మక్తల్, జూన్ 1: క్రూడ్ ఆయిల్తోపాటు, ఇంధనం ఇబ్బందులు తలెత్తిన నేపథ్యంలో గ్రామీణ ప్రాంతాల్లో గ్యాస్ కోసం ఎదురు చూపులు.. కట్టెల కోసం మహిళలు అడవిబాట పటాల్సిన పరిస్థితులు తలెత్తుతున్నాయి. గతంలో గ్యాస్ కోసం ఇన్ని కష్టా లు పడకుండా గ్యాస్ బుక్ చేసిన వెంటనే రెండు, మూడు రోజులకే వస్తుండడంతో గ్రామీణ ప్రాంతాల్లోని ప్రజలు ఎంతో సంతోషంతో ఉండే వాళ్లమని మహిళలు చేబుతున్నారు. మూడునెలలుగా గ్యాస్ కోసం పడిగాపులు కాస్తూ జీవించాల్సిన పరిస్థితులు తలెత్తుతున్నాయని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
గ్రామీణ ప్రాంతాలకు గ్యాస్ సిలిండర్లు సమయానికి అందకపోవడంతో మహిళలు కట్టెల పొయ్యిలవైపు మొగ్గుచూపుతున్నారు. సిలిండర్ బుకింగ్ చేసిన వారాల తరబడి డెలివరీ కాకపోవడంతో కుటుంబాల ఆకలి తీర్చేందుకు తల్లులు అడవుల్లోకి వెళ్లి, ఎర్రటి ఎండలో కట్టెలు మూటకట్టుకొని వస్తున్న దృశ్యాలు హృదయ విదారకంగా మారాయి. ఉద యం ఇంట్లో పనులు ముగించుకొని చేతిలో గొడ్డలి పట్టుకొని అడవిబాట పడుతూ కట్టెల కోసం ఎండ ను సైతం లెకచేయకుండా మైళ్ల దూరం నడుచుకుంటూ వెళ్లి కట్టెలను సేకరించి వాటిని తలపై మో సుకుంటూ ఇంటికి తీసుకరావడం ఒకప్పటి రోజు లు గుర్తుకువస్తున్నాయని ఆవేదన చెందుతున్నారు. సమయానికి గ్యాస్ సిలిండర్ రాకపోవడంతో పొగ లో వంటలను చేస్తుండడం వల్ల మహిళలు తీవ్ర ఆరోగ్య సమస్యలను ఎదురొవడంతోపాటు, కంటి మంటలు, శ్వాసకోశ ఇబ్బందులు, ఊపిరితిత్తుల వ్యాధులు పెరుగుతున్నాయని మహిళలు తమ బాధలను వ్యక్తం చేస్తున్నారు.
గ్యాస్ కోసం ముందస్తుగానే డబ్బులు చెల్లిస్తున్నప్పటికీ సిలిండర్ మా త్రం సమయానికి రాకపోవడంతో చివరకు అడవి ఆధారమవుతుందంటూ మహిళలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పెరుగుతున్న గ్యాస్ ధరలు, సరఫరాలో నిర్లక్ష్యం కలిపి పేద కుటుంబాలపై మరింత భారం మోపుతూ ప్రభుత్వ పథకాల ప్రచారంలో కనిపించిన ఉజ్వల వెలుగు గ్రామాల్లో మాత్రం ఇప్పుడు కట్టెల పొగగా మారిందని ప్రజలు విమర్శిస్తున్నారు. సిలిండర్ బుక్ చేసిన 45రోజుల తర్వాత అది ఎప్పుడొస్తుందో తెలవక ఇబ్బందులు పడుతూ కుటుంబాల వంట అవసరాల కోసం మహిళలు అడవుల్లో కి వెళ్లి కట్టెలు కొట్టుకొని తెచ్చుకొనే పరిస్థితి తలెత్తిందని మహిళలు తీవ్ర ఆవేదన చెందుతున్నారు. గ్యా స్ సిలిండర్ల కొరత వల్ల మహిళలకు కట్టెల తెచ్చుకోవడం నిత్యకృత్యంగా మారిందని మహిళలు తమ గోడును వెళ్లగక్కారు. అధికారులు స్పం దించి గ్యాస్ సిలిండర్లు సరైన సమయంలో అందేలా చర్యలు తీసుకోవాలని మహిళలు కోరుతున్నారు.