నేడు కైట్ ఫెస్టివల్
సిద్దిపేట కోమటి చెరువు నెక్లెస్ రోడ్డు మరో ఉత్సవానికి సిద్ధమైంది. మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే తన్నీరు హరీశ్‌రావు సంక్రాంతి పండుగ సందర్భంగా పట్టణంలోని కోమటి చెరువు నెక్లెస్ రోడ్డు వద్ద కైట్ ఫెస్టివల్‌కు శ్రీకారం చుట్టను న్నారు.
- ఉత్సవాలను ప్రారంభించనున్న మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే తన్నీరు హరీశ్‌రావు
సిద్దిపేట, జనవరి 12: సిద్దిపేట కోమటి చెరువు నెక్లెస్ రోడ్డు మరో ఉత్సవానికి సిద్ధమైంది. మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే తన్నీరు హరీశ్‌రావు సంక్రాంతి పండుగ సందర్భంగా పట్టణంలోని కోమటి చెరువు నెక్లెస్ రోడ్డు వద్ద కైట్ ఫెస్టివల్‌కు శ్రీకారం చుట్టను న్నారు. బీఆర్ఎస్ విద్యార్థి, యువజన విభాగాల ఆధ్వర్యంలో నిర్వహించనున్న ఈ కైట్ ఫెస్టివల్‌ను శనివారం ఉదయం 11గంటలకు ఆయన ప్రారంభించనున్నారు. ఈ ఉత్సవాల వేళ కోమటి చెరువు వద్ద యువకుల కేరింతల మధ్య వివిధ రంగులు, విభిన్నమైన ఆకృతుల్లో పతంగులు పట్టణ వాసులను కనువిందు చేయనున్నాయి.
ఏర్పాట్లను పరిశీలించిన మున్సిపల్ మాజీ చైర్మన్ రాజనర్సు
బీఆర్ఎస్ విద్యార్థి, యువజన విభాగాల ఆధ్వర్యంలో నిర్వహించనున్న కైట్ ఫెస్టివల్ ఏర్పాట్లను శుక్రవారం మున్సిపల్ మాజీ చైర్మన్ కడవేర్గు రాజనర్సు, బీఆర్ఎస్ పట్టణ అధ్యక్షుడు కొండం సంపత్‌రెడ్డి తదితరులు పరిశీలించారు. ఆయనతో కౌన్సిలర్ సాయికుమార్, నాయకులు వజీర్, బీసీ విభాగం అధ్యక్షుడు నగేశ్, నియోజకవర్గ యువజన విభాగం అధ్యక్షుడు రజినీకాంత్‌రెడ్డి, పట్టణ అధ్యక్షుడు రెడ్డిప్రభాకర్రెడ్డి, విద్యార్థి విభాగం అధ్యక్షుడు మహిపాల్‌గౌడ్ తదితరులు పాల్గొన్నారు.
Read Today's Latest Medak News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

