Rainy season | వర్షాకాలం జర పైలం.. పాము కరిస్తే వెంటనే ఇలా చేయండి!
మితిమీరిన రసాయనిక ఎరువులు, పురుగు మందుల వాడకంతో సాగుభూముల్లో భూసారం తగ్గి, దిగుబడులపై ప్రభావం చూపుతున్నాయి. రెక్కలు ముక్కలు చేసుకుంటే సరైన దిగుబడులు రాక రైతులు నష్టపోతున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో భూసారం పెంచుకునేందుకు పచ్చిరొట్ట ఎరువులపై రైతులకు వ్యవసాయాధికారులు విస్తృతంగా అవగాహన కల్పిస్తున్నారు.
- ఆందోళన చెందవద్దు
- కరిచిన వెంటనే వైద్యులను ఆశ్రయించాలి
- సర్కారు దవాఖానల్లో అందుబాటులో మందులు
Rainy season | వర్షాలతో పాటే పాములు వస్తుంటాయి. జూన్ నుంచి సెప్టెంబర్ వరకు పాములు ఇతర విషకీటకాల బెడద అధికంగా ఉంటోంది. ధాన్యపు గాదెలు, గడ్డివాములు, మొదలైనవి ఉండే చోట ఎలుకలు తిరుగుతుంటాయి. పొలాల వద్ద గట్ల మధ్య ఎలుకలను తినడానికి పాములు వస్తుంటాయి. తడిగా ఉండే చోట కప్పలు చేరుతాయి. వాటిని తినడానికి పాములు వస్తాయి. వర్షపు నీటితో పుట్టలు నిండిపోవడంతో అవి బయటకు వస్తాయి. ఇంటి చుట్టూ ఎక్కువగా గడ్డి ఉంటే ఎప్పటికప్పుడూ శుభ్రం చేసుకోవాలి. అదేవిధంగా చీమల పుట్టలు కూడా తొలిగించాలి. చెత్తాచెదారం ఎక్కువై ఎలుకల సంఖ్య పెరగడంతో వాటి కోసం పాములు జనావాసాల్లోకి వస్తుంటాయి. కాబట్టి తగిన జాగ్రత్తలు తీసుకోవాలి.
గ్రామాల్లో చాలాచోట్ల ప్రజలు ఇంటి ఆరుబయట పడుకుంటారు. అలాంటప్పుడు పాములు వచ్చే అవకాశం ఉంది. అలాంటప్పుడు దోమతెరలు వాడాలి. కొన్ని జంతువులు పాములను చూసి అరుస్తాయి. అలాంటప్పుడు వెంటనే అలర్ట్ కావాలి. కప్పలు, ఎలుకలు ఇంట్లో ఉంటే వాటిని తినేందుకు పాములు వస్తాయి. మట్టిగోడలు, ప్లోరింగ్ లేని ఇండ్లలోకి పాములు ఎక్కువగా వస్తాయి. వానకాలం సీజన్లో గ్రామీణ ప్రాంతాల్లో చాలా మంది పాముకాటుకు గురై మరణిస్తుంటారు. పాముకాటుకు గురికావద్దంటే ప్రజలు కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి.
పాములు-రకాలు
పాముల్లో చాలా వాటికి విషయం ఉండదు. తాచు, కట్లపాము వంటి 15 శాతం ప్రమాదకరమైన సర్ప జాతులతోనే ప్రమాదం ఉంటుంది. అన్ని పాము కాట్లు ప్రమాదకరమైనవి కావు. సాధారణంగా 50శాతం పాముకాట్లు విషంలేని, ప్రమాదం లేని మామూలు గాయాలే. సాధారణ చికిత్స తీసుకుంటే ఈ గాయాలు నయమవుతాయి. పాముల కన్నా చాలా మంది షాక్‌తోనే ప్రాణం మీదికి తెచ్చుకుంటారు.
పాముకాటుకు ప్రథమ చికిత్స..
