గుంతలు తేలిన శివనగర్-కంజర్ల రోడ్డు
సంగారెడ్డి జిల్లా జిన్నారం మండలం శివనగర్ నుంచి కంజర్ల వెళ్లే రోడ్డు గుంతలు తేలి ప్రయాణానికి ఇబ్బందిగా మారింది. రోడ్డు విస్తరణ పనులు ఆగిపోవడంతో మెటల్ వేసి వదిలేశారు. దీంతో ఇటీవల కురుస్తున్న వర్షాలకు రోడ్డపై భారీ గుంతలు ఏర్పడ్డాయి. ఇటీవలే నర్సాపూర్ నుంచి జిన్నారం, శివనగర్ మీదుగా పటాన్‌చెరుకు బస్సు సౌకర్యం ప్రారంభమైంది.
- వాహనాల రాకపోకలకు తీవ్ర ఆటంకం
- మళ్లీ బస్సు బంద్ అవుతుందేమోనని ప్రజల ఆందోళన
జిన్నారం, జూలై 21: సంగారెడ్డి జిల్లా జిన్నారం మండలం శివనగర్ నుంచి కంజర్ల వెళ్లే రోడ్డు గుంతలు తేలి ప్రయాణానికి ఇబ్బందిగా మారింది. రోడ్డు విస్తరణ పనులు ఆగిపోవడంతో మెటల్ వేసి వదిలేశారు. దీంతో ఇటీవల కురుస్తున్న వర్షాలకు రోడ్డపై భారీ గుంతలు ఏర్పడ్డాయి. ఇటీవలే నర్సాపూర్ నుంచి జిన్నారం, శివనగర్ మీదుగా పటాన్‌చెరుకు బస్సు సౌకర్యం ప్రారంభమైంది. పెద్ద పెద్ద గుంతలతో ఈ రోడ్డుపై బస్సులు, కార్లు, ద్విచక్ర వాహనాలు మీద ప్రయాణం ఇబ్బందికరంగా మారింది. నెలక్రితం ఈ రోడ్డుపై గుంతలు ఎక్కువ కావడంతో బస్సు బంద్ అయ్యింది. సమస్యను తెలుసుకున్న మాజీ ఎంపీపీ రవీందర్‌గౌడ్ మట్టి పోయించి గుంతలు పూడ్చి బస్సు మళ్లీ తిరిగేలా రోడ్డు బాగు చేయించారు.
ఇటీవల వరుసగా కురుస్తున్న వర్షాలకు రోడ్డుపై మొత్తం పెద్ద గుంతలు ఏర్పడ్డాయి. పటాన్చెరు రింగ్‌రోడ్డు సమీపం నుంచి కంజర్ల పరిధి వరకు నాలుగులైన్ల రోడ్డు మంజూరైనా పనులు మాత్రం ఇంకా ప్రారంభం కాలేదు. రోడ్డు ఇలాగే ఉంటే బస్సు మళ్లీ బంద్ అయ్యే అవకాశం ఉందని, ఇది జరగకముందే రోడ్డుపై ఏర్పడిన గుంతలను పూడ్చి బాగు చేయించాలని శివనగర్ గ్రామస్తుల కోరుతున్నారు. మరోవైపు చిన్నపాటి వర్షానికి గడ్డపోతా రం, ఖాజీపల్లి పారిశ్రామికవాడలోని రోడ్లు అధ్వానంగా మారాయి. ఖాజీపల్లి సమీపంలోని రింగ్‌రోడ్డు కింద చిన్నపాటి వర్షానికి నీళ్లు నిలి చి బ్రిడ్జి కింద నుంచి వెళ్లే పరిస్థితి లేక వాహనదారులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.
Read Today's Latest Medak News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Fire accident | కూకట్‌పల్లిలో భారీ అగ్నిప్రమాదం.. షార్ట్ సర్క్యూటే కారణమా?
Horoscope | 09-11-2026 సోమవారం.. మీ రాశి ఫలాలు
Medak | కేసీఆర్ మరోసారి సీఎంగా బాధ్యతలు చేపడితేనే తెలంగాణకు మోక్షం
Motorola | మోటరోలా నుంచి మరో ఫోల్డబుల్ ఫోన్.. పేరు, ఫీచర్లు లీక్.. ఎప్పుడొస్తుందంటే?
Suspicious Death | అమెరికాలో జగిత్యాల జిల్లా యువకుడు అనుమానాస్పద స్థితిలో మృతి
ట్రెండింగ్ వార్తలు
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి

