కొల్గూర్లో అభివృద్ధి అదుర్స్
గత ప్రభుత్వాల హయాంలో అభివృద్ధికి ఆమడ దూరంలో ఉన్న ఆ పల్లెటూరు నేడు కోట్లాది రూపాయల నిధులతో చేపట్టిన పనులతో కొత్త అందాలు సంతరించుకుంటున్నది
- అభివృద్ధిలో దూసుకుపోతున్న మంత్రి హరీశ్‌రావు దత్తత గ్రామం
- ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో వెనుకబడిన ఊరు
- మంత్రి సహకారంతో అభివృద్ధి పరుగులు
- కోట్లాది రూపాయలతో పనులు పూర్తి
- 135 మందికి దళితబంధు అమలు
- ఆపదలో ఉన్నవారికి అండగా నిలుస్తున్న మంత్రి
- హర్షం వ్యక్తం చేస్తున్న గ్రామస్తులు
గత ప్రభుత్వాల హయాంలో అభివృద్ధికి ఆమడ దూరంలో ఉన్న ఆ పల్లెటూరు నేడు కోట్లాది రూపాయల నిధులతో చేపట్టిన పనులతో కొత్త అందాలు సంతరించుకుంటున్నది. నిధులు విడుదల కావడమే తరువాయి పనులు చకచకా సాగుతుండడంతో గ్రామ ప్రజలు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. చిరకాల స్వప్నంగా ఉన్న ఎన్నో వసతులు ఈ గ్రామంలో సమకూరుతుండడానికి కారణం రాష్ట్ర ఆర్థిక, వైద్య ఆరోగ్య శాఖల మంత్రి తన్నీరు హరీశ్‌రావు దత్తత తీసుకోవడమే!
కొల్గూర్.. గజ్వేల్ మండలంలోని ఓ పల్లెటూరు.
ఒకప్పుడు ఈ గ్రామానికి వెళ్లాలంటే అధికారులు, ప్రజాప్రతినిధులు వెనుకడుగు వేసేవారు. కానీ నేడు స్వయానా రాష్ట్ర ఆర్థిక, వైద్య ఆరోగ్య శాఖల మంత్రి తన్నీరు హరీశ్‌రావు దత్తత తీసుకొని కోట్లాది రూపాయల నిధులు వెచ్చించి పలు అభివృద్ధి పనులు చేయిస్తుండడంతో అభివృద్ధి బాటన పయనిస్తున్నదీ గ్రామం. దీంతో గ్రామస్తులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. పల్లె ప్రగతి కార్యక్రమంలో భాగంగా కొల్గూర్ గ్రామానికి విచ్చేసిన మంత్రి హరీశ్‌రావు ఈ గ్రామాన్ని తాను దత్తత తీసుకుంటున్నట్లు గ్రామస్తులందరి సమక్షంలో ప్రకటించారు. గడిచిన కొద్ది సంవత్సరాల్లోనే గ్రామంలోప్రభుత్వ నిధులతో అభివృద్ధి పనులు చేపడుతుండడంతో నేడు కొల్గూర్ గ్రామం మండలంలోనే ఆదర్శంగా నిలుస్తున్నది. గ్రామంలో మోడల్ భవనాలు, మురుగుకాల్వలు, సీసీ రోడ్లు, అండర్ గ్రౌండ్ డ్రైనేజీ వ్యవస్థ, శుభకార్యాల కోసం గ్రామస్తులకు ఉపయోగపడేలా ఫంక్షన్ హాల్, రోడ్డు పక్కన భారీ మురుగుకాల్వ నిర్మాణాలు పూర్తయ్యాయి. త్వరలోనే పంచాయతీ కార్యాలయానికి నూతన భవన నిర్మాణ పనులు ప్రారంభం కానున్నాయి. ఆపదలో ఉన్న గ్రామస్తులను సీఎంఆర్ఎఫ్ పథకం ద్వారా ఆదుకోవడం, అర్హులైన వారందరికీ పింఛన్ల మంజూరీ వంటి పథకాలు అమలుతో గ్రామస్తులకు లబ్ధి చేకూరుతున్నది.
135 కుటుంబాలకు దళితబంధు అమలు..
