ఎడ్యుకేషన్ హబ్ ప్రాంగణంలో కంపుకొడుతున్న డ్రైనేజీ
సిద్దిపేట జిల్లా గజ్వేల్ పట్టణంలోనే ఎస్సీ, ఎస్టీ, బీసీ బాలుర, బాలికల వసతిగృహాలు తొమ్మిది ఉన్నాయి. గజ్వేల్ బాలుర ఎడ్యుకేషన్ హబ్ ప్రాంగణంలో ఉన్న ఎస్సీ బాలుర వసతిగృహంలోని డ్రైనేజీ పైపులు నిండిపోవడంతో దుర్గంధం వెదజల్లుతున్నది.
గజ్వేల్, జూలై 24: సిద్దిపేట జిల్లా గజ్వేల్ పట్టణంలోనే ఎస్సీ, ఎస్టీ, బీసీ బాలుర, బాలికల వసతిగృహాలు తొమ్మిది ఉన్నాయి. గజ్వేల్ బాలుర ఎడ్యుకేషన్ హబ్ ప్రాంగణంలో ఉన్న ఎస్సీ బాలుర వసతిగృహంలోని డ్రైనేజీ పైపులు నిండిపోవడంతో దుర్గంధం వెదజల్లుతున్నది. కొద్ది రోజులుగా డ్రైనేజీ పైపుల నుంచి మురుగునీరు పైకి ఉబికివస్తున్నది. వసతిగృహంలోని గదుల్లో కూర్చున్న విద్యార్థులకు వాసన రావడంతో తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.
గతంలోనే వార్డెన్ ఉన్నతాధికారుల దృష్టికి సమస్యను తీసుకెళ్లినా నేటికీ పరిష్కారం కాలేదు. డ్రైనేజీ సమస్యతో వసతిగృహంలోని కింది భాగంలోని కొన్ని గదులను వాడటం నిలిపివేశారు. బాలుర ఎడ్యుకేషన్ హబ్‌లోని ఎస్సీ, బీసీ వసతిగృహాలు రెండు పక్కపక్కనే ఉన్నాయి. వాటి మధ్యలో పిచ్చి మొక్కలు ఏపుగా పెరిగాయి. వసతిగృహాల చుట్టూ పరిసర ప్రాంతాలు పిచ్చిమొక్కలతో దర్శనమివ్వడంతో పారిశుధ సమస్య తీవ్రంగా కనిపిస్తున్నది. విద్యార్థులకు మెనూ ప్రకారం ఉదయం టిఫిన్, మధ్యాహ్నం, రాత్రి సమయంలో నాణ్యమైన భోజనాన్ని అందిస్తున్నట్లు విద్యార్థులు తెలిపారు. వసతిగృహాల వద్ద పారిశుధ్య సమస్యను పరిష్కరించాలని విద్యార్థుల తల్లిదండ్రులు కోరుతున్నారు.
Read Today's Latest Medak News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Bathukamma | లండన్‌లో ఘనంగా ‘టాక్-చేనేత బతుకమ్మ-దసరా’ సంబరాలు
Shahid Afridi: షాహిద్ అఫ్రిది మృతిచెందినట్లు సోషల్ మీడియాలో ఫేక్ పోస్టు
Bathukamma Celebrations | ఫ్రిస్కో నగరంలో అంబరాన్నంటిన ‘టి-ప్యాడ్’ బతుకమ్మ సంబరాలు .. ప్రత్యేక ఆకర్షణగా నవీన్ పోలిశెట్టి
Chinmay Sutar: చరిత్ర సృష్టించిన మిజోరం బ్యాటర్.. చిన్మయ సుతార్ 400 నాటౌట్
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం
ట్రెండింగ్ వార్తలు
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం
Watch: చర్చిలో మరణం గురించి మాట్లాడిన ఫాదర్.. ఆయన తలపై సిలువ పడటంతో మృతి
Samsung Galaxy F70 5G | రూ.17,999కే శాంసంగ్ 5జీ ఫోన్.. 50MP కెమెరా, 5000mAh బ్యాటరీతో వచ్చేసింది!
Black Deer | కుర్సియాంగ్ అడవుల్లో మరో నల్లజింక ప్రత్యక్షం.. పరవశించిన పర్యాటకులు..!
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!

