అన్నదాతకు కోడ్ తోడు
వ్యవసాయాభివృద్ధి, రైతు సంక్షేమానికి అనేక పథకాలు అమలు చేస్తున్న రాష్ట్ర ప్రభుత్వం నాసిరకం విత్తనాలకు చెక్ పెడుతూ తాజాగా నిర్ణయం తీసుకుంది. ప్రతి విత్తన సంచిపై క్యూఆర్ (క్విక్ రెస్పాన్స్) కోడ్ ముద్రణ తప్పనిసరి చేసింది.
- నాసిరకం విత్తనాలను కట్టడి చేసేలా ప్రభుత్వ నిర్ణయం
- ఈ వానకాలం నుంచే అమలు
- అన్నదాతల మేలు కోసం రాష్ట్ర ప్రభుత్వ చర్యలు
- సంచులపై ముద్రిస్తున్న విత్తన కంపెనీలు
వ్యవసాయాభివృద్ధి, రైతు సంక్షేమానికి అనేక పథకాలు అమలు చేస్తున్న రాష్ట్ర ప్రభుత్వం నాసిరకం విత్తనాలకు చెక్ పెడుతూ తాజాగా నిర్ణయం తీసుకుంది. ప్రతి విత్తన సంచిపై క్యూఆర్ (క్విక్ రెస్పాన్స్) కోడ్ ముద్రణ తప్పనిసరి చేసింది. విత్తన ప్యాకెట్లపై క్యూఆర్ కోడ్‌ను కచ్చితంగా ముద్రించాలని విత్తన కంపెనీలను ఆదేశించింది. ఈ వానకాలం సీజన్ నుంచే అమలు చేయాలని నిర్ణయం తీసుకుంది. ప్రభుత్వ ఆదేశానుసారం కంపెనీలు క్యూఆర్ కోడ్ ముద్రిస్తూ పారదర్శకత పాటిస్తున్నాయి. ఈ ప్రక్రియతో రైతులకు నాణ్యమైన విత్తనాలు అందనున్నాయి. దీంతో అన్నదాతలు హర్షం వ్యక్తం చేస్తున్నారు.
-మెదక్ మున్సిపాలిటీ, మే 25
మెదక్ మున్సిపాలిటీ, మే 25: ఏటా పలు కంపెనీలు విత్తనాలను ఉత్పత్తి చేస్తూ మార్కెట్లో విక్రయిస్తుంటాయి. ఈ తరుణంలో నాసిరకం విత్తనాలు రైతులను నట్టేట ముంచుతున్నాయి. నాసిరకం విత్తనాలను నియంత్రించేందుకు ప్రభుత్వం మండల, జిల్లాస్థాయిలో టాస్క్‌ఫోర్స్ కమిటీలను ఏర్పాటు చేసి తనిఖీలు చేయిస్తోంది. అయినా ఏదో ఒక చోట నాసిరకం విత్తనాలతో రైతులు మోసపోతూనే ఉన్నారు. రైతు సంక్షేమానికి పెద్ద పీట వేస్తున్న కేసీఆర్ ప్రభుత్వం నాసిరకం విత్తనాలకు చెక్ పెడుతూ క్యూఆర్ కోడ్‌ను అమలులోకి తెచ్చింది. నాసిరకం విత్తనాల కొనుగోలు చేసి రైతులు మోసపోవద్దనే ఉద్దేశంతో ఈ పద్ధతికి శ్రీకారం చుట్టింది. విత్తన ప్యాకెట్లపై క్యూఆర్ కోడ్‌ను ముద్రించేలా కంపెనీలకు స్పష్టమైన ఆదేశాలు జారీ చేసింది. ఈ నిర్ణయంతో రైతులకు నాణ్యమైన విత్తనాలు అందనున్నాయి. క్యూఆర్ కోడ్ అమలుతో నాసిరకం విత్తనాల బెడద పూర్తిగా నియంత్రణలోకి రానున్నది. విత్తన ప్యాకెట్లపై కంపెనీలు ముదించే క్యూఆర్ కోడ్‌ను స్కాన్ చేస్తే విత్తనాల సమగ్ర సమాచారాన్ని రైతులు సులువుగా తెలుసుకునే అవకాశం ఉంటుంది.
