నేటి నుంచి ఏడుపాయల జాతర
తెలంగాణలో ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన ఏడుపాయల దుర్గామాత సన్నిధిలో నేటినుంచి మూడు రోజుల పాటు జరిగే జానపదుల జాతరకు అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు. బుధవారం మంత్రి దామోదర రాజనర్సింహ ముఖ్య అతిథిగా హాజరై అమ్మవారికి పట్టువస్ర్తాలు సమర్పించి జాతరను ప్రారంభిస్తారు.
పాపన్నపేట, ఫిబ్రవరి 25: తెలంగాణలో ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన ఏడుపాయల దుర్గామాత సన్నిధిలో నేటినుంచి మూడు రోజుల పాటు జరిగే జానపదుల జాతరకు అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు. బుధవారం మంత్రి దామోదర రాజనర్సింహ ముఖ్య అతిథిగా హాజరై అమ్మవారికి పట్టువస్ర్తాలు సమర్పించి జాతరను ప్రారంభిస్తారు. జాతరకు తెలంగాణ, కర్ణాటక, మహారాష్ట్ర,ఆంధ్రప్రదేశ్ నుంచి సుమారు 15లక్షల మంది భక్తులు వస్తారని అధికారులు అంచనా వేశారు.
జాతర మొదటి రోజు శివరాత్రి సందర్భంగా భక్తులు మంజీరా నదిలో పుణ్యస్నానాలు చేసి దుర్గమ్మను దర్శించుకొని శివదీక్షలు చేపడతారు. సాయంత్రం దీక్షలు విరమిస్తారు. గురువారం ఎద్దుల బండ్లు తిరిగే కార్యక్రమం అద్భుతంగా కొనసాగుతుంది. మొదట పాపన్నపేట సంస్థానాధీశుల బండి తిరగగా మిగతావి దాన్ని అనుసరిస్తాయి. ఉత్సవాల మూడో రోజు శుక్రవారం రథోత్సవం జరుగుతుంది.
హైదరాబాద్, సికింద్రాబాద్, జోగిపేట, సంగారెడ్డి వైపు నుంచి వచ్చే భక్తులు నర్సాపూర్ మీదుగా పోతన్‌శెట్టిపల్లి నుంచి నూతన బ్రిడ్జిల మీదుగా ఏడుపాయలకు చేరుకోవాలి. మెదక్ వైపు నుంచి వచ్చేవారు ఇదే మార్గం గుండా వెళ్లాల్సి ఉంటుంది. జహీరాబాద్, బీదర్, నారాయణఖేడ్ వైపు నుంచి వచ్చే భక్తులు బొడ్మట్‌పల్లి మీదుగా నాగసాన్పల్లి కమాన్ నుంచి ఏడుపాయలకు చేరుకోవాలి. హైదరాబాద్, నర్సాపూర్, జోగిపేట వైపు నుంచి వచ్చే భక్తులు తమ వాహనాలను రెండో బ్రిడ్జి వద్ద పార్కింగ్ చేసి జాతరకు వెళ్లాల్సి ఉంటుంది. నారాయణఖేడ్ వైపు నుంచి వచ్చే వారు చెలిమెల కుంట వద్ద పార్కు చేయాల్సి ఉంటుంది.
Read Today's Latest Medak News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Son of Kanakadurgamma | ‘సన్ ఆఫ్ కనకదుర్గమ్మ’ చిత్రం నుంచి అమ్మవారిగా నటి లయ పవర్ఫుల్ పోస్టర్ విడుదల
Manchu Manoj | పోతరాజు నేపథ్యంలో మంచు మనోజ్ హీరోగా RPA క్రియేషన్స్‌లో భారీ డివైన్ యాక్షన్ థ్రిల్లర్
Health Tips | మనలోని కొన్ని అలవాట్లే మోకాళ్ల నొప్పులకు దారితీస్తాయ్.. అవేంటో తెలుసా..?
Jagadish Reddy | సూర్యాపేటలో మతసామరస్యానికి ప్రతీకగా సామూహిక విందు.. జగదీష్ రెడ్డి ఆత్మీయ పలకరింపు
Nishad Kumar | చరిత్ర సృష్టించిన నిషద్ కుమార్.. నిన్న లాంగ్ జంప్, ఇవాళ హైజంప్‌లో గోల్డ్‌మెడల్
ట్రెండింగ్ వార్తలు
Instagram Reels | రీల్స్ మోజులో బిడ్డను మరిచిన తల్లిదండ్రులు.. అలల్లో కొట్టుకుపోతున్న చిన్నారిని కాపాడిన యువకుడు!
Kavathe Ekand Dussehra | దీపావళికి కాదు.. దసరా రాత్రంతా బాణసంచా కాల్చే గ్రామం!
Palapitta | దసరా వేళ కనిపించని పాలపిట్టలు.. తెలంగాణ రాష్ట్ర పక్షి కనుమరుగవుతోందా?
Bastar Dussehra | రావణ దహనం లేని దసరా.. 75 రోజులపాటు జరిగే బస్తర్ ఉత్సవం ప్రత్యేకత ఇదే!
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం

