చిలిపిచెడ్, మార్చి 7: మెదక్ జిల్లా చిలిపిచెడ్ మండలం చండూర్లోని రామలింగేశ్వరస్వామి ఆలయం మహాశివరాత్రి ఉత్సవాలకు సిద్ధమైంది. మహాశివరాత్రి సందర్భంగా శుక్రవారం ఉదయం 5 గంటల నుంచి ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు.
9న శనివారం ఎడ్లబండ్ల ఊరేగింపు, అభిషేకాలు, అన్నదానం, రాత్రి సాంస్కృతిక కార్యక్రమాలు, 10న ఆదివారం ఉదయం పాచిబండ్ల ఊరేగింపు, రాత్రి 7గంటలకు రథోత్సవం, రాత్రి సాంస్కృతిక కార్యక్రమాలు, 11న సోమవారం రాత్రి 7 గంటలకు లంకా దహనం కార్యక్రమాలు నిర్వహిస్తామని ఆలయ పూజారి మురళీధర్ శర్మ, గ్రామస్తులు తెలిపారు.