మంగళవారం 27 అక్టోబర్ 2020
Mancherial - Mar 10, 2020 , 01:10:16

వ్యాపార ధోరణి వద్దు

వ్యాపార ధోరణి వద్దు

మంచిర్యాల అగ్రికల్చర్‌: విద్యా సంస్థలు వ్యా పార ధోరణిని వీడాలని పాఠశాల యాజమాన్యాల సంఘం(ట్రస్మా) రాష్ట్ర అధ్యక్షుడు శేఖర్‌ రావు అన్నారు. జిల్లా కేంద్రంలో సోమవారం ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడారు. రా ష్ట్రంలోని నారాయణ, శ్రీ చైతన్య విద్యా సంస్థలు కార్పొరేట్‌ ముసుగులో విద్యార్థులను మానసిక ఒత్తిడికి గురి చేస్తూ మరణానికి కారణమవుతున్నాయని మండిపడ్డారు. రోబోలుగా తయారు చేస్తూ కేవలం మార్కులిచ్చే మిషన్లుగా పరిగణించి వారి ఆత్మాభిమానాన్ని దెబ్బతీస్తున్నాయని పేర్కొన్నా రు. విద్యార్థుల తల్లిదండ్రుల నుంచి లక్షలాది రూ పాయలు వసూలు చేస్తూ ఆర్థిక ఇబ్బందులకు గురి చేసే దోపిడీ కేంద్రాలుగా తయారయ్యాయన్నారు. కొన్ని కళాశాలలైతే ఎలాంటి ప్రభుత్వ గు ర్తింపు లేకుండా అద్దె భవనాల్లో అరకొర వసతులతో విద్యా సంస్థలు నడిపిస్తున్నాయన్నారు. రా ష్ట్ర వ్యాప్తంగా ఈ విద్యా సంస్థలు వ్యాపార ధోరణితో కొనసాగుతున్నాయన్నారు. నిబంధనలకు విరుద్ధంగా నడుస్తున్న ఆంధ్ర కార్పొరేటు విద్యా సంస్థలను మూసివేయాలనీ, అప్పటి వరకు పో రాడతామన్నారు. సీఎం కేసీఆర్‌, విద్యాశాఖాధికారులు, తల్లిదండ్రులు, మేధావులు, విద్యావేత్తలు, విద్యార్థి సంఘాలు తోడ్పడాలని కోరారు. ట్రస్మా రాష్ట్ర సంయుక్త కార్యదర్శి వొడ్నాల శ్రీనివాస్‌, ఉపాధ్యక్షులు కస్తూరి పద్మచరణ్‌, దామెర సిద్ద య్య, విష్ణు, శ్రీకాంత్‌ రెడ్డి, సురభి శరత్‌ కుమార్‌, గోపతి సత్తయ్య, ఉస్మాన్‌ పాషా, విక్రం రావు, తదితరులు పాల్గొన్నారు.


logo