భారీగా రేషన్ బియ్యం పట్టివేత
మండలంలోని కవేలి జాతీయ రహదారిపై బుధవారం పోలీసులు చేపట్టిన వాహనాల తనిఖీల్లో 720 క్వింటాళ్ల రేషన్ పట్టుబడింది. ఎస్సై సురేశ్ వివరాల ప్రకారం.. కవేలి 65వ జాతీయ రహదారిపై తనిఖీలు నిర్వహించారు. హైదరాబాద్ నుంచి గుజరాత్‌కు వెళ్తున్న నాలుగు లారీలను తనిఖీలు చేపట్టారు. ఇందులో 720క్వింటాళ్ల రేషన్ బియ్యం ఉండడంతో లారీలను సీజ్
- లారీల్లో ఇతర రాష్ర్టాలకు తరలిస్తుండగా పట్టుకున్న పోలీసులు
- కవేలీ వద్ద 720 క్వింటాళ్లు, నారాయణఖేడ్‌లో 160 క్వింటాళ్లు పట్టివేత
- సత్వార్ శివారులోని కోహినూర్ దాబా వద్ద మరో మూడు లారీల బియ్యం సీజ్
జహీరాబాద్/కోహీర్, సెప్టెంబర్ 7 : మండలంలోని కవేలి జాతీయ రహదారిపై బుధవారం పోలీసులు చేపట్టిన వాహనాల తనిఖీల్లో 720 క్వింటాళ్ల రేషన్ పట్టుబడింది. ఎస్సై సురేశ్ వివరాల ప్రకారం.. కవేలి 65వ జాతీయ రహదారిపై తనిఖీలు నిర్వహించారు. హైదరాబాద్ నుంచి గుజరాత్‌కు వెళ్తున్న నాలుగు లారీలను తనిఖీలు చేపట్టారు. ఇందులో 720క్వింటాళ్ల రేషన్ బియ్యం ఉండడంతో లారీలను సీజ్ చేశారు. బియ్యం విలువ రూ.11లక్షల వరకు ఉంటుందని, నాలుగు లారీల యజమానులు, డ్రైవర్లపై కేసులు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని ఎస్సై వివరించారు.
నారాయణఖేడ్‌లో 160 క్వింటాళ్లు..
నారాయణఖేడ్, సెప్టెంబర్ 7 : రెండు వాహనాల్లో అక్రమంగా తరలిస్తున్న 160 క్వింటాళ్ల రేషన్ బియ్యాన్ని రెవెన్యూ అధికారులు పట్టుకున్నారు. డీసీఎం, బొలేరో వాహనల్లో అక్రమంగా రేషన్ బియ్యాన్ని తరలిస్తుండగా, విశ్వసనీయ సమాచారం మేరకు నారాయణఖేడ్ తహసీల్దార్ దశరథ్ సింగ్ ప్రభుత్వ డిగ్రీ కళశాల వద్ద వాహనాలను పట్టుకున్నారు. వాహనాలను సోదా చేయగా, డీసీఎంలో 120 క్వింటాళ్లు, బొలేరో వాహనంలో 40 క్వింటాళ్ల రేషన్ బియ్యాన్ని గుర్తించారు. ఈ మేరకు ఎస్సై వెంకట్‌రెడ్డి ఘటనా స్థలానికి చేరుకుని బియ్యాన్ని గోదాంకు తరలించి, వాహనాలకు సీజ్ చేసి దర్యాప్తు చేస్తున్నారు.
Read Today's Latest Medak News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
8 ఏళ్ల క్రితం ప్రేమ పెళ్లి.. ఇప్పుడు పొరుగింటి కుర్రాడితో ఎఫైర్.. చివరకు రైలు కింద ఇద్దరూ మృతి!
Donald Trump: శ్వేతసౌధంలో దీపావళి వేడుక.. ట్రంప్‌కు హనుమాన్ చాలీసా గిఫ్ట్
Scene | సూర్య అరుదైన రికార్డు.. ‘సీన్’ తో బాక్సాఫీస్ వద్ద హ్యాట్రిక్ బ్లాక్ బస్టర్!
Hyderabad | గచ్చిబౌలి హోటల్లో అమెరికా పౌరుడి అనుమానాస్పద మృతి
Mookuthi Amman 2 | రూ.100 కోట్ల భారీ బడ్జెట్‌తో ‘మహాశక్తి’.. తొలి రోజే షాకింగ్ కలెక్షన్లు,నయనతారకు నిరాశేనా?
ట్రెండింగ్ వార్తలు
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి
Viral dance | ఆఫీస్ దీపావళి వేడుకల్లో యువతి డ్యాన్స్.. ఇంటర్నెట్లో ఏకంగా రెండు కోట్ల వ్యూస్.. Video
Watch: శివసేన నేత ఇంట్లో డ్రగ్స్ ఉంచిన పోలీస్ అధికారి.. తర్వాత ఏం జరిగిందంటే?
Viral news | ఆ ఇంట్లో రోజూ నాగుపాముల కలకలం.. ఏడ వెతికినా పాము గుడ్లే..!
Viral News | అనారోగ్యంతో ఉన్న అమ్మకోసం కేంద్ర మాజీ మంత్రి వేణుగానం..!

