయతీ ఎన్నికలను నిర్వహించాలన్నారు. ఎలాంటి పొరపాట్లు జరుగకుండా పగడ్బందీగా నిర్వహణకు అధికారులు సమన్వయంతో క్షేత్రస్థాయిలో పర్యవేక్షణ చేయాలని అన్నారు. ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థులు నామినేషన్‌కు ఒకరోజు ముందుగా కొత్త బ్యాంక్ ఖాతా తీసుకునే విధంగా వారికి తెలియజేయాలని సూచించారు.
జిరాక్స్ కాపీలు వాడొద్దు..
ఎన్నికలకు సంబంధించిన నామినేషన్ ఒరిజినల్ పత్రాలను సంబంధిత గ్రామ పంచాయతీలలోని ఆర్వోల వద్ద పొందవచ్చని తెలిపారు. జిరాక్స్ కాపీలు వాడొద్దని, వార్డు సభ్యుడు పోటీ కోసం అదే వార్డు సభ్యుడు ప్రపోజర్‌గా ఉండాలని, సర్పంచ్‌గా పోటీచేసే అభ్యర్థి డిపాజిట్ కింద కేటగిరీ వారీగా చెల్లించాలని, ఏమైనా అప్పీల్ ఉంటే ఆర్డీవోను సంప్రదించాలని సూచించారు. ఆయన వెంట తహసీల్దార్ దశరథ్, మండల అభివృద్ధి అధికారులు మహేష్, మహేందర్ రెడ్డి, పంచాయతీ అధికారులు అనూష, సంతోష్ కుమార్, సంబంధిత అధికారులు, తదితరులు పాల్గొన్నారు.

Read Also :
Dalit Cook: దళిత మహిళను వంట చేయకుండా అడ్డుకున్న ఆరుగురికి జైలుశిక్ష
Deeksha Divas | తెలంగాణ భవన్లో దీక్షా దివస్.. దీక్షా దివస్‌పై డాక్యుమెంటరీని ఆవిష్కరించిన కేటీఆర్
Ditwa cyclone | దిత్వా తుఫాను ఎఫెక్ట్.. అల్లకల్లోలంగా సముద్రం.. Video
Read Today's Latest Medak Medak News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Mann Ki Baat | ‘మన్ కీ బాత్’ కు 12 ఏళ్లు పూర్తి.. అదొక తీర్థయాత్ర లాంటిదన్న ప్రధాని మోదీ..!
Alias Rukmini | నితిన్ ‘అలియాస్ రుక్మిణి’ నుంచి ఫస్ట్ సింగిల్ అప్డేట్!
Rapido Driver | కానిస్టేబుల్ చెవిని కొరికిన ర్యాపిడో డ్రైవర్.. వీడియో
Cyclonic storm | ఏపీ, ఒడిశాకు పొంచివున్న తీవ్ర తుపాను ముప్పు.. అప్రమత్తమైన ప్రభుత్వాలు..!
Ramayana | రాముడు, సీత ప్రేమకు సంగీత రూపం.. ‘రామాయణ’ నుంచి ‘రంగులు రంగులే’ పాట విడుదల!
ట్రెండింగ్ వార్తలు
Amur Falcons | ఏకంగా 23 దేశాలను చుట్టి మణిపూర్‌కు తిరిగొచ్చిన అమూర్ ఫాల్కన్స్..!
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం

