రుణమాఫీ అమలులో కాంగ్రెస్ విఫలం
రైతులకు ఏకకాలంలో రెండు లక్షల పంట రుణమాఫీ చేస్తామని ఇచ్చిన హామీని నెరవేర్చడంలో కాంగ్రెస్ పూర్తిగా విఫలమైందని బీఆర్ఎస్ గజ్వేల్ నియోజకవర్గ ఇన్చార్జి వంటేరు ప్రతాప్‌రెడ్డి అన్నారు. బుధవారం సిద్దిపేట జిల్లా గజ్వేల్ ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ఆయా మండలాలకు చెందిన నాయకులతో ఏర్పాటు చేసిన సమావేశం అనంతరం ఆయన మాట్లాడారు.
- బీఆర్ఎస్ గజ్వేల్ నియోజకవర్గ ఇన్చార్జి వంటేరు ప్రతాప్‌రెడ్డి
గజ్వేల్, ఆగస్టు 21: రైతులకు ఏకకాలంలో రెండు లక్షల పంట రుణమాఫీ చేస్తామని ఇచ్చిన హామీని నెరవేర్చడంలో కాంగ్రెస్ పూర్తిగా విఫలమైందని బీఆర్ఎస్ గజ్వేల్ నియోజకవర్గ ఇన్చార్జి వంటేరు ప్రతాప్‌రెడ్డి అన్నారు. బుధవారం సిద్దిపేట జిల్లా గజ్వేల్ ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ఆయా మండలాలకు చెందిన నాయకులతో ఏర్పాటు చేసిన సమావేశం అనంతరం ఆయన మాట్లాడారు. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, మాజీమంత్రి హరీశ్‌రావు ఆదేశాల మేరకు వందశాతం పంట రుణమాఫీ చేయాలని డిమాండ్ చేస్తూ గజ్వేల్‌లో గురువారం ఉద యం రైతులతో కలిసి పెద్ద ఎత్తున ర్యాలీ నిర్వహించనున్నట్లు తెలిపారు.
ఉదయం 9గంటలకు ప్రారంభమయ్యే ర్యాలీకి ఆయా గ్రామాల నుంచి రుణమాఫీ కాని రైతులు, నాయకులు, యువకులు అధికసంఖ్యలో హాజరై విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. నేటికీ 60శాతం మంది రైతులకు పంట రుణమాఫీ కాలేదని రోజూ బ్యాంకులు, అధికారుల చుట్టూ తిరుగుతున్నా వారు నిర్లక్ష్యపు సమాధానం చెబుతున్నారన్నారు. రైతుల విషయంలో కాంగ్రెస్ ప్రభుత్వం సవాలక్ష ఆంక్షలు పెట్టి అనేక రకాలుగా ఇబ్బంది పెడుతున్నదన్నారు.
రైతులు రోడ్డెక్కి గగ్గోలు పెడుతున్నా ప్రభుత్వం స్పందించడం లేదని, ప్రభుత్వానికి రైతుల ఉసురు తగులుతుందన్నారు. విడతల వారీగా చేపడుతామని చెప్పిన సీఎం రేవంత్‌రెడ్డి పంట రుణమాఫీ చేయడంలో విఫలమయ్యారని, వెంటనే రాజీనామా చేయాలన్నారు. ఎలాంటి ఆంక్షలు లేకుండా రెండు లక్షల పంటరుణమాఫీ చేయాలని డిమాండ్ చేశారు. సమావేశంలో రాష్ట్ర యువజన విభాగం నాయకుడు జుబెర్పాషా, మున్సిపల్ వైస్ చైర్మన్ జకీయోద్దీన్, మాజీ ఎంపీపీ పాండు, బీఆర్ఎస్ మండల అధ్యక్షులు శ్రీనివాస్‌గౌడ్, వెంకట్‌రెడ్డి, కుమార్‌యాదవ్, నాయకులు అమరేందర్, కిరణ్‌గౌడ్, స్వామిచారి, అహ్మద్, రవిరెడ్డి, కరీం, స్వామి పాల్గొన్నారు.
Read Today's Latest Medak News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Son of Kanakadurgamma | ‘సన్ ఆఫ్ కనకదుర్గమ్మ’ చిత్రం నుంచి అమ్మవారిగా నటి లయ పవర్ఫుల్ పోస్టర్ విడుదల
Manchu Manoj | పోతరాజు నేపథ్యంలో మంచు మనోజ్ హీరోగా RPA క్రియేషన్స్‌లో భారీ డివైన్ యాక్షన్ థ్రిల్లర్
Health Tips | మనలోని కొన్ని అలవాట్లే మోకాళ్ల నొప్పులకు దారితీస్తాయ్.. అవేంటో తెలుసా..?
Jagadish Reddy | సూర్యాపేటలో మతసామరస్యానికి ప్రతీకగా సామూహిక విందు.. జగదీష్ రెడ్డి ఆత్మీయ పలకరింపు
Nishad Kumar | చరిత్ర సృష్టించిన నిషద్ కుమార్.. నిన్న లాంగ్ జంప్, ఇవాళ హైజంప్‌లో గోల్డ్‌మెడల్
ట్రెండింగ్ వార్తలు
Instagram Reels | రీల్స్ మోజులో బిడ్డను మరిచిన తల్లిదండ్రులు.. అలల్లో కొట్టుకుపోతున్న చిన్నారిని కాపాడిన యువకుడు!
Kavathe Ekand Dussehra | దీపావళికి కాదు.. దసరా రాత్రంతా బాణసంచా కాల్చే గ్రామం!
Palapitta | దసరా వేళ కనిపించని పాలపిట్టలు.. తెలంగాణ రాష్ట్ర పక్షి కనుమరుగవుతోందా?
Bastar Dussehra | రావణ దహనం లేని దసరా.. 75 రోజులపాటు జరిగే బస్తర్ ఉత్సవం ప్రత్యేకత ఇదే!
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం

