పాపన్నపేట, అక్టోబర్ 4 : మెదక్ జిల్లా పాపన్న మండల కేంద్రంలో యువసేన యూత్ ఆధ్వర్యంలో రెండు రోజులపాటు నిర్వహించిన క్రికెట్ పోటీలు ఆదివారం ముగిసాయి. ఈ పోటీల్లో పాపన్నపేటకు చెందిన ఏడు జట్లు పాల్గొనగా సహారా యువజన సంఘం మొదటి బహుమతి గెలుపొందింది. రెండవ బహుమతి హనుమాన్ యువజన సంఘం కైవసం చేసుకుంది.
రెండు రోజులపాటు జరిగిన యువజన క్రికెట్ పోటీలు ఉత్కంఠ భరితంగా కొనసాగాయి. ఇందులో విజేతలుగా నిలిచిన వారికి దసరా ఉత్సవాల ముగింపు సందర్భంగా దుర్గామాత నిమజ్జనం రోజున శ్రీ సాయి ట్రేడర్స్ తరఫున దాత్కారి సురేష్ బహుమతులు అందజేస్తామని నిర్వాహకులు వెల్లడించారు.