ప్రాణాలు తీసిన మైనర్‌పై వేధింపులు
వివాహేతర సంబంధం కొనసాగిం చడమే కాకుండా మైనర్‌ను వేధిస్తుండడంతో కూతురిని కా పాడుకునేందుకు కొందరి సాయంతో సహజీవనం చేస్తున్న వ్యక్తిని మహిళ హత్య చేసిందని మెదక్ డీఎస్పీ సైదులు తెలిపారు.
- మహిళతో వివాహేతర సంబంధం
- ఆమె మైనర్ కూతురిపై లైంగిక వేధింపులు
- బంధువులతో కలిసి హత్య చేసిన మహిళ
- హత్యకు పాల్పడిన ఏడుగురు అరెస్టు
- 36 గంటల్లో కేసును ఛేదించిన పోలీసులు
- ఎస్సై శ్రీనివాస్‌గౌడ్, సిబ్బందికి రివార్డులు
- వివరాలు వెల్లడించిన మెదక్ డీఎస్పీ సైదులు
కొల్చారం, మే 27 : వివాహేతర సంబంధం కొనసాగిం చడమే కాకుండా మైనర్‌ను వేధిస్తుండడంతో కూతురిని కాపాడుకునేందుకు కొందరి సాయంతో సహజీవనం చేస్తున్న వ్యక్తిని మహిళ హత్య చేసిందని మెదక్ డీఎస్పీ సైదులు తెలిపారు. ఏడుపాయల శివారులోని మంజీరా నదిలో గుర్తు తె లియని వ్యక్తి మృతదేహం రెండు రోజుల క్రితం వెలుగులోకి వచ్చిన విషయం విధితమే. ఎస్పీ ఆదేశాలతో మెదక్ రూరల్ సీఐ విజయ్ ఆధ్వర్యంలో ఎస్సై శ్రీనివాస్‌గౌడ్ మూడు బృం దాలుగా ఏర్పడి కేసును ఛాలెంజ్‌గా తీసుకుని శనివారం నిం దితులను అరెస్టు చేసి, రిమాండ్‌కు తరలించారు.
కేసు వివరాలు.. పటాన్చెరు మండలం పాటి ఘన్పూర్ గ్రామానికి చెందిన కావలి రాములు మూడేళ్లుగా కొల్చారం మండలం నందిగామకు చెందిన మ్యాదరి వీరమణితో మూ డేండ్లుగా వివాహేతర సంబంధం కొనసాగిస్తున్నాడు. కాగా, రాములు సహజీవనం చేస్తున్న మహిళ మైనర్ కుమార్తెతో పలుమార్లు అసభ్యంగా ప్రవర్తించడాన్ని వీరమణి గుర్తించిం ది. దీంతో రాములును దూరం పెట్టినా వేధింపులు మాత్రం ఆగలేదు. ఈ విషయాన్ని వీరమణి బంధువుల దృష్టికి తీసుకెళ్లగా రాములును హతమార్చడానికి పథకం వేశారు. ఇందు లో భాగంగా ఈ నెల 17న వీరమణి తన బంధువులు, స్నే హితులు కౌడిపల్లికి చెందిన మ్యాదరి నర్సింహులు, వీర్‌సింగ్, పట్నం మహేశ్, మహ్మద్ ఆరీఫ్, మెదక్ పట్టణం ఫతేనగర్‌కు చెందిన అనిరుధ్, మ్యాదరి స్వప్న మెదక్ పట్టణానికి వచ్చారు.
రాములును మెదక్‌కు రప్పించి, అనిరుధ్ ఇంటికి తీసుకువచ్చారు. ఈ క్రమంలో ఇనుపరాడ్‌తో రాములు తల పై కొట్టి చంపేశారు. అనంతరం మృతదేహాన్ని గోనె సంచిలో కట్టి ఆటోలో కొల్చారం మండల శివారులోని ఏడుపాయల చెక్‌డ్యాం సమీపంలోని మంజీరాలో పడేసి వెళ్లిపోయారు. ఈ నెల 25న హత్యోదంతం వెలుగులోకి వచ్చింది. మృతదేహంపై ‘ఓఎం’గుర్తుతోపాటు తెలుగులోజంగయ్య, వీరమని పచ్చబొట్లు పోలీసులు గుర్తించారు. లభ్యమైన ఆనవాళ్ల ఆధారంగా పోలీసులు పలు కోణాల్లో పరిశోధించారు.
బీడీఎల్ భానూర్ పోలీస్‌స్టేషన్‌లో ఓ వ్యక్తి అదృశ్యమైన కేసు నమోదైన విషయాన్ని పరిగణలోకి తీసుకుని దర్యాప్తు చేప ట్టారు.హత్యకు కారణమైన ఏడుగురిని శనివారం అదుపులోకి తీసుకున్నారు. వారి వద్ద ఇనుపరాడ్, ఆటోను సీజ్ చేసి రిమాండ్‌కు తరలించినట్లు మెదక్ డీఎస్పీ సైదులు వెల్లడించారు. హత్య కేసును 36 గంటల్లోనే ఛేదించిన కొల్చారం ఎస్సై శ్రీనివాస్‌గౌడ్‌తోపాటు పొలీసులను డీఎస్పీ అభినందించారు. ఎస్పీ ద్వారా రివార్డు అందజేసేందుకు కృషి చేస్తానన్నారు. సమావేశంలో మెదక్ రూరల్ సీఐ విజయ్, కొల్చా రం ఎస్సై శ్రీనివాస్‌గౌడ్, ఏఎస్సై తారాసింగ్ ఉన్నారు.
Read Today's Latest Medak News in Telugu and Telugu News
- Tags
- minor daughter
- murder
- Police
- Woman
RELATED ARTICLES
తాజా వార్తలు
Son of Kanakadurgamma | ‘సన్ ఆఫ్ కనకదుర్గమ్మ’ చిత్రం నుంచి అమ్మవారిగా నటి లయ పవర్ఫుల్ పోస్టర్ విడుదల
Manchu Manoj | పోతరాజు నేపథ్యంలో మంచు మనోజ్ హీరోగా RPA క్రియేషన్స్‌లో భారీ డివైన్ యాక్షన్ థ్రిల్లర్
Health Tips | మనలోని కొన్ని అలవాట్లే మోకాళ్ల నొప్పులకు దారితీస్తాయ్.. అవేంటో తెలుసా..?
Jagadish Reddy | సూర్యాపేటలో మతసామరస్యానికి ప్రతీకగా సామూహిక విందు.. జగదీష్ రెడ్డి ఆత్మీయ పలకరింపు
Nishad Kumar | చరిత్ర సృష్టించిన నిషద్ కుమార్.. నిన్న లాంగ్ జంప్, ఇవాళ హైజంప్‌లో గోల్డ్‌మెడల్
ట్రెండింగ్ వార్తలు
Instagram Reels | రీల్స్ మోజులో బిడ్డను మరిచిన తల్లిదండ్రులు.. అలల్లో కొట్టుకుపోతున్న చిన్నారిని కాపాడిన యువకుడు!
Kavathe Ekand Dussehra | దీపావళికి కాదు.. దసరా రాత్రంతా బాణసంచా కాల్చే గ్రామం!
Palapitta | దసరా వేళ కనిపించని పాలపిట్టలు.. తెలంగాణ రాష్ట్ర పక్షి కనుమరుగవుతోందా?
Bastar Dussehra | రావణ దహనం లేని దసరా.. 75 రోజులపాటు జరిగే బస్తర్ ఉత్సవం ప్రత్యేకత ఇదే!
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం

