Medak | మహిళా చైతన్యానికి ప్రతీక ఐలమ్మ
-ఐలమ్మ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించిన మెదక్ కలెక్టర్ హరీశ్

మెదక్ : తెలంగాణ సాయుధ పోరాట యోధురాలు, సబ్బండ వర్ణాల ఆత్మగౌరవ ప్రతీక చాకలి ఐలమ్మ అని మెదక్ కలెక్టర్ హరీశ్ కొనియాడారు. చాకలి ఐలమ్మ జయంతిని పురస్కరించుకుని ఆదివారం కలెక్టరేట్ ఆవరణలో అధికారికంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో బీసీ అభివృద్ధి అధికారి జగదీశ్, జిల్లా యువజన క్రీడల అధికారి నాగరాజు, రజక సంఘం నాయకులతో కలిసి ఆమె చిత్రపటానికి కలెక్టర్ పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు.
అనంతరం ఆయన మాట్లాడుతూ మహిళా చైతన్యానికి, ఆత్మగౌరవానికి ప్రతీక ఐలమ్మ అని అన్నారు. ఆనాడు రజాకార్ల వ్యవస్థను, దేశ్‌ముఖ్‌లను ఎదురించి భూపోరాటం చేసిన వ్యక్తి ఐలమ్మ అని కొనియాడారు. మహిళలు ఆమెను స్ఫూర్తిగా తీసుకోవాలన్నారు. ఐలమ్మ జయంతిని రాష్ట్ర ప్రభుత్వం ఇక నుంచి ప్రతియేటా రాష్ట్ర వేడుకగా అధికారికంగా నిర్వహించాలని నిర్ణయించిందని కలెక్టర్ తెలిపారు. అనంతరం వివిధ రజక సంఘాల నాయకులు మాట్లాడుతూ ఆమె జీవితాన్ని ఆదర్శంగా తీసుకోవాలన్నారు. కార్యక్రమంలో రజక రిజర్వేషన్ పోరాట సమితి అధ్యక్షుడు కుమార్‌గౌడ్, రజక సంఘం జిల్లా అధ్యక్షుడు స్వామి, బీసీ సంక్షేమ సంఘం జిల్లా అధ్యక్షుడు గంగారాం, జిల్లా రజక సంఘం యూత్ అధ్యక్షుడు విజయ్, రాష్ట్ర రజక సంఘం ఎంప్లాయీస్ అధ్యక్షుడు నర్సింలు, జిల్లా రజక సంఘం కార్యదర్శి గణేశ్, జిల్లా కార్యవర్గ సభ్యులు, వసతి గృహ అధికారుల సంక్షేమ కార్యదర్శి శ్రీనివాస్, జిల్లా వసతి గృహ అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.
Read Today's Latest Medak News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

