అక్రమంగా గుట్కా తరలిస్తే చర్యలు
అక్రమంగా నిషేధిత గుట్కా, పాన్ మసాలాలు తరలిస్తే చర్యలు తీసుకుంటామని సంగారెడ్డి జిల్లా ఎస్పీ చెన్నూరి రూపేశ్ తెలిపారు. సోమవారం మండలపరిధిలోని బుధేరా పోలీస్‌స్టేషన్‌లో విలేకరులతో మాట్లాడారు. ప్రభుత్వం నిషేధిత వస్తువులను అక్రమంగా తరలిస్తే కేసులు నమోదు చేసి, జైలుకు పంపిస్తామన్నారు.
- సంగారెడ్డి ఎస్పీ రూపేశ్
మునిపల్లి, జూలై 15: అక్రమంగా నిషేధిత గుట్కా, పాన్ మసాలాలు తరలిస్తే చర్యలు తీసుకుంటామని సంగారెడ్డి జిల్లా ఎస్పీ చెన్నూరి రూపేశ్ తెలిపారు. సోమవారం మండలపరిధిలోని బుధేరా పోలీస్‌స్టేషన్‌లో విలేకరులతో మాట్లాడారు. ప్రభుత్వం నిషేధిత వస్తువులను అక్రమంగా తరలిస్తే కేసులు నమోదు చేసి, జైలుకు పంపిస్తామన్నారు. టాస్క్‌ఫోర్స్ పోలీసులు బృందాలుగా ఏర్పడి పక్క రాష్ర్టాల నుంచి తెలంగాణలోకి నిషేధిత గుట్కా, పాన్ మసాలాలు రాకుండా ప్రత్యేక చర్యలు తీసుకుంటారని చెప్పారు. కంకోల్ శివారులోని ముంబయి జాతీయ రహదారిపై డెక్కన్ టోల్‌ప్లాజా వద్ద రాష్ర్టానికి భారీగా గుట్కా, పాన్ మసాలాలు తరలిస్తున్నారన్న సమాచారం మేరకు ఆదివారం పోలీసులు వాహన తనిఖీ చేపట్టారు.
వాహనంలో నిషేధిత గుట్కా, తంబాకును పట్టుకున్నట్లు తెలిపారు. అక్రమంగా తరలిస్తున్న వారిని అదుపులోకి తీసుకొని విచారించగా బీదర్‌లోని అర్ఫత్ ట్రాన్స్పోర్ట్ కంపెనీ యజమాని అర్ఫత్ ఆదేశానుసారం హైదరాబాద్‌లోని కాటేదాన్‌కు తరలిస్తున్నట్లు తెలిపారు. గుట్కా తరలిస్తున్న షేక్ షబ్బీర్, అర్ఫత్, తవ్సిఫ్లను అదుపులోకి తీసుకున్నామని ఎస్పీ తెలిపారు. సంగారెడ్డి డీఎస్పీ సతయ్య గౌడ్, కొండాపూర్ సీఐ చంద్రయ్య, సీసీఎస్ సీఐ మల్లయ్య, సీసీఎస్ ఎస్సై శ్రీకాంత్, మునిపల్లి ఎస్సై రాజేష్శ్నాయక్, సిబ్బంది ఉన్నారు.
Read Today's Latest Medak News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
అరవైలోనూ ఇరవైలా ఆలోచిస్తున్నారు.. ముదిమిలోనూ మదిలో ఒకరికి చోటిస్తున్నారు!
Watch: పైనాపిల్స్ లోడ్‌తో వెళ్తున్న వాహనం బోల్తా.. తర్వాత ఏం జరిగిందంటే?
1 Woman 3 Nominations | స్థానిక సంస్థల ఎన్నికల్లో షాక్ ఇచ్చిన మహిళ.. మూడు దుస్తుల్లో మూడుసార్లు నామినేషన్
Offbeat | బీచ్‌లో గర్ల్‌ఫ్రెండ్‌కు డైమండ్ రింగ్‌తో ప్రపోజ్.. అంతలోనే రింగ్ మాయం.. ఏం జరిగిందంటే..!
Offbeat | పార్కులో ఒంటరిగా కూర్చున్న మహిళకు రూ.2,500 జరిమానా.. కారణం తెలిస్తే షాకవ్వాల్సిందే..!

