ఫ్యాక్టరీ పనులు త్వరగా పూర్తిచేయాలి
సిద్దిపేట జిల్లా నంగునూరు మండలం నర్మెటలో నిర్మిస్తున్న ఆయిల్‌పామ్ ఫ్యాక్టరీ పనులను త్వరగా పూర్తిచేయాలని సిద్దిపేట కలెక్టర్ మనుచౌదరి అధికారులను ఆదేశించారు. శుక్రవారం రూ.300 కోట్లతో నిర్మిస్తున్న ఆయిల్‌పామ్ ఫ్యాక్టరీ నిర్మాణ పనులను క్షేత్రస్థాయిలో పరిశీలించారు.
- సిద్దిపేట జిల్లాలో మొదలైన ఆయిల్‌పామ్ పంట దిగుబడి
- ఫ్యాక్టరీ నిర్మాణ పనులను వేగిరం చేయాలి
- సిద్దిపేట కలెక్టర్ మనుచౌదరి
నంగునూరు, జూన్ 14: సిద్దిపేట జిల్లా నంగునూరు మండలం నర్మెటలో నిర్మిస్తున్న ఆయిల్‌పామ్ ఫ్యాక్టరీ పనులను త్వరగా పూర్తిచేయాలని సిద్దిపేట కలెక్టర్ మనుచౌదరి అధికారులను ఆదేశించారు. శుక్రవారం రూ.300 కోట్లతో నిర్మిస్తున్న ఆయిల్‌పామ్ ఫ్యాక్టరీ నిర్మాణ పనులను క్షేత్రస్థాయిలో పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయిల్‌ఫెడ్ అధికారులు ఫ్యాక్టరీ మ్యాప్‌ను, నిర్మాణ దశలను కలెక్టర్‌కు వివరించారు. నిర్మాణ పనులు మందకొడిగా సాగుతుండడంపై అసహనం వ్యక్తం చేశారు. ఫ్యాక్టరీ నిర్మాణాన్ని వేగంగా పూర్తి చేయాలని ఇంజినీరింగ్ అధికారులు, గుత్తేదారులకు సూచించారు. జిల్లాలో ఆయిల్‌పామ్ దిగుబడి మొదలవుతున్న క్రమంలో ఫ్యాక్టరీ నిర్మాణం త్వరగా పూర్తి చేస్తే రైతులకు మేలు జరుగుతుందన్నారు. కార్యక్రమంలో జిల్లా హార్టికల్చర్ అధికారి సువర్ణ, ఆయిల్ ఫెడ్ అధికారులు పాల్గొన్నారు.
అదనపు గదుల నిర్మాణానికి ప్రతిపాదనలు సిద్ధం చేయాలి
సిద్దిపేట, జూన్ 14 : సిద్దిపేట పరిధిలోని గుండ్లచెరువు ప్రాథమిక పాఠశాలలో అదనపు గదుల నిర్మాణానికి ప్రతిపాదనలు సిద్ధం చేయాలని కలెక్టర్ మనుచౌదరి, విద్యాశాఖ అధికారులను ఆదేశించారు. శుక్రవారం గుండ్ల చెరువు ప్రాథమిక పాఠశాలను పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గుండ్లచెరువు పాఠశాలలో డబుల్ బెడ్రూమ్ ఇండ్లు నిర్మించేనాటికి 40 మంది విద్యార్థులు ఉండేవారని, తర్వాత వారి సంఖ్య 200లకు పెరగడంతో తాత్కాలికంగా పాఠశాల భవనాన్ని ఏర్పాటు చేశారు. దీంతో విద్యార్థులకు సరిపడా అదనపు తరగతుల నిర్మాణం కోసం పాఠశాల ఆవరణలో ఉన్న ఖాళీ స్థలంలో అదనపు గదులు నిర్మించేందుకు ప్రతిపాదనలు సిద్ధం చేసి పంపించాలని సెక్టోరియల్ అధికారి రామస్వామి, ఎంఈవో యాదవరెడ్డిలను ఆదేశించారు.
Read Today's Latest Medak News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Dasara Safety Tips | దసరాకు ఊరెళ్తున్నారా జాగ్రత్త..! గ్రేటర్లో దొంగల కలకలం
Rain | తెలంగాణలో మూడు రోజులు వానలు!
NTR | నెల్సన్ దర్శకత్వంలో రాక్..? ఎన్టీఆర్‌ను కలిసి కథ చెప్పిన నెల్సన్ దిలీప్‌కుమార్
India Protests | భారత్‌లో విద్యార్థి నిరసనల అణచివేతపై ప్రశ్నించండి.. 13 కోట్ల మంది ఓటర్ల తొలగింపు ఆందోళనకరం
MK Stalin | ‘వెన్నుపోటు’ కాంగ్రెస్‌తో కలిసి పనిచేయం.. సీజేపీ నిరసనలకు స్టాలిన్ మద్దతు
ట్రెండింగ్ వార్తలు
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్

