‘అమ్మ ఆదర్శ’ పనులు పూర్తి చేయాలి
అమ్మ ఆదర్శ పాఠశాలల కార్యక్రమం ద్వారా ప్రభుత్వ పాఠశాలల్లో చేపడుతున్న పనులను ఈనెల 20వ తేదీలోగా పూర్తి చేయాలని సిద్దిపేట జిల్లా కలెక్టర్ మను చౌదరి అధికారులను ఆదేశించా రు. శుక్రవారం కలెక్టరేట్లో పంచాయతీరాజ్ ఇంజినీరింగ్ అధికారులు, ఈడబ్ల్యూఐడీసీ ఇంజినీర్లు, విద్యాశాఖ అధికారులతో కలెక్టర్ సమావేశం నిర్వహించారు.
- సిద్దిపేట జిల్లా కలెక్టర్ మనుచౌదరి
సిద్దిపేట అర్బన్, జూన్ 7: అమ్మ ఆదర్శ పాఠశాలల కార్యక్రమం ద్వారా ప్రభుత్వ పాఠశాలల్లో చేపడుతున్న పనులను ఈనెల 20వ తేదీలోగా పూర్తి చేయాలని సిద్దిపేట జిల్లా కలెక్టర్ మను చౌదరి అధికారులను ఆదేశించా రు. శుక్రవారం కలెక్టరేట్లో పంచాయతీరాజ్ ఇంజినీరింగ్ అధికారులు, ఈడబ్ల్యూఐడీసీ ఇంజినీర్లు, విద్యాశాఖ అధికారులతో కలెక్టర్ సమావేశం నిర్వహించారు.
ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. ప్రభుత్వ పాఠశాలల్లో మౌలిక వసతులను మెరుగుపరిచేందుకు అమ్మ ఆదర్శ పాఠశాలల కార్యక్ర మం కింద జిల్లాలో 814 పాఠశాలల్లో విద్యు త్, తరగతి గదులు, మరుగుదొడ్లు, కిషన్ షెడ్లు, ప్రహరీల పనులు చేపడుతున్నట్లు తెలిపారు. పాఠశాలల పునఃప్రారంభం కావడానికి 5 రోజుల సమయం మాత్రమే ఉన్నా, కేవలం 176 పాఠశాలల్లో మాత్రమే పనులు పూర్తికావడంతో అసహనం వ్యక్తం చేశారు. చివరిదశలో ఉన్న పాఠశాలల్లో రంగులు పూర్తిచేసి 12వ తేదీలోగా సిద్ధం చేయాలన్నా రు.
మిగతా పాఠశాలల్లో ఈనెల 20వ తేదీలోగా వందశాతం పనులు పూర్తి చేయాలని ఆదేశించారు. పనుల పూర్తిచేయడంలో నిర్లక్ష్యంగా వ్యవహరించే అధికారులపై చర్యలు తీసుకుంటానని హెచ్చరించారు. సమీక్షలో పంచాయతీరాజ్ ఈఈలు, డీఈలు, ఏఈ లు, విద్యాశాఖ అధికారులు పాల్గొన్నారు.
Read Today's Latest Medak News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Kolkata stampede | కోల్కతా దుర్గా మండపంలో తొక్కిసలాట.. 19 మంది మృతి.. 25 మందికి గాయాలు
Kolkata Stampede | కోల్కతా తొక్కిసలాట.. మృతుల కుటుంబాలకు రూ.25 లక్షల ఆర్థికసాయం, ప్రభుత్వ ఉద్యోగం..!
KTR | తెలంగాణ ఆడపడుచులకు కేటీఆర్ సద్దుల బతుకమ్మ శుభాకాంక్షలు.. అస్తిత్వ సౌరభమే బతుకమ్మ!
Prabhas | ‘రణబాలి’ మిక్స్డ్ టాక్.. ‘ఫౌజీ’తోనైనా ప్రభాస్ కొత్త ట్రెండ్ సృష్టిస్తారా?
Dorothy OTT | ఓటీటీలోకి కీర్తి సురేష్ ‘డోరతి’.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే!
ట్రెండింగ్ వార్తలు
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్తో సస్పెండ్

