చరిత్రకు ఆనవాళ్లు
సజావుగా పరిపాలన సాగించేందుకు, శత్రువుల దాడిని తిప్పికొట్టేందుకు కాకతీయ రాజులు, నిజాం నవాబులు ఎన్నో గడీలు, కోటలు, బురుజులు నిర్మించారు. వందల ఏండ్లక్రితం నిర్మించి ఎంతో చరిత్ర కలిగిన ఈ చారిత్రక కట్టడాలు నేటికీ తెలంగాణ పల్లెల్లో కనిపిస్తున్నాయి
- చిన్నకోడూరులో దశాబ్దాల చరిత్ర ఉన్న బురుజులు
- మూడు కిలోమీటర్ల సొరంగ మార్గం
- ఆకట్టుకుంటున్న కాకతీయ రాజులు, నిజాం నవాబుల నిర్మాణాలు
చిన్నకోడూరు, జూలై 31: సజావుగా పరిపాలన సాగించేందుకు, శత్రువుల దాడిని తిప్పికొట్టేందుకు కాకతీయ రాజులు, నిజాం నవాబులు ఎన్నో గడీలు, కోటలు, బురుజులు నిర్మించారు. వందల ఏండ్లక్రితం నిర్మించి ఎంతో చరిత్ర కలిగిన ఈ చారిత్రక కట్టడాలు నేటికీ తెలంగాణ పల్లెల్లో కనిపిస్తున్నాయి. అలాంటి అనేక చారిత్రక ఆనవాళ్లు చిన్నకోడూరులో దర్శనమిస్తున్నాయి.
చిన్నకోడూరులోని బురుజులు, కోటలకు శతాబ్దాల చరిత్ర ఉంది. ఈ గ్రామం కాకతీయుల కాలంలో ఏర్పాటు అయినట్లు, చుట్టు పక్కల గ్రామాలకు సంస్థానంగా ఉండేదని చరిత్ర చెబుతున్నది. నంగునూరు మండలం రాజగోపాల్‌పేట చిన్నకోడూరు గ్రామానికి రాజధానిగా ఉండేది. కాకతీయుల పాలన అనంతరం ఈ సంస్థానం నిజాం నవాబుల ఆధీనంలో ఎలగందుల (కరీంనగర్) పరిధిలో ఉండేది. ఈ సంస్థా నం నుంచి సామంత రాజులు రాజగోపాల్పే ట, ఎలగందులలో (కరీంనగర్) పన్ను చెల్లించే వారని చరిత్ర చెబుతున్నది.
నిజాం పాలనలో గోల్కొండ నవాబులు చిన్నకోడూరులో గడికోటలు నిర్మించారు. వారి ఆస్థాన మంత్రులైన అక్కన్న, మాదన్నలు ఇక్కడికి మూడు కిలో మీటర్ల దూరంలోని ప్రస్తుతం సలెంద్రిగా పేరొందిన ప్రాం తంలో నవాబులకు నమాజ్ నిమిత్తం మసీదు, స్నానాలకు విడిది గదులు నిర్మించారు. అవి నేటికీ చెక్కు చెదరకుండా ఉన్నాయి. శత్రువులు అకస్మాత్తుగా దాడి చేసినప్పు డు సునాయాసంగా తప్పించుకోవడానికి మూడు కిలోమీటర్ల సొరంగ మార్గాన్ని నిర్మించారు. దీని చుట్టూ సైనికుల పహారాకు, శత్రువులను సునాయాసంగా కనిపెట్టడానికి వీలుగా 40 అడుగుల ఎత్తులో ఐదు మట్టి, ఒక రాతి బురుజులు నిర్మించారు. కోట నుంచి మూడు కిలో మీటర్ల దూరం సలెంద్రి వరకు సొరంగ మార్గాన్ని నిర్మించారు. కోట గోడలు 25 అడుగుల ఎత్తు తో నిర్మించారు. గ్రామం చుట్టూ ప్రహరీ నిర్మించి నాలుగు వైపులా ప్రధాన ద్వారం ఏర్పాటు చేశారు. చుట్టూ 24గంటలు కాపలా ఉండే వారు. కాలక్రమేణా ప్రహరీ, నాలుగు ప్రధాన ద్వారా లు కూలిపోయాయి. మిగతా కోటలు శిథిలావస్థకు చేరుకున్నాయి. చిన్నకోడూరులోనిలో ఉన్న కోటలను ఇప్పటికీ గ్రామస్తు లు చరిత్రకు ఆనవాళ్లుగా చెప్పుకుంటున్నారు..
కోట మీద నుంచి ఇంగ్లిష్వాళ్లను చంపేవాళ్లట
నాకు లగ్గం అయిన తర్వాత మా అత్తా మామ ఎనకట ఈకోటలో రాజులు ఉండేవాళ్లని చెబుతుండేవాళ్లు. గడీచుట్టూ పెద్ద గోడలు, తొమ్మిది పెద్ద బురుజులు, నాలుగు దిక్కులా పెద్ద తలుపులు ఉండేవట. తొమ్మిది బురుజుల మీద నుంచి ఇంగ్లిష్‌వాళ్లు మన మీదికి యుద్ధం చేయడానికి వస్తే పసిగట్టి పెద్దపెద్ద బాంబులు వేసి వాళ్లను చంపేవారట. కోటలో మస్తుమంది సినిమాలు కూడా తీసిండ్రు.
– ములంకుల సుమతి, చిన్నకోడూరు
Read Today's Latest Medak News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

