ప్రత్యామ్నాయ పంటల సాగును ప్రోత్సహించాలి : కలెక్టర్ ప్రతిమా సింగ్
ప్రత్యామ్నాయ పంటల సాగును ప్రోత్సహించేందుకు సమగ్ర కార్యాచరణ ప్రణాళికలు రూపొందించాలని మెదక్ జిల్లా కలెక్టర్ ప్రతిమా సింగ్ అధికారులను ఆదేశించారు.
మెదక్, అక్టోబర్ 13 (నమస్తే తెలంగాణ) : ఎల్‌నినో, వర్షాభావ పరిస్థితులు, భవిష్యత్తులో ఎదురయ్యే నీటి కొరతను దృష్టిలో ఉంచుకుని జిల్లాలో వ్యవసాయ రంగాన్ని అప్రమత్తం చేయడంతో పాటు ప్రత్యామ్నాయ పంటల సాగును ప్రోత్సహించేందుకు సమగ్ర కార్యాచరణ ప్రణాళికలు రూపొందించాలని మెదక్ జిల్లా కలెక్టర్ ప్రతిమా సింగ్ అధికారులను ఆదేశించారు. జిల్లాలో వర్షపాతం పరిస్థితులు, పంటల సాగు విస్తీర్ణం, భూగర్భ జలాల లభ్యత, ప్రత్యామ్నయ పంటల సాగు, విత్తనాల సరఫరా, వ్యవసాయ, విద్యుత్తు, మంచినీటి తదితర రంగాలపై ఎల్‌నినో ప్రభావం తదితర అంశాలపై కలెక్టర్ అధ్యక్షతన మంగళవారం ఐడిఓసి కార్యాలయంలో సంబంధిత శాఖల అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు.
ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ గత సీజన్‌తో పోలిస్తే ప్రస్తుత సీజన్లో జిల్లాలో తక్కువ వర్షపాతం నమోదైనట్లు వివరించారు. ఎల్ నినో వల్ల భూగర్భ జలాలు, చెరువులు, ఇతర నీటి వనరులపై ప్రభావం పడే అవకాశం ఉందని కలెక్టర్ పేర్కొన్నారు. ఈ పరిస్థితులను ముందుగానే అంచనా వేసి సంబంధిత శాఖలు సమన్వయంతో అవసరమైన చర్యలు చేపట్టాలని సూచించారు.
రైతులు వరి సాగుపైనే ఆధారపడకుండా కంది, మొక్కజొన్న, పెసలు, మినుములు, శనగ, వేరుశనగ, సోయాబీన్, జొన్న, సజ్జ తదితర పప్పుధాన్యాలు, నూనెగింజలు , చిరుధాన్యాల సాగు వైపు మళ్లేలా ప్రోత్సహించాలని సూచించారు. ప్రత్యామ్నయ పంటల సాగును ప్రోత్సహించేందుకు అవసరమైన విత్తనాల లభ్యతపై ప్రత్యేక దృష్టి సారించాలని కలెక్టర్ ఆదేశించారు. రైతులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా క్షేత్రస్థాయిలో అధికారులు అందుబాటులో ఉండాలని ఆదేశించారు. ఈ సమావేశంలో జిల్లా వ్యవసాయ అధికారి దేవకుమార్, జిల్లా గ్రామీణ అభివృద్ధి అధికారి శ్రీనివాసరావు, జడ్పీ సీఈఓ ఎల్లయ్య, తదితరులు పాల్గొన్నారు.
Read Today's Latest Medak News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?