రైతులకు అండగా…
డీలర్ల వద్ద రైతులు విత్తనాలను కొనుగోలు చేసి రసీదులు తీసుకున్నప్పటికీ ఆ విత్తనాలు మొలకెత్తకపోయినా, ఇతర సమస్యలతో రైతులు నష్టపోయినా సంబంధిత కంపెనీల నుంచి పరిహారం అందేది కాదు. విత్తన కంపెనీలు కేవలం సంచులు, ప్యాకెట్లపై ట్రూత్ పుట్ లేబుల్ అతికించి సరఫరా చేసేవి. దీంతో ఈ విత్తనాలు వంద శాతం నాణ్యమైనవిగా రైతులను నమ్మించి వ్యాపారులు సొమ్ము చేసుకునేవారు. ఇవన్నీ సమర్థనీయమైన ప్రమాణాలు కావని గుర్తించిన రాష్ట్ర ప్రభుత్వం క్యూఆర్ కోడ్ విధానాన్ని తీసుకొచ్చింది. ఈ విధానం రైతులకు అండగా నిలువనుంది.
విత్తన సంచులు భద్రపర్చుకోవాల్సిందే…
రైతులు విత్తనాలు కొనుగోలు చేసినపుడు డీలర్ నుంచి రసీదు పొందాలి. క్యూఆర్ కోడ్‌తో గల సంచులు, ప్యాకెట్లను భద్రపర్చుకోవాలి. ఒకవేళ సరైన దిగుబడి రాకుండా మోసపోతే సదరు కంపెనీ నుంచి పరిహారం పొందేందుకు వీలుంటుంది. క్యూఆర్ కోడ్‌ను వ్యవసాయాధికారులకు చూపితే విత్తన సమగ్ర సమాచారాన్ని రైతులకు తెలియజేసేందుకు వారికి సులువవుతుంది.
నాసిరకం విత్తనాలకు చెక్
నాసిరకం విత్తనాలను పూర్తిగా నియంత్రించేందుకు రాష్ట్ర ప్రభు త్వం క్యూఆర్ కోడ్‌ను అమలులోకి తెచ్చింది. దీంతో రైతులకు నాణ్యమైన విత్తనాలు అందనున్నాయి. నాసిరకం విత్తనాలతో రైతులు మోసపోకుండా ఈ విధానం ఎంతగానో దోహదపడుతుంది. రైతులు విత్తనాలు కొనుగోలు చేసే సమయంలో విత్తన సంచులు, ప్యాకెట్లపై క్యూఆర్ కోడ్ ఉందో లేదో జాగ్రత్తగా పరిశీలించాలి.
– విజయనిర్మల, ఏడీఏ, మెదక్
Read Today's Latest Medak News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
KTR | నిరుపేద విద్యార్థికి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ల్యాప్‌టాప్ అందజేత
KCR | అల్లం బుచ్చవ్వ మరణం పట్ల బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ సంతాపం
Varanasi | వారణాసిలో రామాయణ ఘట్టం.. రాజమౌళి మార్క్ వీరత్వంతో రాముడి పాత్రను చూపించనున్నారా?
Talasani Srinivas Yadav | భాగ్యలక్ష్మి అమ్మవారి సన్నిధిలో తలసాని శ్రీనివాస్ యాదవ్.. వీడియో
Krakow Shooting: పోలాండ్‌లో కాల్పుల ఘటన.. ఆరుగురు మృతి, గన్‌మెన్ ఇంట్లో మరిన్ని మృతదేహాలు
ట్రెండింగ్ వార్తలు
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి

