వ్యసనాలకు దూరంగా ఉండాలి
విద్యార్థులు వ్యసనాల బారిన పడకుండా, ఓ లక్ష్యాన్ని ఎంచుకొని ఆ దిశగా కృషి చేయాలని సిద్దిపేట జడ్పీ చైర్పర్సన్ రోజాశర్మ, కలెక్టర్ ఎం.మను చౌదరి అన్నారు. బుధవారం ‘అంతర్జాతీయ మాదక ద్రవ్యాలు-అక్రమ రవాణా వ్యతిరేక దినోత్సవం’
- సిద్దిపేట జడ్పీ చైర్పర్సన్ రోజాశర్మ, కలెక్టర్ మనుచౌదరి
సిద్దిపేట అర్బన్, జూన్ 26 : విద్యార్థులు వ్యసనాల బారిన పడకుండా, ఓ లక్ష్యాన్ని ఎంచుకొని ఆ దిశగా కృషి చేయాలని సిద్దిపేట జడ్పీ చైర్పర్సన్ రోజాశర్మ, కలెక్టర్ ఎం.మను చౌదరి అన్నారు. బుధవారం ‘అంతర్జాతీయ మాదక ద్రవ్యాలు-అక్రమ రవాణా వ్యతిరేక దినోత్సవం’ సందర్భంగా మహిళా శిశు, వయోవృద్ధ్దుల సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో సిద్దిపేట పట్టణంలో ప్రభు త్వ జూనియర్ కళాశాల మైదానం నుంచి మోడల్ బస్టాండ్ వరకు నిర్వహించిన ర్యాలీని కలెక్టర్ మను చౌదరితో కలిసి జడ్పీ చైర్పర్సన్ రోజాశర్మ జెండా ఊపి ప్రారంభించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. మాదక ద్రవ్యాల నిర్మూలన వంటి విషయాలపై విద్యార్థులకు అవగాహన కల్పించాలని అధికారులకు సూచించారు. ఎక్కడైనా మాదక ద్రవ్యాలు విక్రయించినా, రవాణా చేసినా వెంటనే పోలీసులకు సమాచారం అందించాలన్నారు. పేర్లు గోప్యంగా ఉంచుతామన్నారు. జడ్పీ చైర్పర్సన్ రోజాశర్మ మాట్లాడుతూ.. వ్యసనాల కారణంగా చాలామంది జీవితాలు నాశనం చేసుకుంటున్నారని తెలిపారు. చదువుపైనే దృష్టిపెట్టి బంగారు భవిష్యత్తుకు బాటలు వేసుకోవాలన్నారు. అంతకుముందు ‘డ్రగ్స్ నో చెప్పండి’ అనే వాల్‌పోస్టర్‌ను ఆవిష్కరించారు. కార్యక్రమంలో జిల్లా సంక్షేమ అధికారి శారద, ఎక్సైజ్ సూపరింటెండెంట్ శ్రీనివాసమూర్తి, డీఆర్డీవో జయదేవ్ ఆర్యా పాల్గొన్నారు.
Read Today's Latest Medak News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Indian Athletes | పేదరికాన్ని జయించి.. ఆసియా క్రీడల్లో పతకాల పంట! మన క్రీడాకారుల స్ఫూర్తిదాయక విజయగాథలు
Saudi Arabia | రియాద్ విమానాశ్రయం దాడిలో 12మంది మృతి.. మూడొందల మందికి గాయాలు..!
IND vs WI | బౌలర్లకు మరో సవాల్.. పొట్టి సిరీస్‌లో నేడు కీలక మ్యాచ్..!
Dharman | రజనీకాంత్ ‘ధర్మన్’పై భారీ అంచనాలు.. 2027 సంక్రాంతి నుంచి వేసవికి వాయిదా?
CJP Protest | 7వేల మంది అరెస్ట్.. నిరసనపై కేంద్రం నిర్బంధకాండ.. సీజేపీ ఆందోళనలపై ఉక్కుపాదం
ట్రెండింగ్ వార్తలు
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?
Kareena Kapur | నటి కరీనా బ్యాగ్ ఖరీదు రూ.13 లక్షలపైనే.. ఏంటి స్పెషల్..?

