చారిత్రక చిహ్నాలను వివాదాస్పదం చేయొద్దు
రాజకీయ ఆలోచనలు, కారణాలు ఏవైనా కావొచ్చు.. ఏమైనా ఉండొచ్చు.. తెలంగాణ పేరెత్తగానే స్ఫురించే చారిత్రక చిహ్నాలను తొలిగించడం చారిత్రక తప్పిదమే అవుతుంది. చారిత్రక నేపథ్యం ఉన్న చిహ్నాల్ని రాజకీయ ఆలోచనలు, కారణాలతో వివాదాస్పదం చేయడం సరైంది కాదు.
సిద్దిపేట అర్బన్, మే 31: రాజకీయ ఆలోచనలు, కారణాలు ఏవైనా కావొచ్చు.. ఏమైనా ఉండొచ్చు.. తెలంగాణ పేరెత్తగానే స్ఫురించే చారిత్రక చిహ్నాలను తొలిగించడం చారిత్రక తప్పిదమే అవుతుంది. చారిత్రక నేపథ్యం ఉన్న చిహ్నాల్ని రాజకీయ ఆలోచనలు, కారణాలతో వివాదాస్పదం చేయడం సరైంది కాదు. సాధించుకున్న స్వరాష్ట్రంలో పరిష్కరించుకోవాల్సిన సమస్యలు ఎన్నో ఉండగా.. చిహ్నాల విషయంలో రాద్ధాంతం చేస్తూ ప్రభుత్వం సమస్యలను పక్కన పెట్టడం భావ్యం కాదు. ఎవరికీ మంచిది కాదు..
ఆత్మగౌరవ పతాకానెత్తుకొని….
తెలంగాణ ప్రాంతం రకరకాలుగా వివక్షతలకు గురైనప్పుడు ఆత్మగౌరవ పతాకానెత్తుకొని నీళ్లు, నిధులు, నియామకాలు నినాదంతో ఉద్యమించింది. భాష లేదంటే.. భాషాపద కోశాల్ని వెతుకున్నది. చరిత్ర లేదంటే.. పరిశోధనలు చేసి చారిత్రక వైభవాల్ని లిఖించుకున్నది. సాహిత్యకారుల్ని, ఆచార సంప్రదాయాల్ని అవమానిస్తే తెలంగాణ వ్యాప్తంగా సాహితీవేత్తలు, కళాకారులు పాటల పుట్టలై జనగర్జన చేశారు. ఆత్మగౌరవం కోసం సబ్బండ వర్గాలు ఒక్కటై సాధించుకున్న తెలంగాణలో చిహ్నాల రాద్ధాంతం ఎందుకు..? చారిత్రక చిహ్నాల విషయానికి వస్తే.. రాచరిక ఆధిపత్యం, అహంకారం, దర్పం లాంటి లక్షణాలు ఏమాత్రం లేవు. కాకతీయ రాజులు సైతం తెలంగాణపై ఇతరుల ఆధిపత్యాన్ని సహించలేదు. అందుకే ఢిల్లీ సుల్తానులు రాజ్యకాంక్షతో ఓరుగల్లుపై దండెత్తి వచ్చినప్పుడు అసమాన పోరాట పటిమతో ప్రతాపరుద్రుడు ఎదుర్కొన్నాడు. మహిళా పాలిస్తుందా..? అని తిరుగుబాట్లు చేసినప్పుడు రాణీ రుద్రమ పోరాట సామర్థ్యాన్ని ప్రదర్శించింది. కాకతీయులు ప్రజల విశ్వాసాలను, క్షేమాన్ని గుర్తించి ఆలయాలు, గొలుసుకట్టు చెరువుల నిర్మాణాలు చేపట్టారు. కాకతీయుల ఆధిపత్యాన్ని సహించని సమ్మక్క, సారలమ్మల పోరాటం చారిత్రాత్మకం. కాకతీయుల శిల్పకళ చాలా గొప్పది. రామప్ప గుడిని ఇటీవల యునెస్కో వాళ్లు వారసత్వ కట్టడంగా ప్రకటించి ప్రపంచానికి ఆ ఘనతను చాటారు. కాకతీయుల పేరుతో కాకతీయ విశ్వవిద్యాలయం ఏర్పాటు చేయబడింది. ఈ విశ్వవిద్యాలయానికి స్వాగత ద్వారాలు కళాతోరణాన్ని ఏర్పాటు చేశారు. తెలంగాణకు ముఖద్వారంగా ఉన్న కళాతోరణం చిహ్నాన్ని తెలంగాణ స్వాగత తోరణంగా భావించి తొలిగించకుండా చూడాలి. తెలంగాణ పేరెత్తగానే హైదరాబాద్.. హైదరాబాద్ పేరెత్తగానే భారతీయులకు, బయట ప్రపంచానికి చార్మినార్ స్ఫురించడం సహజం. చార్మినార్ రాచరిక చిహ్నం కాదు. రాజరిక ఠీవి, దర్పానికి గుర్తు కాదు. హైదరాబాద్‌లో ప్లేగు వ్యాధి ప్రబలి వేలాది మంది చనిపోయారు. నాటి పాలకుడైన కులీకుతుబ్ షాహి చలించి ఆ మహమ్మారి సృష్టించిన విపత్తుకు స్మృతి చిహ్నంగా చార్మినార్‌ను నిర్మింపజేశాడు. నాటి నుంచి వందల ఏండ్లుగా ఇక్కడి ప్రజల ఐకమత్యానికి ప్రతీకగా నిలిచింది.
