పేదలకు మెరుగైన వైద్యం అందిస్తాం
పేదలకు మెరుగైన, కార్పొరే ట్ స్థాయి వైద్య సేవలు అందించేందుకు జిల్లాకు బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ మెడికల్ కళాశాలను మం జూరు చేశారని గద్వాల ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్‌రెడ్డి పేర్కొన్నారు. మెడికల్ కళాశాల నిర్మాణ, జి ల్లా దవాఖాన పనులను అధికారులతో కలిసి బుధవారం పరిశీలించారు.
- ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్‌రెడ్డి
గద్వాల, జూన్ 5 : పేదలకు మెరుగైన, కార్పొరే ట్ స్థాయి వైద్య సేవలు అందించేందుకు జిల్లాకు బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ మెడికల్ కళాశాలను మం జూరు చేశారని గద్వాల ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్‌రెడ్డి పేర్కొన్నారు. మెడికల్ కళాశాల నిర్మాణ, జి ల్లా దవాఖాన పనులను అధికారులతో కలిసి బుధవారం పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తెలంగాణ తొలి ముఖ్యమంత్రి ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించాలనే లక్ష్యం తో జిల్లాకో మెడికల్ కళాశాలను మంజూరు చేశార ని గుర్తు చేశారు. ప్రస్తుత ప్రభుత్వం మెడికల్ కళాశాలకు ప్రిన్సిపాల్‌తోపాటు అవసరమైన పోస్టులను భర్తీ చేసిందన్నారు. త్వరలో అన్ని హంగులు, పరికరాలతో మెడికల్ కళాశాల, దవాఖానను ప్రా రంభించేలా చర్యలు తీసుకుంటామన్నారు. త్వరలోనే మెడికల్ కళాశాలలో అడ్మిషన్లు, తరగతులు ప్రారంభమవుతాయన్నారు. మెడికల్ కళాశాలలో విద్యార్థులకు అవసరమైన సౌకర్యాలు కల్పిస్తామన్నారు. పేదలకు మెరుగైన వైద్యం అందించేందుకు తమ వంతు కృషి చేస్తామన్నారు. ఎమ్మెల్యే వెంట మున్సిపల్ వైస్‌చైర్మన్ బాబర్, ఎంపీపీ విజయ్‌కుమార్, కౌన్సిలర్లు దౌలు, నరహరి శ్రీనివాసులు, మురళి, నాయకులు గడ్డం కృష్ణారెడ్డి, వేణుగోపాల్, జంబు రామన్‌గౌడ్, అంగడి బస్వరాజ్ ఉన్నారు.
రైతుబీమా చెక్కు అందజేత..
మల్దకల్ మండలం మల్లెందొడ్డికి చెందిన రైతు నగేశ్ ఇటీవల మృతి చెందాడు. బాధిత కుటుంబానికి రూ.5లక్షల రైతుబీమా మంజూరు కాగా అందు కు సంబంధించిన చెక్కును మృతుడి భార్య పద్మమ్మకు జిల్లా కేంద్రంలోని క్యాంప్ కార్యాలయంలో ఎమ్మెల్యే అందజేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ప్రభుత్వం అందించే ఈ సాయాన్ని రైతు కుటుంబాలు సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. కార్యక్రమంలో నాయకుడు వెంకటేశ్వర్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
Read Today's Latest Mahabubnagar News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Neha Bora | నేహాబోరాకు ఢిల్లీ హై కోర్టు షాక్.. పీస్ బాండ్‌కు వ్యతిరేకంగా దాఖలు చేసిన పిటిషన్ కొట్టివేత
‘ముదిరాజ్‌లను బీసీ-ఏలో చేర్చే హామీని వ్యతిరేకిస్తున్నాం’
BCCI | బీసీసీఐ నెట్‌వర్త్ తెలిస్తే షాకే.. టాప్ 10 రిచెస్ట్ క్రికెట్ బోర్డులివే
రోడ్డు ప్రమాదాల నివారణకు పటిష్ట చర్యలు : డీఆర్వో పద్మావతి
పానగల్ ఛాయా సోమేశ్వరాలయ అభివృద్ధికి రూ.20 కోట్లు మంజూరు
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

