స్ట్రాంగ్‌రూంలకు అభ్యర్థుల భవితవ్యం
పార్లమెంట్ ఎన్నికలు సోమవారం ముగియడంతో మెదక్ పార్లమెంట్ పరిధిలోని వివిధ మండలాలకు చెందిన ఈవీఎంలను ఎన్నికలు అధికారులు నర్సాపూర్‌లోని రెండు స్ట్రాంగ్‌రూమ్‌లకు తరలించారు. నర్సాపూర్ పట్టణంలోని బీవీఆర్ఐటీ కళాశాల, గిరిజన గురుకుల బాలుర పాఠశాలలో స్ట్రాంగ్‌రూమ్‌లను ఏర్పాటు చేసి ఈవీఎంలను భద్రపర్చారు.
- మెదక్ పార్లమెంట్ పరిధిలోని ఈవీఎంలు నర్సాపూర్‌లోని బీవీఆర్ఐటీ కళాశాల, గిరిజన గురుకుల బాలుర పాఠశాలకు తరలింపు
- జహీరాబాద్ పార్లమెంట్ పరిధిలోని ఈవీఎంలు పటాన్చెరు మండలం రుద్రారంలోని గీతం యూనివర్సిటీకి..
- సీసీ కెమెరాల నిఘా నీడలో స్ట్రాంగ్‌రూమ్‌ల వద్ద మూడంచెల భద్రత
నర్సాపూర్, మే 14: పార్లమెంట్ ఎన్నికలు సోమవారం ముగియడంతో మెదక్ పార్లమెంట్ పరిధిలోని వివిధ మండలాలకు చెందిన ఈవీఎంలను ఎన్నికలు అధికారులు నర్సాపూర్‌లోని రెండు స్ట్రాంగ్‌రూమ్‌లకు తరలించారు. నర్సాపూర్ పట్టణంలోని బీవీఆర్ఐటీ కళాశాల, గిరిజన గురుకుల బాలుర పాఠశాలలో స్ట్రాంగ్‌రూమ్‌లను ఏర్పాటు చేసి ఈవీఎంలను భద్రపర్చారు. మెదక్ పార్లమెంట్ పరిధిలోని ఏడు అసెంబ్లీ నియోజకవర్గాలకు సంబంధించిన ఈవీఎంలలో ఐదు మండలాల ఈవీఎంలను బీవీఆర్ఐటీ కళాశాలలో, రెండు నియోజకవర్గాలకు చెందిన ఈవీఎంలను గిరిజన గురుకుల బాలుర పాఠశాలలో భద్రపర్చారు. బీవీఆర్ఐటీ కళాశాలలో నర్సాపూర్, గజ్వేల్, దుబ్బాక, మెదక్, సిద్దిపేట నియోజకవర్గాలు, గిరిజన గురుకుల బాలుర పాఠశాలలో సంగారెడ్డి, పటాన్చెరు నియోజకవర్గాల ఓట్ల లెక్కింపు ఉంటుందని ఎన్నికల రిటర్నింగ్ అధికారి(ఆర్డీవో) జగదీశ్వర్‌రెడ్డి వెల్లడించారు. స్ట్రాంగ్ రూమ్‌లను పరిశీలించాలనుకుంటే అభ్యర్థులకు అనుమతిస్తామని చెప్పారు. స్ట్రాంగ్‌రూమ్‌లకు మూ డంచెల భద్రత ఏర్పాటు చేశామని ఎస్సై పుష్పరాజ్ తెలిపారు. ఇందులో 48 మంది సెంట్రల్ ఫోర్స్, 48 మంది స్టేట్ ఫోర్స్, 48 మంది సివిల్ ఫోర్స్‌తో పాటు సీసీ కెమెరాల మధ్య కట్టుదిట్టమైన భద్రత ఏర్పాటు చేశామని చెప్పారు.
గీతం యూనివర్సిటీకి….
పటాన్చెరు, మే 14: జహీరాబాద్ పార్లమెంట్ పరిధిలోని వివిధ మండలాలకు చెందిన ఈవీఎంలు గీతం యూనివర్సిటీలో ఏర్పాటు చేసిన స్ట్రాంగ్‌రూంలకు చేరాయి. మంగళవారం ఉదయం వరకు పటాన్చెరు మండలం రుద్రారం గ్రామంలోని గీతం యూనివర్సిటీ స్ట్రాంగ్ రూంకు ఈవీఎంలు వచ్చాయి. సంగారెడ్డి జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ వల్లూరు క్రాంతి, ఎస్పీ రూపేశ్ స్ట్రాంగ్‌రూంలను పరిశీలించారు. వాహనాల్లో తీసుకొచ్చిన ఈవీఎంలను ఎన్నికల సిబ్బంది ఏడు నియోజకవర్గాలకు కేటాయించిన గదుల్లోకి తరలించారు. జుక్కల్, బాన్స్వాడ, ఎల్లారెడ్డి, కామారెడ్డి, నారాయణఖేడ్, ఆందోల్, జహీరాబాద్ నియోజకవర్గాల ఈవీఎంను స్ట్రాంగ్‌రూంలకు చేర్చి సీల్ వేశారు. సీసీ కెమెరాల పహారాలో స్రాంగ్రూంల ఎదుట సాయుధ బలగాలను ఉంచి గట్టి భద్రతను కల్పించా రు. అనంతరం జహీరాబాద్ అన్ని నియోజక వర్గాల స్ట్రాంగ్‌రూంల సీజ్‌ను, అక్కడ ఏర్పాటు చేసిన భద్రతను జిల్లా ఎన్నికల అధి కారి, ఎస్పీలు పరిశీలించారు. ఈవీఎంలను భద్రపర్చడంలో సమస్యలు ఉన్నాయా అని ఎన్నికల అధికారులను కలెక్టర్ అడిగి తెలు సుకున్నారు. అన్నీ సజావుగా జరిగాయని అధికారులు తెలపడంతో కలెక్టర్ వల్లూరు క్రాంతి సంతృప్తి వ్యక్తం చేశారు.
Read Today's Latest Medak News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Medak | కేసీఆర్ మరోసారి సీఎంగా బాధ్యతలు చేపడితేనే తెలంగాణకు మోక్షం
Motorola | మోటరోలా నుంచి మరో ఫోల్డబుల్ ఫోన్.. పేరు, ఫీచర్లు లీక్.. ఎప్పుడొస్తుందంటే?
Suspicious Death | అమెరికాలో జగిత్యాల జిల్లా యువకుడు అనుమానాస్పద స్థితిలో మృతి
AP SEO | పట్టణ ప్రాంతాల్లో ఎన్నికల కోడ్ ఎత్తివేత : ఏపీ ఎస్ఈవో
Triptii Dimri | బ్లాక్ అవుట్‌ఫిట్‌లో బ్యూటీ క్వీన్ త్రిప్తి దిమ్రి అందాల విందు
ట్రెండింగ్ వార్తలు
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి

