కొల్కూర్‌లో 8 బైకులు దహనం
సంగారెడ్డి జిల్లా సదాశివపేట మండలం కొల్కూర్ గ్రామం లో బైక్‌ల దహనం మిస్టరీగా మారింది. 15 రోజుల్లో గ్రామంలో 8 బైక్‌లను తగులబెట్టారు. అసలు బైక్‌లు ఎవరు తగులబెడుతున్నారో ఎవరికీ అంతుపట్టడం లేదు.
సదాశివపేట,అక్టోబర్ 8: సంగారెడ్డి జిల్లా సదాశివపేట మండలం కొల్కూర్ గ్రామం లో బైక్‌ల దహనం మిస్టరీగా మారింది. 15 రోజుల్లో గ్రామంలో 8 బైక్‌లను తగులబెట్టారు. అసలు బైక్‌లు ఎవరు తగులబెడుతున్నారో ఎవరికీ అంతుపట్టడం లేదు. రాత్రివేళల్లో దుండగులు బైక్‌పై పెట్రోల్ పోసి నిప్పంటిస్తుండడంతో లక్షలు వెచ్చించి కొన్న బైక్‌లు బుగ్గిపాలవుతున్నాయి. దీంతో గ్రామస్తులు భయాందోళనకు గురుతున్నారు.
ఒకే రోజు రెండు బైక్‌లు తగులబెట్టారు. ఇప్పటి వరకు రాయల్ ఎన్ఫీల్డ్, పల్సర్, యూనికాన్, ఫ్యాషన్, షైన్ బైక్‌లకు దుండగులు దహనం చేశారు. వారం రోజుల నుంచి గ్రామస్తులు నిద్ర లేకుండా బైక్‌లకు కాపలా కాస్తున్నారు. పోలీసులు సైతం గ్రామ యువకులతో కలిసి పహారా కాస్తున్నారు. ఎవరూ భయాందోళనకు గురికావొద్దని పోలీసులు వివరిస్తున్నారు. నిందితులను పట్టుకుని తమకు న్యాయం చేయాలని బాధితులు కోరుతున్నారు. పోలీసులు గ్రామంలోని ప్రధాన వీధుల్లో 14 సీసీ కెమెరాలు ఏర్పా టు చేశారు.
కొందరు గ్రామస్తులు వారి ఇం టి వద్ద సీసీ కెమెరాలను ఏర్పాటు చేసుకున్నారు. సీఐ మహేశ్‌గౌడ్ ఆధ్వర్యంలో సీసీ కెమెరాల ఆవశ్యకతపై అవగాహన కల్పించడంతో 20మందికిపైగా గ్రామస్తులు స్వచ్ఛందంగా సీసీ కెమెరాలు అమర్చుకున్నారు. కాగా, ఈ ఘటనలపై సదాశివపేట సీఐ మహేశ్‌గౌడ్ స్పందించారు. బాధితుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి పది మందిని అదుపులోకి తీసుకుని విచారిస్తున్న ట్లు తెలిపారు. త్వరలోనే నిందితులను పట్టుకుంటామని, గ్రామంలో నిఘా కొనసాగుతున్నదన్నారు. గ్రామంలో 14 సీసీ కెమెరాలను ఏర్పాటు చేసినట్లు సీఐ తెలిపారు.
Read Today's Latest Medak News in Telugu and Telugu News
- Tags
- bikes burnt
- Kollu
- Sangareddy
RELATED ARTICLES
తాజా వార్తలు
కారేపల్లిలో పలు అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలు ప్రారంభం
Arrest | ఉస్మానియా యూనివర్సిటీ విద్యార్థుల ధర్నా, అరెస్ట్
Weight Loss Medicine | బరువు తగ్గించే మందులను వైద్య సలహా లేకుండా వాడితే ప్రమాదం.. ఎందుకంటే..?
Chandrayan | ‘చంద్రయాన్’ మూవీ రివ్యూ.. గ్రామీణ కుర్రాళ్ల అంతరిక్ష కల ఎలా ఉందంటే?
‘తెలంగాణ ఉద్యమస్ఫూర్తి ప్రతీక కాళోజీ’
ట్రెండింగ్ వార్తలు
పెళ్లికొడుకు, పెళ్లికూతురు ఇద్దరూ పురుషులే.. హిమాచల్ ప్రదేశ్‌లో వింత పండుగ!
Watch: బైకర్పై ఏనుగు దాడి.. అతడ్ని పలుమార్లు తొక్కిన వీడియో వైరల్
Watch: దంపతులు టీవీ చూస్తుండగా ఇంట్లోకి ప్రవేశించిన చిరుత.. తర్వాత ఏం జరిగిందంటే?
Viral News | ఎన్‌క్లోజర్ నుంచి సొరంగం తవ్వి తప్పించుకున్న పెద్దపులి.. తర్వాత ఏమైందంటే..!
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!