తెలంగాణ ప్రభుత్వం దళితుల అభ్యున్నతి కోసం ప్రవేశపెట్టిన దళితబంధు పథకంతో కొల్గూర్ గ్రామంలోని ఎన్నో కుటుంబాల్లో వెలుగులు నింపుతున్నది. గ్రామంలో ఈ పథకం ద్వారా మొత్తం 135 మందికి లబ్ధి చేకూరింది. ప్రతి కుటుంబానికి రూ.10 లక్షలు బ్యాంకు ఖాతాలో జమ చేయడంతో కిరాణా, బ్యాంగిల్ స్టోర్, సెంట్రింగ్ సామగ్రి, టిఫిన్ సెంటర్, టెంట్‌హౌస్, డెయిరీ ఫాం వంటి వ్యాపారాల ద్వారా జీవనోపాధి పొందుతున్నారు. సీఎం కేసీఆర్, మంత్రి హరీశ్‌రావు ప్రత్యేక చొరవతో కొల్గూర్ను ఎంపిక చేయడంపై గ్రామస్తుల్లో హర్షాతిరేకాలు వ్యక్తమవుతున్నాయి.
గ్రామంలో చేపట్టిన అభివృద్ధి పనులివే..
- రూ.50 లక్షల ఖర్చుతో మురుగు కాల్వలు, సీసీ రోడ్లు
- రూ.20 లక్షల వ్యయంతో రెండు అంగన్వాడీ భవనాలు
- రూ.25 లక్షల ఖర్చుతో సీసీ రోడ్లు, మురుగుకాల్వలు
- రెండో దఫా రూ.12 లక్షల వ్యయంతో మురుగుకాల్వలు
- రూ.50 లక్షలతో నిర్మించిన ఫంక్షన్‌హాల్‌కు అదనంగా మరో రూ.50 లక్షల వ్యయంతో ఫెన్సింగ్, అసంపూర్తి పనులు పూర్తి
- రూ.40 లక్షల ఖర్చుతో పాఠశాల భవనం
- గ్రామంలోని విజయ డెయిరీ రైతులకు రూ.70 లక్షల రుణాలు
గ్రామంలో అభివృద్ధి పనులు వేగవంతం
గ్రామంలో గడిచిన రెండేళ్ల కాలంలో అభివృద్ధి పనులు వేగవంతంగా పూర్తి చేసుకున్నాం. హరీశ్‌రావు దత్తత తీసుకున్న తర్వాత గ్రామంలో రూ.1.50 కోట్లపైచిలుకు వ్యయంతో చేపట్టిన అభివృద్ధి పనులు పూర్తయ్యాయి. అసంపూర్తిగా ఉన్న పనులను త్వరలోనే మంత్రి హరీశ్‌రావు సహకారంతో పూర్తి చేసుకుంటాం.
-మల్లం రాజు, సర్పంచ్, కొల్గూర్
మంత్రి హరీశ్‌రావు సహకారం మరువలేనిది..
కొల్గూర్ గ్రామాన్ని మంత్రి హరీశ్‌రావు సహకారంతోనే అభివృద్ధి చేసుకున్నాం. గతంతో పోలిస్తే నేడు మండంలోనే కొల్గూర్ అభివృద్ధిలో అదర్శంగా నిలిచింది. ఇందులో మంత్రి కృషి మరిచిపోలేనిది. సీఎం కేసీఆర్, మంత్రి హరీశ్‌రావుల కృషి ఫలితంగా 135 మందికి దళితబంధు అమలుకావడం సంతోషంగా ఉంది. మా హయాంలో అభివృద్ధి పనులు జరగడం సంతోషంగా ఉంది.
-గొడుగు జ్యోతిస్వామి, ఎంపీటీసీ, కొల్గూర్
Read Today's Latest Medak News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Yusuf Pathan | ఎన్డీయేలో చేరిక.. ప్లాట్ కానుక.. ఇంటిపక్క భూమిని యూసుఫ్‌కి కేటాయించిన గుజరాత్ ప్రభుత్వం
Italy | పిల్లలు విధ్వంసానికి పాల్పడితే,తల్లిదండ్రులు పరిహారం చెల్లించాలి! ఇటలీ ప్రభుత్వం కొత్త నిబంధన
Delhi Pollution | ఢిల్లీలో క్షీణించిన వాయు నాణ్యత జీఆర్ఏపీ-1 ఆంక్షలు అమలు
Kenya | స్వర్గం పేరుతో 190 మంది పిల్లలకు ఆకలి చావులు.. కెన్యాలో మత గురువు మూఢ బోధనలు
TGSRTC | తిరుగు ప్రయాణమూ భారమే..! ఆర్టీసీ, ప్రైవేటు వాహనాల్లో చార్జీల మోత
ట్రెండింగ్ వార్తలు
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!
Watch: బెంచ్‌పై కూర్చొన్న కొందరు వ్యక్తులు.. వారి సమీపంలోని కుక్కను నోటకరుచుకెళ్లిన చిరుత
Watch: దసరా నాడు కొత్త కారు కొనుగోలు చేసిన వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Instagram Reels | రీల్స్ మోజులో బిడ్డను మరిచిన తల్లిదండ్రులు.. అలల్లో కొట్టుకుపోతున్న చిన్నారిని కాపాడిన యువకుడు!

