హ్యాండ్‌బాల్ ఆట.. భవితకు బాట !
- వేసవి శిక్షణా శిబిరానికి విశేష స్పందన
- హ్యాండ్‌బాల్ ఆటపై మక్కువ చూపుతున్న చిన్నారులు
మద్దూరు(ధూళిమిట్ట), మే 29: గ్రామీణ క్రీడాకారుల్లో నైపుణ్యాన్ని పెంపొందించేందుకు జిల్లా యువజన క్రీడల శాఖ, హ్యాండ్‌బాల్ అసోసియేషన్ ఆధ్వర్యంలో మండల కేంద్రంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో నిర్వహిస్తున్న హ్యాండ్‌బాల్ వేసవి శిక్షణా శిబిరానికి బాలబాలికలు, యువతీ యువకుల నుంచి విశేష స్పందన లభిస్తున్నది.అనుభవజ్ఞులైన కోచ్‌ల పర్యవేక్షణలో హ్యాండ్‌బాల్ ఆటలో తర్ఫీదు పొందడానికి యువత ఆసక్తిని కనబరుస్తున్నది. రోజూ ఉదయం ఉత్సాహంగా శిక్షణకు హాజరవుతూ ఆటలో మెళకువలు నేర్చుకుంటూ క్రీడారంగంలో ఉజ్వల భవిష్యత్‌కు బాటలు వేసుకుంటున్నారు.
20 ఏండ్లుగా శిక్షణా శిబిరాల ఏర్పాటు
హ్యాండ్‌బాల్ ఆటకు మద్దూరు పెట్టనికోటగా నిలుస్తున్నది. ఉమ్మడి మద్దూరు మండలం నుంచి వందల సంఖ్యలో క్రీడాకారులు రాష్ట్ర స్థాయి, జాతీయ స్థాయి హ్యాండ్‌బాల్ పోటీల్లో రాణించారు. రాష్ట్ర స్థాయి, జాతీయ స్థాయి హ్యాండ్‌బాల్ పోటీలకు మద్దూరు పలుమార్లు ఆతిథ్యం ఇవ్వడం విశేషం. ఎంతోమంది హ్యాండ్‌బాల్ క్రీడాకారులు ప్రభుత్వ ఉద్యోగాలు సంపాదించారు. హ్యాండ్‌బాల్ క్రీడపై ఈ ప్రాంత యువత ఆసక్తిని చూపిస్తున్నారు. ఈ క్రమంలో గత 20 ఏండ్లుగా వేసవి కాలం, శీతాకాలంలో హ్యాండ్‌బాల్ శిక్షణా శిబిరాలు ఏర్పాటు చేస్తున్నారు. ఈ శిబిరాల్లో ఎంతో మంది శిక్షణ పొంది మేటి క్రీడాకారులుగా తయారయ్యారు.
వేసవి శిక్షణా శిబిరానికి విశేష స్పందన
మద్దూరు హైస్కూల్లో ఈ నెల 1వ తేదీన ప్రారంభమైన శిక్షణా శిబిరంలో సీనియర్ కోచ్ దామెర మల్లేశం ఆధ్వర్యంలో 60 మందికి పైగా బాలబాలికలు, యువతీ యువకులు శిక్షణ పొందుతున్నారు. తెల్లవారుజామునే పిల్లలు ఎంతో శ్రద్ధగా గ్రౌండ్‌కు చేరుకొని కోచ్ చెప్పిన విధంగా నేర్చుకుంటున్నారు. ఈ శిక్షణా శిబిరం జూన్ 10వతేదీ వరకు కొనసాగనున్నది. వేసవి కాలంలో సమయం వృథా కాకుండా విద్యార్థులు హ్యాండ్‌బాల్ ఆటను నేర్చుకుంటుండంపై విద్యార్థుల తల్లిదండ్రులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.

హ్యాండ్‌బాల్ క్రీడా అంటే ఇష్టం
నాకు హ్యాండ్‌బాల్ క్రీడా అంటే ఎంతో ఇష్టం. మద్దూరులో ఏర్పాటు చేసిన వేసవి ఉచిత శిక్షణా శిబిరానికి రోజూ వస్తున్నా. కోచ్ హ్యాండ్‌బాల్ ఆట దగ్గరుండి నేర్పిస్తున్నారు. నెల రోజుల్లో హ్యాండ్‌బాల్ ఆటను పూర్తిగా నేర్చుకొని పోటీల్లో పాల్గొంటా.
-ఐశ్వర్య, కూటిగల్
మంచిగా ఆట నేర్పిస్తుండ్రు
కోచ్‌లు హ్యాండ్‌బాల్ ఆటను మంచిగా నేర్పిస్తుండ్రు. సార్లు చెప్పినట్లు శ్రద్ధగా వింటున్నాం. ఆట ఆడుతుంటే మాకు టైమే తెలుస్తలేదు. ఇంత మంచి శిక్షణా శిబిరం ఏర్పాటు చేసిన ప్రభుత్వానికి థ్యాంక్స్. మంచి ప్లేయర్‌గా ఎదిగి మా ఊరికి, తల్లిదండ్రులకు మంచి పేరు తీసుకొస్తా.
-ఆదిత్య, మద్దూరు
మంచి స్పందన లభిస్తుంది..
జిల్లా యువజన క్రీడల శాఖ, హ్యాండ్‌బాల్ అసోసియేషన్ సంయుక్తంగా మాద్దూరులో ఏర్పాటు చేసిన హ్యాండ్‌బాల్ వేసవి శిక్షణా శిబిరానికి పిల్లల నుంచి మంచి స్పందన లభిస్తుంది. నెల రోజులపాటు పిల్లలకు ఆటలోని మెళకువలు నేర్పి మంచి క్రీడాకారులుగా తీర్చిదిద్దేందుకు కృషి చేస్తున్నాం. 20 ఏండ్లుగా మద్దూరులో శిక్షణా శిబిరాలు, పోటీలు నిర్వహిస్తున్నాం. క్రీడాకారులను ప్రభుత్వం ప్రోత్సహిస్తుందని చెప్పడానికి ఈ శిక్షణా శిబిరాలే నిదర్శనం. రాబోయే రోజుల్లో గ్రామాల్లో క్రీడా మైదానాల ఏర్పాటుకు ప్రభుత్వం యోచిస్తుండడం శుభపరిణామం.
-దామెర మల్లేశం, సీనియర్ కోచ్
Read Today's Latest Medak News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
DK Shivakumar | ‘మెటా గ్లాసెస్’తో నాపై స్టింగ్ ఆపరేషన్‌కు యత్నం.. పారిశ్రామికవేత్తతో భేటీపై డీకే అనుమానం
Vidadala Rajini | ఏపీలో విడదల రజినీపై పోలీసుల అరాచకం.. మాజీ మంత్రిని కిందపడేసి ఎస్సై దాష్టీకం
Revanth Reddy | సొంత ఎమ్మెల్యేలపై నిఘా అస్త్రం.. ఫోన్లలో ట్రాకింగ్ యాప్‌లు, గన్మెన్లతో నిఘా పెడతామని సీఎం రేవంత్ వార్నింగ్!
Pattiseema | 100 రోజులు ఏపీలో ఆగకుండా ఎత్తిపోత.. పట్టిసీమతో 65 టీఎంసీల గోదావరి జలాలు తరలింపు!
KTR | కాళేశ్వరాన్ని తిట్టి.. కరువులోకి నెట్టి.. కాంగ్రెస్ నిర్లక్ష్యంతోనే రాష్ర్టానికి దుర్భిక్షం.. కేటీఆర్ ధ్వజం
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

