మురుగు.. పరుగు
హుస్నాబాద్ ఆర్టీసీ బస్టాండ్ దుర్గంధంతో నిండిపోయింది. ఇటీవల కురిసిన వర్షానికి చుట్టుపక్కల డ్రైనేజీల నుంచి వచ్చిన వర్షపునీరు చేరి చెరువును తలపించిన బస్టాండ్ ఆవరణలో ఇంకా నీళ్లు అలాగే నిల్వ ఉండటంతో దుర్వాసన వెదజల్లి ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.
- దుర్గంధం వెదజల్లుతున్న హుస్నాబాద్ ఆర్టీసీ బస్టాండ్
- ఇటీవల కురిసిన వర్షానికి చెరువును తలపిస్తున్న వైనం
- సీసీ వేసేందుకు తీసిన గొయ్యిలో మురుగు నీరు చేరి భరించలేని దుర్వాసన
- రూ.2కోట్లతో జరుగుతున్న పనుల్లో తీవ్ర జాప్యం
- ఇబ్బందులు పడుతున్న ప్రయాణికులు, ఆర్టీసీ డ్రైవర్లు
- రవాణా శాఖ మంత్రి ఇలాఖాలో బస్టాండ్ తీరుపై విమర్శల వెల్లువ
హుస్నాబాద్, జూన్ 4: హుస్నాబాద్ ఆర్టీసీ బస్టాండ్ దుర్గంధంతో నిండిపోయింది. ఇటీవల కురిసిన వర్షానికి చుట్టుపక్కల డ్రైనేజీల నుంచి వచ్చిన వర్షపునీరు చేరి చెరువును తలపించిన బస్టాండ్ ఆవరణలో ఇంకా నీళ్లు అలాగే నిల్వ ఉండటంతో దుర్వాసన వెదజల్లి ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. వర్షం కురిసి నాలుగు రోజులు గడుస్తున్నప్పటికీ అధికారులు, సంబంధిత కాంట్రాక్టరు మురుగునీటిని బయటకు పంపే ప్రయత్నం చేయడం లేదు. అధికారుల నిర్లక్ష్యం వల్ల ప్రయాణికులు, ఆర్టీసీ డ్రైవర్లు నానా అవస్థలు పడుతున్నారు. బస్టాండ్ ఆధునీకరణ పనుల్లో భాగంగా సీసీ వేసేందుకు సుమారు రెండు అడుగుల లోతు మట్టిని తీశారు. ఇందులో డ్రైనేజీల నుంచి వచ్చిన మురుగునీరు చేసి అటువైపు వెళ్లలేని పరిస్థితి ఏర్పడింది. చిన్నపాటి వర్షానికే బస్టాండ్ ఆవరణ చెరువును తలపించే విధంగా మారింది. దీనికి ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేయడంలో అధికారులు విఫలమవుతున్నారు. సీసీ గొయ్యి తీసి పక్షం రోజులు గడుస్తున్నా సదరు కాంట్రాక్టరు సీసీ వేయక పోవడం వల్లే కార్గో కార్యాలయం నీటమునగడంతో పాటు నీళ్లు నిల్వ ఉండి దుర్గంధం వెదజల్లుతోంది.
ఆధునీకరణ పనుల్లో తీవ్ర జాప్యం…
రాష్ట్ర రవాణా, బీసీ సంక్షేమ శాఖ మంత్రిగా బాధ్యతలు చేపట్టిన అనంతరం పొన్నం ప్రభాకర్ బస్టాండ్‌ను సందర్శించి ఆధునీకరణ పనుల కోసం రూ.2కోట్లు ప్రకటించారు. అదనపు ప్లాట్‌ఫాంలు, అదనపు మరుగుదొడ్ల నిర్మాణం, బస్టాండ్ ఆవరణ మొత్తం సీసీ వేయాల్సి ఉంది. ఈ పనులు మొదలై నెల రోజులు దాటుతున్నా అందులో ఏమాత్రం పురోగతి కనిపించడం లేదనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. సీసీ కోసం తీసిన గొయ్యి తీసిన వెంటనే పనులు పూర్తి చేయాల్సిన కాంట్రాక్టర్ అలాగే వదిలేయడంతో వర్షపునీటితో పాటు డ్రైనేజీల్లోని నీరు చేరి దుర్గంధం వ్యాపిస్తోంది. రవాణాశాఖమంత్రి ఇలాఖాలోనే బస్టాండ్ పరిస్థితి ఇలా ఉంటే మిగతా చోట్ల ఎలా ఉంటుందనే చర్చ ఊపందుకుంటోంది. ఇప్పటికైనా మంత్రి పొన్నం ప్రత్యేక దృష్టి సారించి బస్టాండ్ ఆధునీకరణ పనులను త్వరగా పూర్తి చేయించాలని, భవిష్యత్‌లో బస్టాండ్ ఆవరణలోకి వర్షపు నీరు రాకుండా చర్యలు చేపట్టాలని హుస్నాబాద్ పట్టణ ప్రజలతోపాటు ప్రయాణికులు కోరుతున్నారు.
వర్షపు నీటిలో మునిగిన కార్గో కార్యాలయం
ఆర్టీసీ యాజమాన్యం విజయవంతంగా నిర్వహిస్తున్న కార్గో సేవల్లో భాగంగా హుస్నాబాద్ బస్టాండ్ ఆవరణలోఏర్పాటు చేసిన కార్యాలయం ఇటీవల కురిసిన వర్షానికి పూర్తిగా నీటిలో మునిగిపోయింది. అందులో ఎలాంటి వస్తువులు తడిసిపోయాయో, ఎన్ని అక్కరకు రాకుండా పోయాయో తెలియని పరిస్థితి నెలకొంది. ఇప్పటికీ కార్గో కార్యాలయం వర్షపు నీళ్లతోనే నిండి ఉండటం గమనార్హం. విలువైన వస్తువులు నిల్వ చేసి వినియోగదారులకు చేర్చాల్సిన కార్యాలయానికి భద్రత లేకుండా పోవడం బాధాకరం. అంతేకాకుండా ద్విచక్రవాహన స్టాండ్ కూడా వర్షంపడితే చాలు పూర్తిగా మునిగిపోయే పరిస్థితి ఉంది. భారీ వర్షం కురిస్తే బస్టాండ్‌లోంచి వాహనాలు బయటకు తీయడం కష్టంగా మారుతోంది. ఇంతటి అసౌకర్యాల మధ్య, దుర్గంధం మధ్య, శిథిలావస్థ మధ్య కొట్టుమిట్టాడుతున్న బస్టాండ్ ఎన్నడు బాగుపడుతుందోనని ప్రజలు చర్చించుకుంటున్నారు. దీనిపై మంత్రి ప్రత్యేక దృష్టి సారించాలని కోరుతున్నారు.
Read Today's Latest Medak News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Bear attacks | తంగేడు పువ్వు కోసం వెళ్లిన వ్యక్తిపై ఎలుగుబంటి దాడి.. తీవ్ర గాయాలు
Karthik Subbaraj | చిరంజీవి గారికి కథ చెప్పాను.. ఇంకా ఫైనలైజ్ కాలేదు: డైరెక్టర్ కార్తీక్ సుబ్బరాజ్
ఆడపడుచుల ఆత్మగౌరవం.. ప్రకృతి ప్రేమకు ప్రతీక బతుకమ్మ : పద్మా దేవేందర్ రెడ్డి
Crops | ట్యాంకర్లతో నీటి కొనుగోలు.. అయినా తీరని సాగునీటి కష్టాలు
Chiranjeevi | ‘జైలర్ 2’ సినిమాటోగ్రాఫర్‌కు చిరంజీవి అభినందనలు.. ‘కాకా’ సెట్స్‌లో ప్రత్యేక వేడుక!
ట్రెండింగ్ వార్తలు
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్