ప్రజాభిప్రాయాల్ని గౌరవించాలి…
చారిత్రక పరిణామంలో, గమనంలో, చరిత్రలో అనేక మలుపు, దశలు ఉంటాయి. వాటిలో కొన్ని దశల్లో జరిగిన ఘటనలు, వాటి తాలూకా గుర్తులు నిలబడిపోతాయి. అలా చరిత్రలో ప్రత్యేక సంఘటనలకు గుర్తుగా కాకతీయ కళాతోరణం, చార్మినార్ నిలిచిపోయాయి. అలా నిలిచిపోయిన చిహ్నాల జోలికి పోకుండా ప్రజల ఆకాంక్షల మేరకు ప్రజాస్వామిక పాలన అందిస్తూ ప్రజల అభిప్రాయాల్ని గౌరవించకపోతే చారిత్రక తప్పిదం చేసినట్లే అవుతుంది. తెలంగాణ ప్రాంత ప్రజలు ఎదుర్కొన్న వివక్షతలపై తిరగబడి ఆత్మగౌరవ పతాకం చేబూని సబ్బండ వర్గాలు ఒకటై పోరాటం చేశారు. ప్రత్యేక తెలంగాణ ఉద్యమం 1969లో తొలిదశ, మలిదశల్లో చేసిన ఉద్యమాల్లో వందలాది మంది యువకులు, విద్యార్థులు ఆత్మ బలిదానాలతో ఉద్యమాన్ని ఉడుకెత్తించారు. ఈ దశాబ్ది ఉత్సవాల సందర్భంగా త్యాగాలు, బలిదానాలు చేసిన కుటుంబాల్ని ఆదుకోవడం ఉద్యమాల్లో పాల్గొన్న యువకుల్ని, విద్యార్థులు, ఉద్యమకారుల్ని గుర్తించి తగిన ప్రాధాన్యత ఇవ్వాల్సిన అవసరమున్నది. అమరవీరుల స్మృతి చిహ్నాన్ని సైతం గౌరవించుకోవాల్సిన అవసరమున్నది. త్యాగాల పునాదుల మీద సాధించుకున్న స్వరాష్ట్రంలో ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా ప్రజాస్వామిక పరిపాలన అందించాల్సిన బాధ్యత ప్రస్తుత పాలకులపై, ప్రభుత్వంపై ఉంది. ప్రజాభిప్రాయాల్ని గౌరవించాల్సిన బాధ్యత ప్రభుత్వాలదే.
– నర్ర భగవాన్‌రెడ్డి (చారిత్రక పరిశోధక విద్యార్థి, తెలంగాణ రచయితల సంఘం కార్యవర్గ సభ్యుడు)
Read Today's Latest Medak News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Ranbir Kapoor | హైదరాబాద్‌కు రావడం ఎప్పుడూ ప్రత్యేకమే.. తెలుగులో మాట్లాడిన రణ్‌బీర్!
Palapitta | దసరా వేళ కనిపించని పాలపిట్టలు.. తెలంగాణ రాష్ట్ర పక్షి కనుమరుగవుతోందా?
China Restrictions | కీలక యంత్రాల ఎగుమతులపై చైనా కొత్త ఆంక్షలు
Godavari Waters | వందలాది టీఎంసీల నీళ్లు వృధా.. కరువు సాకుతో రైతుల పొట్ట కొడుతున్న కాంగ్రెస్ సర్కార్
Prashanth Neel | భయపెట్టేందుకు వస్తున్న ప్రశాంత్ నీల్ ‘418’.. ఆసక్తికరంగా ట్రైలర్!
ట్రెండింగ్ వార్తలు
Palapitta | దసరా వేళ కనిపించని పాలపిట్టలు.. తెలంగాణ రాష్ట్ర పక్షి కనుమరుగవుతోందా?
Bastar Dussehra | రావణ దహనం లేని దసరా.. 75 రోజులపాటు జరిగే బస్తర్ ఉత్సవం ప్రత్యేకత ఇదే!
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం
Watch: చర్చిలో మరణం గురించి మాట్లాడిన ఫాదర్.. ఆయన తలపై సిలువ పడటంతో మృతి
Samsung Galaxy F70 5G | రూ.17,999కే శాంసంగ్ 5జీ ఫోన్.. 50MP కెమెరా, 5000mAh బ్యాటరీతో వచ్చేసింది!

