పాపన్నపేట, అక్టోబర్ 2 : మెదక్ జిల్లా పాపన్నపేట మండలం ముద్దాపూర్కు గ్రామానికి చెందిన తెలంగాణ ఉద్యమకారుడు, బీఆర్ఎస్ సీనియర్ నాయకుడు, ఏడుపాయల దేవస్థానం మాజీ ధర్మకర్త మాలిస్ నాగప్ప అనారోగ్యంతో శుక్రవారం మృతి చెందారు. ఈవిషయం తెలుసుకున్న మాజీ డిప్యూటీ స్పీకర్ యం.పద్మా దేవేందర్ రెడ్డి ముద్దాపూర్కు చేరుకుని నాగప్ప పార్థివదేహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. అనంతరం అంత్యక్రియల్లో పాల్గొన్నారు.
ఈ సందర్భంగా పద్మా దేవేందర్ రెడ్డి మాట్లాడుతూ.. నాగప్ప మృతి పార్టీకి, ముద్దాపూర్ గ్రామానికి తీరని లోటని అన్నారు. ప్రత్యేక తెలంగాణ కోసం జరిగిన ఉద్యమంలో నాగప్ప చురుగ్గా పాల్గొన్న విషయాన్ని గుర్తు చేశారు. పార్టీ బలోపేతానికి ఆయన అందించిన సేవలను స్మరించుకున్నారు. పార్టీ కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొంటూ కార్యకర్తలకు అండగా నిలిచారని పేర్కొన్నారు.నాగప్ప కుటుంబ సభ్యులను పరామర్శించి ప్రగాఢ సానుభూతి తెలిపారు. కుటుంబానికి అండగా ఉంటామని భరోసా ఇచ్చారు. ఈ సందర్భంగా రూ.20 వేల ఆర్థిక సహాయం అందజేశారు.
ఈ కార్యక్రమంలో ఏడుపాయల మాజీ చైర్మన్ పట్లోళ్ల విష్ణువర్ధన్ రెడ్డి, పాపన్నపేట మండల పార్టీ అధ్యక్షుడు గంగుల విష్ణువర్ధన్ రెడ్డి, మండల సీనియర్ నాయకులు బాబా గౌడ్, పాపన్నపేట మండల ఎంపీటీసీల ఫోరం అధ్యక్షుడు వడ్ల కుబేరుడు, సర్పంచ్ సాయి రెడ్డి, మాజీ సర్పంచ్లు లింగారెడ్డి, మల్లేశం, ఏడుపాయల మాజీ డైరెక్టర్లు అంటోని ప్రభు గౌడ్, సంగప్ప గౌరీ శంకర్, మంద నాగయ్య, బీఆర్ఎస్ సీనియర్ నాయకులు దుర్గయ్య, , బీస గోపాల్, అనిల్ రెడ్డి, యేసు రత్నం, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.