చెట్ల నరికివేతపై వివరాల సేకరణ

వెల్దుర్తి, మే 6: మెదక్ జిల్లా మాసాయిపేట మండలంలోని అచ్చంపేట, హకీంపేట శివారులో జమున హేచరీస్ నిర్మాణాల కోసం మాజీమంత్రి ఈటల ప్రభుత్వ భూమిలో నుంచి వేసిన రోడ్డులో నరికేసిన చెట్లపై అట వీ అధికారులు విచారణ కొనసాగిస్తున్నారు. గురువారం రామాయంపేట డిప్యూటీ రేంజ్ అధికారి కుత్బుద్దీన్, చిన్నశంకరంపేట సెక్షన్ అధికారి ఆజాంలు రోడ్డు నిర్మాణాన్ని పరిశీలించారు. సంబంధిత రైతుల నుంచి వివరాలు సేకరించారు. ఈ సందర్భంగా కుత్బుద్దీన్ మాట్లాడుతూ.. సుమారు కిలోమీటర్ మేర ప్రభుత్వ భూమిలో రోడ్డు నిర్మించారని తెలిపారు. ఇందులో 23 మామూలు సైజు చెట్లు, 5 ఎడ్లబడ్ల కంప నరికివేతకు గురైనట్టు గుర్తించామని చెప్పారు. రోడ్డు నిర్మాణంపై పరిశ్రమ ప్రతినిధులను వివరణ కోరగా తాము కొద్దిదూరం మాత్రమే రోడ్డు నిర్మా ణంచేపట్టామని వెల్లడించారు. అక్కడినుంచి గ్రామానికి వెళ్లి రైతులను విచారించామని.. తాము ఎలాంటి రోడ్డు నిర్మాణం చేపట్టలేదని గ్రామస్థులు చెప్పడంతో పంచనామా నిర్వహించామని వివరించారు. నివేదికను ఉన్నతాధికారులకు నివేదిస్తామని చెప్పారు.
Read Today's Latest Medak News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Liquor Sales | నీళ్లు నిల్.. మద్యం ఫుల్..! దసరాకు పల్లెల్లో పారిన మద్యపుటేరులు
Elections | రాష్ర్టాలు ఒప్పుకొంటే 2029లో జమిలి ఎన్నికలు..! : జేపీసీ చైర్మన్ పీపీ చౌదరి
Irrigation Crisis | ఇది కాంగ్రెస్ సర్కార్ లిఫ్ట్ ఇరిగేషన్..|
India vs New Zealand | ఇక న్యూజిలాండ్ సవాల్.. నేటి నుంచే టీ20 సిరీస్ మొదలు
Congress | కాంగ్రెస్ పాపం పాలమూరుకు శాపం.. రిజర్వాయర్లకు చేరని కృష్ణా నీళ్లు
ట్రెండింగ్ వార్తలు
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!
Watch: బెంచ్‌పై కూర్చొన్న కొందరు వ్యక్తులు.. వారి సమీపంలోని కుక్కను నోటకరుచుకెళ్లిన చిరుత
Watch: దసరా నాడు కొత్త కారు కొనుగోలు చేసిన వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Instagram Reels | రీల్స్ మోజులో బిడ్డను మరిచిన తల్లిదండ్రులు.. అలల్లో కొట్టుకుపోతున్న చిన్నారిని కాపాడిన యువకుడు!