పాము కరిచిన వ్యక్తి కాటును పరిశీలిస్తే విషసర్పం కరిచిన ప్రదేశంలో రెండు రంధ్రాలు ఉండి వీటి నుంచి రక్తం కారుతూ ఉంటుంది. విషరహిత పాము కరిచిన అనేక రంధ్రాలు ఉంటాయి. కాటుకు గురైన వెంటనే కాటుకు గురైన అవయవంపై భాగంలో తాడుతో గాని, గుడ్డతో గాని రక్తప్రసరణ జరగకుండా గట్టిగా కట్టాలి. కాటుకు గురైన భాగాన్ని పొటాషియం పర్మాంగనేట్‌తో కడిగి ఆ భాగంలో సుమారు రెండు సెంటీమీటర్ల లోతు గాడిపెట్టి రక్తం పిండి వేయాలి. తరువాత కాటుపై భాగంలో నుంచి వేడి నీటిని పోస్తూ ఉంటే చాలావరకు విషయం బయటకు పోతుంది. తరువాత పాముకాటు ప్రదేశంలో పటిక ముక్కను ఉంచాలి. బాధితుడిని కదలకుండా ఉంచి వేడి టీ గాని, కాఫీ గాని, పాలు గాని ఇవ్వాలి. ఒకవేళ బాధితుడికి శ్వాసక్రియ ఆగిపోతే కృతిమ శ్వాసక్రియ కల్పించాలి. కాటు వేసిన పాము ఏదో తెలిసిన వెంటనే యాటీవీనం ఇవ్వాలి. తెలియనప్పుడు పాలివోనం ఇవ్వాలి. పాము విషయం ప్రభావాన్ని విరిచేందుకు ఇంజక్షన్ ద్వారా ఇచ్చే యాంటీ స్నేక్ వీనమ్ సిరమ్లే కాక యాంటీ బయాటిక్స్ కూడా ఇవ్వాల్సి ఉంటుంది. పాము కరిచిన చోట విషంతో పాటు దాని నోట్లో ఉండే వందలాది రకాల ప్రమాదకర బ్యాక్టీరియా గాయాల్లోకి చేరుతుంది. యాంటీ బయాటిక్స్ ఇవ్వకపోతే గాయాల వద్ద చర్మం కుళ్లి అవయవాలు దెబ్బతినే ప్రమాదం ఉంది.
భయాందోళన చెందొద్దు…
పాముకాటుకు గురైన వారు ఎట్టి పరిస్థితుల్లో ఆందోళన చెందవద్దు. ఆందోళన చెందితే గుండెపోటుకు గురయ్యే అవకాశాలు ఉన్నాయి. ప్రాథమిక చర్యగా కాటువేసిన భాగంలో కట్టు కట్టాలి. పాముకాటుకు గురైనవారు మూఢనమ్మకాల జోలికి వెళ్లవద్దు. కొందరు పాము కరవగానే కొన్ని రకాల ఆకు రసాలను పిండిపోస్తారు. అది మంచిది కాదు. మరికొందరు మంత్రాలను నమ్ముతారు. అవి ఏమాత్రం పనిచేయవు. ఇలా చేస్తే ప్రాణాలకే ముప్పు ఉంటుందని వైద్యులు చెబుతున్నారు.
నాగుపాము:రెండు మీటర్ల పొడవు గలిగి గోధుమ లేదా నలుపు రంగులో తలపైన సున్నా వంటి గుర్తును కలిగిన విష సర్పం. ఇది కాటేసిన కేవలం 15 నిమిషాల్లో శరీరంలోకి విషం ఎక్కుతుంది.
అప్రమత్తంగా ఉండాలి..
పాముకాటుకు గురైన వారు ఎలాంటి భయాందోళనకు గురి కావద్దు. పాముకాటుకు మందులు కొల్చారం ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో అందుబాటులో ఉన్నవి. పాముకాటుకు గురైన వారు ఏమాత్రం నిర్లక్ష్యం చేసినా ప్రాణాలకే ముప్పు ఉంటుంది. వెంటనే వైద్యులను ఆశ్రయించి చికిత్స పొందాలి. నాటువైద్యం విషయంలో జాగ్రత్తగా ఉండాలి.
– రమేశ్, కొల్చారం ప్రాథమిక వైద్య ఆరోగ్య కేంద్రం వైద్యుడు
రక్తపింజర:తలపైన ‘బీ’ ఆకారం కలిగి వెనుకకు తిరిగిన పొడవైన కోరలు ఉంటాయి. పృష్ట తలంలో మూడు వరుసల డైమండ్ ఆకారపు మచ్చలు ఉంటాయి. ఇది కాటేసిన రెండు గంటల తర్వాత విషం శరీరంలోకి ఎక్కుతుంది.
కట్లపాము:కట్లపాము నాగుపాము కంటే విష పూరితమైనది. ఇది కాటేసిన క్షణాల్లోనే విషం రక్త కణాల్లో కలుస్తుంది. ప్రమాదం తీవ్రతను దృష్టిలో ఉంచుకుని వెంటనే దవాఖానలో చేర్పించాలి. శరీరంపై మధ్యమధ్యలో అడ్డంగా చారలు ఉంటాయి.
Read Today's Latest Medak News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Motorola | మోటరోలా నుంచి మరో ఫోల్డబుల్ ఫోన్.. పేరు, ఫీచర్లు లీక్.. ఎప్పుడొస్తుందంటే?
Suspicious Death | అమెరికాలో జగిత్యాల జిల్లా యువకుడు అనుమానాస్పద స్థితిలో మృతి
AP SEO | పట్టణ ప్రాంతాల్లో ఎన్నికల కోడ్ ఎత్తివేత : ఏపీ ఎస్ఈవో
Triptii Dimri | బ్లాక్ అవుట్‌ఫిట్‌లో బ్యూటీ క్వీన్ త్రిప్తి దిమ్రి అందాల విందు
Night Routine Habits | రాత్రి ఈ 6 పనులు చేస్తున్నారా? మీ జీవితంలో అద్భుతమైన మార్పు ఖాయం!
ట్రెండింగ్ వార్తలు
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి

