హరిత ఠాణా
జఠిలమైన ప్రతి సమస్య పరిష్కారానికి వచ్చే బాధితులతో చర్చలు జరిపి పరిష్కార మార్గం చూపడం.. శాంతిభద్రతల పరిరక్షణకు నిరంతరం తీరిక లేకుండా ఉండే కార్యాలయం పోలీస్ స్టేషన్. మంచి మనసుంటే మార్గం ఉంటుందని అధికారులు, సిబ్బంది నిరూపించారు
- చిన్నకోడూర్ పోలీస్‌స్టేషన్‌కు పచ్చతోరణం
- పచ్చదనంతో ఆహ్లాదం పంచుతున్న రక్షకభట నిలయం
- ఏపుగా పెరిగిన మామిడి, జామ, బాదం, దానిమ్మ, టేకు చెట్లు
చిన్నకోడూర్, జూలై 21: జఠిలమైన ప్రతి సమస్య పరిష్కారానికి వచ్చే బాధితులతో చర్చలు జరిపి పరిష్కార మార్గం చూపడం.. శాంతిభద్రతల పరిరక్షణకు నిరంతరం తీరిక లేకుండా ఉండే కార్యాలయం పోలీస్ స్టేషన్. మంచి మనసుంటే మార్గం ఉంటుందని అధికారులు, సిబ్బంది నిరూపించారు. విధి నిర్వహణలో సమన్వయంతో పనిచేస్తూ సమష్టిగా కృషిచేసి మొక్కల పెంపకంపై ప్రత్యేక శ్రద్ధ వహిస్తూ చిన్నకోడూరు పోలీస్ స్టేషన్ పరిసరాలను పచ్చదనంతో కళకళలాడేలా చేశారు.
చిన్నకోడూర్ పోలీస్ స్టేషన్‌కు సుమారు రెండు ఎకరాల విశాలమైన స్థలం ఉంది. భవనాన్ని మాత్రమే నిర్మించి ప్రహరీని ఏర్పాటు చేయకపోవడంతో చెట్ల పెంప కానికి అసౌకర్యంగా మారింది. అనంతరం ప్రహరీ ఏర్పాటు చేయడం తో పాటు సిబ్బంది ముందుకొచ్చి మొక్కలు నాటారు. వివిధ రకాల నీడనిచ్చే మొక్కలను నాటగా, ఏపుగా పెరిగి పర్యావరణ పరిరక్షణకు దోహదపడుతున్నాయి. పోలీస్ స్టేషన్‌కు వచ్చేవారికి ఆహ్వానం పలికేలా ముఖద్వారానికి ఇరువైపులా అలంకరణ మొక్కలను పెంచారు. వీటి సంరక్షణకు ప్రత్యేక చొరవ తీసుకొని మొక్కలను కంటికి రెప్పలా కాపాడుతున్నారు. పూలు, మామిడి, జామ, బాదం, దానిమ్మ వంటి మొక్కలు ఏపుగా పెరిగాయి. ఆవరణలో పెంచిన వేప, రావి ఇతర రకాల మొక్కలు చల్లదనంతో పాటు నీడను ఇస్తున్నాయి. ఆవరణలో ఏపుగా పెరిగి వేప చెట్టుకు చుట్టూ ఇటుకలతో గద్దెను నిర్మించారు. దీంతో పోలీస్‌స్టేషన్‌కు వచ్చిన వారు చెట్ల కింద సేదతీరుతున్నారు. గతంలో విధులు నిర్వహించిన ఎస్సై రంగులు వేయించడంతో భవనం కొత్తకళను సంతరించుకుంది. అందమైన భవనానికి తోడు పచ్చదనంతో ఆహ్లాదంగా దర్శనమిస్తోంది.
పర్యావరణ పరిరక్షణ మన బాధ్యత..
కలిసి కట్టుగా పనిచేస్తే సాధించలేనిది ఏదీ ఉండదు. చిన్నకోడూరులో పోలీస్ స్టేషన్లో గతంలో విధులు నిర్వహించిన అధికారులు, సిబ్బంది సమష్టి కృషితోనే పచ్చదనం పెంపు, ఆహ్లాదకర వాతావరణం సాధ్యమైంది. మొక్కలను పెంచడం మన బాధ్యతగా భావించాలి. పర్యావరణ పరిరక్షణకు ప్రతి ఒక్కరూ కృషిచేయాలి.
– శివానందం, ఎస్సై, చిన్నకోడూరు
Read Today's Latest Medak News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
LOC | సరిహద్దు రేఖ వద్ద పేలిన ఐఈడీ.. లష్కరే తొయిబా కీలక నేత సహా నలుగురు హతం..!
Yaba Tablets | అస్సాంలో రూ.10 కోట్ల విలువైన డ్రగ్స్ పట్టివేత..!
Bharat Rice | రక్షణ దళాల కోసం ‘భారత్ రైస్’.. ఎఫ్‌సీఐతో ఆర్మీ ఒప్పందం
Ganja Chocolates | కరీంనగర్ జిల్లాలో గంజాయి చాక్లెట్స్ కలకలం
Rahul Gandhi | ఓట్ల దొంగతనంలో సీఈసీ ప్రధాన నేరస్థుడు కాదు : రాహుల్‌గాంధీ
ట్రెండింగ్ వార్తలు
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?

