శనివారం 28 మార్చి 2020
Medak - Feb 22, 2020 , T00:10

‘పట్టణప్రగతి’కి ప్రణాళికలు సిద్ధం

‘పట్టణప్రగతి’కి ప్రణాళికలు సిద్ధం

నర్సాపూర్‌, నమస్తేతెలంగాణ : నర్సాపూర్‌ మున్సిపల్‌ పరిధిలో చేపట్టనున్న పట్టణప్రగతి కార్యక్రమాన్ని విజయవంతంగా అమలు  పరిచేందుకు, ప్రజాప్రతినిధులు, అధికారులను సమన్వయ పరిచేందుకు ఒక్కో వార్డుకు ఒక్కో అధికారిని నియమిస్తూ కలెక్టర్‌ ధర్మారెడ్డి ఉత్తర్వులు జారీ చేశారు. పట్టణంలోని 15 వార్డులకు 15 మంది అధికారులను నియమించారు. నర్సాపూర్‌తో పాటు వివిధ మండలాలకు చెందిన అధికారులు విధులు నిర్వర్తించాల్సి ఉంటుంది.


logo