పర్మినెంట్ ఏవో లేక అవస్థలు
సిద్దిపేట జిల్లా రాయపోల్ మండలంలో వ్యవసాయాధికారులు అందుబాటు లేక రైతులకు ఇక్కట్లు తప్పడం లేదు. గతంలో జీలుగు విత్తనాలు అందించడంలో ఆ శాఖ అధికారులు పట్టించుకోలేదు. దీంతో అప్పట్లో తీవ్ర విమర్శలు వచ్చినప్పటికీ మండలానికి పర్మినెంట్ వ్యవసాయాధికారి లేక రైతులు ఇబ్బందులు పడుతున్నారు.
- ఇన్చార్జి పాలనతో విసుగెత్తుతున్న రైతులు
- అందుబాటులో ఉండని వ్యవసాయాధికారులు
- సిద్దిపేట జిల్లా రాయపోల్ మండల రైతులకు తప్పని ఇబ్బందులు
రాయపోల్, జూలై 17: సిద్దిపేట జిల్లా రాయపోల్ మండలంలో వ్యవసాయాధికారులు అందుబాటు లేక రైతులకు ఇక్కట్లు తప్పడం లేదు. గతంలో జీలుగు విత్తనాలు అందించడంలో ఆ శాఖ అధికారులు పట్టించుకోలేదు. దీంతో అప్పట్లో తీవ్ర విమర్శలు వచ్చినప్పటికీ మండలానికి పర్మినెంట్ వ్యవసాయాధికారి లేక రైతులు ఇబ్బందులు పడుతున్నారు. వ్యవసాయం కోసం తగు సలహాలు, సూ చనలు ఇవ్వాల్సిన అధికారులు మండలానికి ఎప్పుడు వస్తున్నారో, ఎప్పుడు పోతున్నారో తెలియని పరిస్థితి నెలకొన్నది. గత సంవత్సరం నుంచి మండలానికి ఇన్చార్జి వ్యవసాయాధికారిని నియమించారు.
దీంతో రైతులకు కష్టాలు మొదలయ్యాయి. పర్మినెంట్ వ్యవసాయాధికారి లేక మండల రైతులు అనేక ఇబ్బందులు పడుతున్నారు. గజ్వేల్ ఏవోకు రాయపోల్ మండల ఇన్చార్జి బాధ్యతలు అప్పగించారు క్టస్టర్ ఏఈవోలు గ్రామాలకు వచ్చినా రైతులకు ఫలితం లేకుండా పోతున్నది. వానకాలంలో రైతులు తీసుకోవాల్సిన సలహాలు, సూచనలు ఇచ్చేవారు కరువయ్యారు. ఫర్టిలైజర్ షాపులను తనిఖీ చేయాల్సిన అధికారులు అటు వైపు కన్నెతి కూడా చూడడం లేదు. అన్ని రకాల విత్తనాలు అందుబాటులో ఉండే విధంగా వ్యవసాయాధికారులు చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. జిల్లా అధికారు లు స్పందించి మండలానికి పర్మినెంట్ ఏవో ను నియమించాలని రైతులు కోరుతున్నారు.
Read Today's Latest Medak News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
KTR | నిరుపేద విద్యార్థికి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ల్యాప్టాప్ అందజేత
KCR | అల్లం బుచ్చవ్వ మరణం పట్ల బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ సంతాపం
Varanasi | వారణాసిలో రామాయణ ఘట్టం.. రాజమౌళి మార్క్ వీరత్వంతో రాముడి పాత్రను చూపించనున్నారా?
Talasani Srinivas Yadav | భాగ్యలక్ష్మి అమ్మవారి సన్నిధిలో తలసాని శ్రీనివాస్ యాదవ్.. వీడియో
Krakow Shooting: పోలాండ్లో కాల్పుల ఘటన.. ఆరుగురు మృతి, గన్మెన్ ఇంట్లో మరిన్ని మృతదేహాలు
ట్రెండింగ్ వార్తలు
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి

